రీ ఎంట్రీకి రెడీ అవుతున్న పవన్ కళ్యాన్ హీరోయిన్, కీర్తి రెడ్డి ఏ సినిమాలో కనిపించబోతుందంటే..?
ఒకప్పుడు హీరోయిన్లు గా వెండితెరపై సందడి చేసి..కాస్త గ్యాప్ ఇచ్చిన తారలంతా.. రీఎంట్రీకి రెడీ అవుతున్నారు. ఇక వాళ్లను ఆడియన్స్ మర్చిపోయారు అనుకున్న టైమ్ లో.. సడెన్ గా రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ఇక తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ అవుతుంది పవన్ కళ్యాణ్ హీరోయిన్.
Pawan Kalyan Heroines
కీర్తి రెడ్డి.. ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉందే.. అని అనుకోవచ్చు.. అయితే సినిమాల గురించి కాస్త పట్టు ఉన్న వారికి కీర్తి రెడ్డిని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలిప్రేమ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ గా కొంత మందికి తెలుసు.. ఇక అక్కినేని వారి హీరో సుమంత్ మాజీ భార్యగా మరికొంత మందికి తెలుసు..
చేసిన సినిమాలు తక్కువే అయినా.. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకుంది కీర్తి రెడ్డి. మరీ ముఖ్యంగా తొలిప్రేమ సినిమా చూసిన వాళ్ళు ఈ హీరోయిన్ ను అంత ఈజీగా మర్చిపోలేరు తెలుగమ్మాయే.. అయినా.. బెంగళూరులో సెటిట్ అయ్యింది బ్యూటీ.. హైదరాబాద్ లో పుట్టిన కీర్తి రెడ్డి తల్లి .. డిజైనర్.. అంతే కాదు కీర్తి రెడ్డి ఫ్యామిలీకి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది.
కీర్తి రెడ్డి తాత గడ్డం గంగారెడ్డి నిజామాబాద్ లోకసభ నియోజకవర్గం మాజీ ఎంపీ.అయితే కీర్తి రెడ్డి విద్యాభ్యాసం బెంగళూరులో జరిగింది. 8 సంవత్సరాల వయసులోనే భరత నాట్యంలో శిక్షణ పొందిన కీర్తి రెడ్డి.. విదేశాల్లో పెద్ద చదువులు చదువుకుని వచ్చింది. ఇక ఆమె వెండితెరకు పరిచయం అయ్యింది అలీ జోడీగా నటించిన గణ్ షాట్ సినిమాతో.
ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్ట్ చేసిన ఈసినిమాతో వెండితెరకు పరిచయం అయిన కీర్తి రెడ్డి.. ఆతరువాత కరుణాకరణ్ డైరెక్షన్ లో రూపొందిన తొలిప్రేమ సినిమా తో మంచి గుర్తింపు సాధించింది. అయితే ఈసినిమాతో ఆమె స్టార్ హీరోయిన్ గా మారుతుంది.. ఇక తిరుగులేదు అనుకున్నారంతా.. కాని అంతా అనుకున్నటేమి జరగలేదు.
కీర్తి రెడ్డి నటించిన ప్రేమించే మనసు, రావోయి చందమామ సినిమాలు ఘోరంగా ప్లాప్ అయ్యాయి. దాంతో సినిమాలు ఆపేసి గ్యాప్ తీసుకుంది కీర్తి రెడ్డి. ఆతరువాత కొన్నాళ్ళకు మహేష్ బాబు అక్కగా.. అర్జున్ సినిమాలో నటించి మెప్పించింది. కాని ఈసినిమా కూడా కీర్తి రెడ్డిని నిలబెట్టలేకపోయింది. దాంతో వెండితెరకు దూరం అయ్యింది కీర్తి రెడ్డి. తాజాగా మరోసారి వెండితెరపై మెరవబోతుందంటూ న్యూస్ వైరల్ అవుతోంది.
ఈమధ్యలో అక్కినేని హీరో సుమంత్ ను పెళ్లి చేసుకున్నా కీర్తి రెడ్డి.. ఎక్కువ కాల సుమంత్ తో కలిసి ఉండలేకపోయింది.. మనస్పర్ధలు రావడంతో కొన్నాళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈమె రెండో పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయినట్టు టాక్ నడిచింది. మరి కీర్తి నిజంగానే రెండో పెళ్లి చేసుకుందా లేదా తెలియదు కాని.. ఆమె మాత్రం విదేశాల్లో సెటిల్ అయ్యింది.
ఇక తాజా సమాచారం ప్రకారం కీర్తి రెడ్డి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇంపార్టెన్స్ ఉన్న లీడ్ క్యారెక్టర్స్ కోసం ఎప్పటి నుంచో కీర్తి రెడ్డిని సంప్రదిస్తున్నారట డైరెక్టర్లు. కాని ఆమె పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని సమాచారం. తాజాగా కీర్తి మనసు మార్చుకుని.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం.