RRR తో వీరమల్లుకి గోల్డెన్ ఛాన్స్.. ఆశలన్నీ ఆయనపైనే, మోత మోగిస్తే జాక్ పాట్ పక్కా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో హరిహర వీరమల్లు చిత్రం తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో హరిహర వీరమల్లు చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి ఎన్నో అడ్డంకులు.. అంతకు మించిన రూమర్స్ వినిపించాయి. కానీ ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా టైం కేటాయిస్తూ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు.
Pawan Kalyan
వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఖుషి నిర్మాత ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో హిందీలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు.
పవన్ కళ్యాణ్ తొలిసారి ఇలా పీరియాడిక్ చిత్రంలో నటిస్తున్నారు. దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడియన్స్ లో ఈ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. అయితే హిందీలో ఈ చిత్ర పరిస్థితి ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది.
పవన్ కళ్యాణ్ కి ఇదే తొలి పాన్ ఇండియా చిత్రం. కాబట్టి హరిహర వీరమల్లుపై నార్త్ లో అంతగా బజ్ ఉండదు. అయితే ఆర్ఆర్ఆర్ రూపంలో ఒక గోల్డెన్ ఛాన్స్ వీరమల్లు చిత్రానికి ఉంది అని చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయంగా చేస్తున్న హంగామా ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇటీవలే ఆర్ఆర్ఆర్ చిత్రంలోని 'నాటు నాటు' సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్స్ కి నామినేట్ అయింది. ఈ చిత్రానికి ఆస్కార్ వస్తుందా రాదా అనేది తర్వాత విషయం.. కానీ తెలుగు సినిమా ఖ్యాతిని జక్కన్న మరోసారి అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కీరవాణి కావడంతో ఆయన పేరు కూడా మారుమోగుతోంది.
దేశవ్యాప్తంగా సినీ అభిమానులు కీరవాణి గురించి చర్చించుకుంటున్నారు. నాటు నాటు సాంగ్ కి కీరవాణి అంద్భుతమైన కంపోజింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆ సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లో ఉంది. దీనితో నార్త్ ప్రేక్షకులు కీరవాణి తదుపరి చిత్రం ఏంటి అని చర్చించుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత హిందీలో రిలీజ్ కాబోతున్న కీరవాణి చిత్రం హరిహర వీరమల్లు. ఇది పవన్ కళ్యాణ్ చిత్రానికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ ఆర్ఆర్ఆర్ రేంజ్ లో ఉంటే ఈ చిత్రానికి నార్త్ లో మంచి ఓపెనింగ్స్ గ్యారెంటీ. మరి కీరవాణి మ్యాజిక్ ఎలా ఉండబోతోందో చూడాలి.