MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చేగువేరా ఫాలోవర్ నోటినుండి క్యాస్ట్ బేస్డ్ వ్యాఖ్యలా? మీ ఫ్యామిలీలో కూడా రెడ్లు ఉన్నారు,పవన్ కి నెటిజెన్స్ సెగ

చేగువేరా ఫాలోవర్ నోటినుండి క్యాస్ట్ బేస్డ్ వ్యాఖ్యలా? మీ ఫ్యామిలీలో కూడా రెడ్లు ఉన్నారు,పవన్ కి నెటిజెన్స్ సెగ

ఏపీ ప్రభుత్వం తీసుకున్న సదరు నిర్ణయాలు చిత్ర పరిశ్రమకు చేటు కలిగించేవిగా ఉన్నాయని పవన్(Pawan kalyan) ధ్వజమెత్తాడు. నా ఒక్కడిపై కక్ష సాధించడం కోసం టాలీవుడ్ ని ఇబ్బందుల పాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 27 2021, 08:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేదిక సాక్షిగా పవన్ చేసిన పొలిటికల్ స్పీచ్ ఎంత దుమారం రేపిందో తెలిసిందే. వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోలకు  ఏపీ సర్కారు అనుమతి ఇవ్వలేదు. అలాగే పెద్ద హీరోల సినిమాల టికెట్స్ రేట్లు మొదటివారం పెంచి అమ్ముకొనే వెసులుబాటును కలిపించాలన్న నిర్మాతల అభ్యర్ధన తోసి పుచ్చింది. తాజాగా సినిమా టికెట్స్ ప్రభుత్వం రూపొందించిన ఆన్లైన్ పోర్టల్ ద్వారా అమ్మేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఏపీ ప్రభుత్వం తీసుకున్న సదరు నిర్ణయాలు చిత్ర పరిశ్రమకు చేటు కలిగించేవిగా ఉన్నాయని పవన్ ధ్వజమెత్తాడు. నా ఒక్కడిపై కక్ష సాధించడం కోసం టాలీవుడ్ ని ఇబ్బందుల పాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తన స్పీచ్ లో ఆవేశంతో ఊగిపోయిన పవన్ కొన్ని అనాలోచిన వ్యాఖ్యలు కూడా చేశారు. 

38


వకీల్ సాబ్ చిత్రానికి నిర్మాతగా ఉన్న దిల్ రాజు కులాన్ని ప్రస్తావిస్తూ ఓ సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడారు. వకీల్ సాబ్ మూవీ ఎందుకు తీశావయ్యా దిల్ రాజు. నువ్వు ఆ సినిమా తీయకపోతే ఇప్పుడు ఏపీలో థియేటర్స్ ఓపెన్ అయ్యేవి. 

48

ఆయన రెడ్డే నువ్వే రెడ్డే... మీ రెడ్లు తేల్చుకోండి. వెళ్లి ఆయనతో మాట్లాడుకోండి. నువ్వు రెడ్డి అని చెబితే సీఎం జగన్.. మా రెడ్డి అంటూ నిన్ను అక్కున చేర్చుకుంటాడు, అంటూ మాట్లాడారు. తనవి  సోషలిస్ట్, మార్క్సిస్ట్ భావాలు అని చెప్పుకునే పవన్ నోటి నుండి ఇలాంటి మాటలు రావడం ఏమిటని నెటిజెన్స్ పవన్ ని ప్రశ్నిస్తున్నారు. 
 

58

కుల రాజకీయాలకు వ్యతిరేకం అని మాట్లాడే పవన్ పబ్లిక్ లో ఇలాంటి వ్యాఖ్యల ద్వారా ఎలాంటి సందేశం ఇస్తున్నారో ఆయనకే తెలియాలని నిలదీస్తున్నారు. ఆయన అభిమాన గణంలో, జనసేన పార్టీలో రెడ్డి సామాజిక వర్గం వారు ఉన్నారు. పవన్  వ్యాఖ్యలు వాళ్ళను ఖచ్చితంగా ఇబ్బందిపెట్టి ఉంటాయి అనడంలో సందేహం లేదు.

68

సోషల్ మీడియాలో పవన్ క్యాస్ట్ బేస్డ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గాన్ని దూషించే మీరు, మీ కుటుంబంలోనే రెడ్లు ఉన్నారని గుర్తించుకోవాలి అంటున్నారు. 

78

రామ్ చరణ్ భార్య ఉపాసన, అల్లు అర్జున్ భార్య  స్నేహ, రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే, సాయి ధరమ్ తేజ్ కి వైద్యం అందిస్తున్న అపోలో హాస్పిటల్స్ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవే అని ఎద్దేవా చేస్తున్నారు.

88

ఇక పవన్ వ్యాఖ్యలకు పరిశ్రమ నుండి కొందరు మద్దతు పలుకగా, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్... పరోక్షంగా షాక్ ఇచ్చింది. కొందరు వ్యక్తిగత అభిప్రాయాలతో తమకు సంబంధం లేదని ప్రెస్ నోట్ విడుదల చేయడం ద్వారా తెలియజేసింది.

About the Author

SG
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే
Recommended image2
Actress Hema: రాజకీయాల్లోకి నటి హేమ, దాసరి సమాధి వద్ద హింట్.. సినిమా అవకాశాల కోసం ఆశీస్సులు
Recommended image3
Sayaji Shinde: తల్లి చివరి కోరిక తీర్చిన టాలీవుడ్‌ యాక్టర్‌.. గ్రీనరీతో అమ్మకి జీవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved