`ఖుషి` చేస్తామంటున్న విజయ్ దేవరకొండ, సమంత.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?
విజయ్ దేవరకొండ, సమంత కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారు. అయితే వీరిద్దరు కలిసి పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేయడం విశేషం. పవన్ సూపర్ హిట్‌పై వీరి కన్నుపడినట్టు తెలుస్తుంది.
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నారు. `లైగర్`(Liger) చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించారు. ఇది ఆగస్ట్ లో విడుదల కాబోతుంది. బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రం సాగబోతుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదగాలని టార్గెట్ పెట్టుకున్నాడు విజయ్.
ఆ తర్వాత పూరీ జగన్నాథ్‌తోనే `జనగణమన` అనే సినిమా చేయబోతున్నారు. దేశ భక్తి నేపథ్యంలో ఓ ఆర్మీ మిషన్ ప్రధానంగా ఈ సినిమా సాగబోతుందని తెలుస్తుంది. మరోవైపు సమంత(Samantha)తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు విజయ్ దేవరకొండ. మంచి ఫ్యామిలీ డ్రామాలు, ఎమోషనల్ కంటెంట్‌తో సినిమాలు చేసే శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది.
ఈ సినిమా కాశ్మీర్ నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రమని తెలుస్తుంది. డిఫరెంట్ లవ్ స్టోరీగా ఉండబోతుందని సమాచారం. విజయ్ దేవరకొండ, సమంత కలిసి `మహానటి` లో జోడీగా నటించారు. ఇందులో వీరి లవ్ స్టోరీ ఆద్యంతం ఆకట్టుకుంది. కాసేపే అయినా సావిత్రి జీవితానికి పారలల్‌గా రన్ అవుతూ మ్యాజిక్ చేసింది. ఇప్పుడు శివ నిర్వాణ సినిమాలో పూర్తి స్థాయిలో జోడీగా కనిపించబోతున్నారు. సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేయబోతున్నారు.
ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్ వినిపిస్తుంది. టైటిల్ విషయంలో విజయ్, సమంత కలిసి పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ని వాడుకోబోతున్నారట. పవర్ స్టార్ కెరీర్‌లో మైలురాయిలాంటి చిత్రం `ఖుషి`(Khushi). సంచలన విజయం సాధించిన ఈ చిత్రం టైటిల్‌ని ఇప్పుడు విజయ్ దేవరకొండ, సమంత ల సినిమాకి పరిశీలిస్తున్నారని సమాచారం. మరి ఇందులో నిజమెంతా ? దీనిపై పవన్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. కానీ `ఖుషి` టైటిల్ అనే వార్త అటు ఇంటర్నెట్‌ని, ఇటు ఫిల్మ్ నగర్‌లోనూ హాట్ టాపిక్ అవుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానుల అటెన్షన్‌ని గ్రాస్ప్ చేస్తుంది.
ఇదే నిజమైతే.. ఈ సినిమా పై ప్రారంభం నుంచే విపరీతమైన క్రేజ్ నెలకొంటుందని చెప్పొచ్చు. ఇక సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. నాగచైతన్యతో విడాకుల అనంతరం ఆమె రెట్టింపు ఎనర్జీతో ముందుకు సాగుతుంది. ప్రస్తుతం ఆమె `శాకుంతలం`, `యశోద`, డ్రీమ్ వరియర్స్ చిత్రం, అలాగే తమిళంలో `కాథు వాకుల రెండు కాదల్`తోపాటు ఓ అంతర్జాతీయ సినిమా చేస్తుంది. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.