- Home
- Entertainment
- ఆ ఆయుధాలు రాంచరణ్ సొంతం.. మెగాపవర్ స్టార్ కి బర్త్ డే విషెస్ తెలుపుతూ పవన్, సమంత కామెంట్స్
ఆ ఆయుధాలు రాంచరణ్ సొంతం.. మెగాపవర్ స్టార్ కి బర్త్ డే విషెస్ తెలుపుతూ పవన్, సమంత కామెంట్స్
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నేడు తన 38వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు రాంచరణ్ కి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నేడు తన 38వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు రాంచరణ్ కి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. మెగా ఫ్యాన్స్ అయితే కొన్ని రోజుల నుంచే హంగామా మొదలు పెట్టారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ గ్లోబల్ స్టార్ గా మారడంతో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.
రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా తన బాబాయ్ పవన్ కళ్యాణ్, కో స్టార్ సమంత తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ రాంచరణ్ కి తెలిపిన పుట్టినరోజు శుభాకాక్షల నోట్ ని జనసేన పార్టీ పోస్ట్ చేసింది. 'అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందేలా ఎదిగిన రాంచరణ్ కి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంషలు.
స్నేహభావంతో మెలిగే రాంచరణ్ మరింతగా ఎదగాలని, అందరి మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దైవచింతన, ప్రశాంతత కలిగిన రాంచరణ్ కి క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్దత ఆయుధాల్లాంటివి. భవిష్యత్తులో మన సినిమా కీర్తి పతాకాన్ని ఎగురవేసి మంచి సినిమాలు అదింస్తాడని ఆశిస్తున్నా' అంటూ పవన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఇక సమంత కూడా తన కోస్టార్ కి బర్త్ డే విషెస్ తెలిపింది. 'అద్భుతమైన జర్నీని ఇప్పుడే ప్రారంభించావు. మంచి హృదయం, హుందాగా మెలిగే రాంచరణ్ కి తన సొంత క్లాస్ ఉంది. హ్యాపీ బర్త్ డే రాంచరణ్ అంటూ సమంత పోస్ట్ చేసింది.
సమంత, రాంచరణ్ ఇద్దరూ రంగస్థలం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. రాంచరణ్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో రంగస్ధలం ముందు వరుసలో ఉంటుంది. ఆ చిత్రంలో సమంత, రాంచరణ్ నటన ఎలాంటి ప్రశంసలు దక్కాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇక సొంత బాబాయ్ పవన్ కళ్యాణ్ ప్రేమపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాంచరణ్, పవన్ కళ్యాణ్ మధ్య బాండింగ్ ని గుర్తు చేసుకుంటున్నారు.