బ్యూటీఫుల్ మదర్ పవిత్ర లోకేష్ బోల్డ్ రోల్.. మరీ అది తాగడమేంటి.. షాక్‌లో ఫ్యాన్స్
వెండితెరపై అందమైన తల్లిగా కనువిందు చేసింది పవిత్ర లోకేష్. ఒకప్పుడు హీరోయిన్‌గా మెప్పించిన పవిత్ర ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా తల్లి పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇంత వరకు బాగానే ఉంది కానీ, ఉన్నట్టుండి బోల్డ్ క్యారెక్టర్‌లో కనిపించి షాక్ ఇచ్చింది. దీంతో అభిమానులు పవిత్రలోని ఈ ఛేంజెస్‌ని జీర్ణించుకోలేకపోతున్నారు.
పవిత్ర లోకేష్ అంటే ఓ నిండైన రూపం ఆడియెన్స్ ముందు కనిపిస్తుంది. అందమైన తల్లిగా, అంతే అందమైన హవభావాలతో కట్టిపడేస్తుంది. కొన్ని సినిమాల్లో హీరోయిన్లని కూడా డామినేట్ చేసిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
దీంతో పవిత్రకి ఆడియెన్స్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. పవిత్ర కోసం సినిమాలు చూసే వారు రెడీ అయ్యారు. తనకు వస్తోన్న క్రేజ్‌ని కూడా ఆమె వాడుకుంటోంది. క్రేజ్‌కి తగ్గట్టుగానే పారితోషికం డిమాండ్ చేస్తుంది.
పవిత్ర డైలీ అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు తీసుకుంటుందట. క్యారెక్టర్ ప్రయారిటీని బట్టి అందులో మార్పులుంటాయని తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ బోల్డ్ రోల్‌లో కనిపించి తన ఫ్యాన్స్ ని షాక్‌కి గురి చేసింది పవిత్ర.
ఇటీవల ఈ అమ్మడు ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా రూపొందిన `రెడ్` చిత్రంలో తల్లి పాత్రలో నటించింది. అయితే ఆమె ఒకప్పుడు ఎలా ఉండేవారు, ఎలా అయ్యారు, అందుకు కారణమేంటి? అనే ఆసక్తికర సన్నివేశాలతో సినిమాలో ఆమె పాత్ర సాగుతుంది.
ఇందులో పవిత్ర సిగరేట్ తాగుతూ కనిపించారు. అంతేకాదు పలు బోల్డ్ డైలాగ్‌లు కూడా చెప్పారు. దీంతో ఆమె ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ సైతం షాక్ అవుతున్నారు. ఎంతో అందమైన అమ్మగా అలరించే పవిత్ర ఇలా మారిపోయిందేంటి? అని ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఎవరైనా రొటీన్ పాత్రలు చేస్తే బోర్ కొడుతుంది. ఆడియెన్స్ కూడా కొత్త దనం కోరుకుంటున్నారు. బహుశా పవిత్ర ఇలాంటి బోల్డ్ రోల్ చేయడానికి కూడా అదే కారణమని తెలుస్తుంది. తన నటనలోని మరో కోణాన్ని కూడా ఆవిష్కరించడానికి ఇదో కారణమని కూడా చెబుతున్నారు. కానీ ఆమెపై మాత్రం విమర్శలు ఆగడం లేదు. రియల్ లైఫ్ లో కూడా పవిత్ర లోకేష్ అలానే ఉంటారా అని సందేహాలు ఎక్కువయ్యాయి.
దీంతో దీనిపై తాజాగా పవిత్ర వివరణ ఇచ్చింది. రియల్ లైఫ్ లో అసలు సిగరెట్ కూడా ముట్టుకొను పాత్ర కొత్తగా ఉండాలని కథకు తగ్గట్లు అలా చేయాల్సి వచ్చింద`ని వివరణ ఇచ్చింది. `రెడ్` సినిమా చూసిన చాలా మంది పవిత్ర లోకేష్ పాత్ర గురించి హాట్ టాపిక్‌గా చర్చించుకోవడం విశేషం. దీంతో నటిగా తాను సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అయితే ఈ బోల్డ్ రోల్ కోసం ఆమె రోజుకి లక్షకుపైగా రెమ్యూనిరేషన్ తీసుకుందని టాక్.
ఇక హీరోయిన్‌గా తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించి మెప్పించిన పవిత్ర ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పిస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే హీరోయిన్‌గా కంటే ఇప్పుడే పవిత్రకి మంచి క్రేజ్, పాపులారిటీ వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు మాత్రం పవిత్ర మదర్స్ రోల్స్ లో ఆమె కేరాఫ్‌గా నిలుస్తున్నారు. అయితే హీరోయిన్‌గా ఉన్నప్పుడు తను హైట్ ఉండటంతో హీరోలకు సమస్య వచ్చేదట. అందుకే చాలా మంది ఆమెతో నటించేందుకు ఇష్టపడేవారు కాదని టాక్.
అయితే నైంటీస్‌లో మాత్రం స్టార్ హీరోలకు దీటుగా రాణించి మెప్పించింది. ఇప్పుడు తల్లి పాత్రల్లోనూ హీరోయిన్లకి దీటుగా మెప్పిస్తుంది. `రేసుగుర్రం`, `కాటమరాయుడు`, `సన్నాఫ్ సత్యమూర్తి`, `డీజే`, `పటాస్`, `టెంపర్`, `సైరా`, `పండగ చేస్కో` వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు పవిత్ర.