పరిణీతి చోప్రా vs రాఘవ్ చడ్డా: ఇద్దరిలో ఎవరి వద్ద ఎక్కువ ఆస్తులున్నాయో తెలుసా?
పరిణీతి చోప్రా, రాఘవ్ చడ్డా ఆగస్టు 25న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ద్వారా ప్రెగ్నెంట్ వార్తని ప్రకటించారు. పరిణీతి ధనవంతురాలైన జీవితాన్ని గడుపుతుంటే, రాఘవ్ మధ్యతరగతి జీవితాన్ని గడుపుతున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరి వద్ద ఎక్కువ డబ్బుందో తెలుసుకుందాం.

పరిణీతి చోప్రా ఎంట్రీ ఎలా జరిగిందంటే?
ఇంగ్లాండ్‌లో బిజినెస్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, పరిణీతి చోప్రా యష్‌రాజ్ స్టూడియోస్ మార్కెటింగ్ విభాగంలో ఇంటర్న్‌షిప్ చేశారు. ఆ తర్వాత అక్కడే పబ్లిక్ రిలేషన్స్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. నటనలో ప్రయత్నించాలని నిర్ణయించుకుని 'లేడీస్ vs రిక్కీ బెహ్ల్' సినిమాతో కెరీర్ ప్రారంభించారు. అలా నటిగా ఎంట్రీ ఇచ్చారు.
KNOW
పరిణీతి చోప్రా ఆస్తుల వివరాలు
పరిణీతి చోప్రా మొత్తం ఆస్తులు దాదాపు 74 కోట్ల రూపాయలు. సినిమాలతో పాటు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కూడా ఆమె మంచి ఆదాయం పొందుతున్నారు. కుర్ కురే, మాజా, పాంటీన్ షాంపూ వంటి ప్రముఖ బ్రాండ్లకు ఆమె ప్రచారం చేశారు.
పరిణీతి చోప్రా కార్ కలెక్షన్, లగ్జరీ హౌజ్
పరిణీతి ఒక్కో సినిమాకి 4 నుండి 6 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. ఆమె వద్ద రేంజ్ రోవర్ వోగ్, ఆడి Q4, ఆడి Q7 వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ముంబైలోని బాంద్రాలో ఆమెకు ఒక విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది.
రాజ్యసభ ఎంపీగా రాఘవ్ చడ్డా
రాఘవ్ చడ్డా తన కెరీర్‌ని 2011లో ప్రారంభించారు. చార్టర్డ్ అకౌంటెంట్‌గా ప్రాక్టీస్ చేస్తూ, అదే సంవత్సరం అన్నా హజారే 'ఇండియా అగైనెస్ట్ కరప్షన్' ఉద్యమంలో చేరారు. ఈ ఉద్యమం ద్వారా అరవింద్ కేజ్రీవాల్‌తో పరిచయం ఏర్పడి, ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
రాఘవ్ చడ్డా ఆస్తులు
పొలిటికల్ లీడర్‌గా రాణిస్తున్న రాఘవ్ చడ్డా వద్ద మొత్తం ఆస్తులు దాదాపు 50 కోట్ల రూపాయలు. ఆయన వద్ద మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కారు, 36 లక్షల విలువైన ఇల్లు ఉన్నాయి. ఇలా చూస్తే ఇప్పుడు భర్త రాఘవ్ కంటే పరిణీతినే ఎక్కువ రిచ్ అని చెప్పొచ్చు.