MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్, భర్తతో కలిసి ఎంత అందంగా ప్రెగ్నెన్సీ ప్రకటించిందో చూడండి

తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్, భర్తతో కలిసి ఎంత అందంగా ప్రెగ్నెన్సీ ప్రకటించిందో చూడండి

హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ నేత రాఘవ్ దంపతులు సోషల్ మీడియాలో తాము తల్లి దండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. దీనితో అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 25 2025, 02:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గుడ్ న్యూస్ చెప్పిన పరిణీతి చోప్రా 
Image Credit : Instagram/Parineeti

గుడ్ న్యూస్ చెప్పిన పరిణీతి చోప్రా 

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్ధా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. పరిణీతి చోప్రా బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తోంది. రాఘవ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.

DID YOU
KNOW
?
బ్లాక్ బస్టర్ మూవీ మిస్ చేసుకున్న పరిణీతి చోప్రా
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం యానిమల్ లో హీరోయిన్ గా నటించే అవకాశం ముందుగా పరిణీతికి వచ్చింది. కానీ డేట్స్ కారణంగా పరిణీతి ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసింది. దీనితో ఆ గోల్డెన్ ఛాన్స్ రష్మికకి దక్కింది. 
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అందమైన పోస్ట్ తో ప్రెగ్నన్సీ ప్రకటించిన పరిణీతి
Image Credit : Instagram/Parineeti Chopra

అందమైన పోస్ట్ తో ప్రెగ్నన్సీ ప్రకటించిన పరిణీతి

సెప్టెంబర్ 24, 2023న ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్ హోటల్‌లో వివాహం చేసుకున్న ఈ జంట, సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో తమ జీవితంలోనే మోస్ట్ హ్యాపీయెస్ట్ న్యూస్ ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఒక అందమైన కేక్ ఫోటోను పోస్ట్ చేశారు. ఆ కేక్‌పై “1 + 1 = 3” అని రాసి ఉండగా, మధ్యలో చిన్న బంగారు అడుగుల ముద్రలు కనిపించాయి. మా సరికొత్త ప్రపంచం వచ్చేస్తోంది.. ఈ ఆనందాన్ని వెలకట్టలేం అని క్యాప్షన్ ఇచ్చారు. అలాగే, వీరు పంచుకున్న వీడియోలో పరిణీతి, రాఘవ్ ఇద్దరూ చేతులు పట్టుకొని పార్కులో నడుస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ విధంగా తామిద్దరం తల్లి దండ్రులు కాబోతున్న విషయాన్ని పరిణీతి, రాఘవ్ దంపతులు ప్రకటించారు. 

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @parineetichopra

Related Articles

Related image1
రాంచరణ్ 'పెద్ది' మూవీ ఆఫర్ రిజెక్ట్ చేసిన హీరోయిన్..ఆ పాత్రలో నటించాలని చెప్పగానే నో
Related image2
బిగ్ బాస్ అర్జున్ కళ్యాణ్ తో పెళ్లి వరకు వెళ్లిన రంగస్థలం నటి..డేటింగ్ నిజమే, ఎందుకు బ్రేకప్ అయింది అంటే..
35
సినీ ప్రముఖుల శుభాకాంక్షలు 
Image Credit : Instagram/Parineeti Chopra

సినీ ప్రముఖుల శుభాకాంక్షలు 

ఈ శుభవార్త బయటికొచ్చిన వెంటనే, సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. నటి సోనం కపూర్ “Congratulations darling” అని రాయగా, నటి భూమి పెడ్నేకర్ కూడా అభినందనలు తెలిపారు.కొన్ని రోజుల క్రితమే రాఘవ్ 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొన్నప్పుడు తాము తల్లి దండ్రులు కావడం గురించి హింట్ ఇచ్చారు. హోస్ట్ కపిల్ శర్మతో మాట్లాడుతూ, “త్వరలోనే గుడ్ న్యూస్ ఇస్తాం” అని చెప్పారు. ఇప్పుడు అదే నిజమైంది.

45
రాజకీయాల్లో రాణిస్తున్న రాఘవ్ 
Image Credit : Instagram/Parineeti Chopra

రాజకీయాల్లో రాణిస్తున్న రాఘవ్ 

పరిణీతి చోప్రా బాలీవుడ్‌లో గుర్తింపు పొందిన నటి కాగా, రాఘవ్ చద్ధా ఆప్ పార్టీకి చెందిన ప్రముఖ యువ నాయకుడు. వివాహం తర్వాత కూడా వీరు తరచుగా సోషల్ మీడియాలో ఒకరినొకరు ప్రోత్సహిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు, తమ బిడ్డ రాబోతున్న శుభవార్తతో మళ్లీ హైలైట్ అయ్యారు.

55
పరిణీతి చిత్రాలు 
Image Credit : Instagram/Parineeti Chopra

పరిణీతి చిత్రాలు 

పరిణీతి చోప్రా, ప్రియాంక చోప్రా ఇద్దరూ బంధువులు. పరిణీతి చోప్రా 2011లో లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ అనే చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో రణ్వీర్ సింగ్, అనుష్క శర్మ, పరిణీతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఆ తర్వాత పరిణీతి శుధ్ దేశీ రొమాన్స్, కిల్ దిల్, నమస్తే ఇంగ్లాండ్, గోల్ మాల్ అగైన్, కేసరి లాంటి చిత్రాల్లో నటించింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Related Stories
Recommended image1
రాంచరణ్ 'పెద్ది' మూవీ ఆఫర్ రిజెక్ట్ చేసిన హీరోయిన్..ఆ పాత్రలో నటించాలని చెప్పగానే నో
Recommended image2
బిగ్ బాస్ అర్జున్ కళ్యాణ్ తో పెళ్లి వరకు వెళ్లిన రంగస్థలం నటి..డేటింగ్ నిజమే, ఎందుకు బ్రేకప్ అయింది అంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved