సవాల్ విసిరిన యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్‌కి చుక్కలు చూపించిన తెలుగోడు..
First Published Dec 30, 2020, 9:57 AM IST
వెస్ట్ ఇండీస్ క్రికెటర్ క్రిస్ గేల్.. తెలుగు క్రికెటర్, ఇండియన్ టాప్ వన్ స్పిన్నర్ ని స్టేడియం బయట కొడతానన్నాడు. మరి తెలుగోడు ఏం చేశాడు. స్టేడియంలో చూసుకున్నాడు. సిక్స్ లతో సిక్స్ లతో రెచ్చిపోయే గేల్‌ని పొగరు అణిచాడు. వికెట్ తీసి అన్నీ మూసుకునేలా చేశాడు. అతనెవరో కాదు తెలుగు క్రికెటర్, బౌలర్ ప్రగ్యాన్ ఓజా. ఆయన తాజాగా సాయికుమార్ హోస్ట్ గా ప్రసారమయ్యే `వాహ్.. మంచి కిక్క్ ఇచ్చే గేమ్‌షో`లో హారిక, గుత్తా జ్వాల, మధుశాలినిలతో కలిసి పాల్గొన్నారు. అనేక ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

ప్రగ్యాన్ ఓజా మాజీ టీమిండియా క్రికెట్ ప్లేయర్. ఐసీసీ నెంబర్ వన్ స్పిన్నర్. టెస్ట్, వన్డే, టీ20 ఇలా అన్నీ ఫార్మాట్‌లలో బెస్ట్ బౌలర్‌గా రాణించిన ప్రగ్యాన్ ఓజా ప్రస్తుతం ఐపీఎల్‌క్, రంజీలకు పరిమితమయ్యారు.

ప్రస్తుతం ఆయన ఈటీవీలో సాయికుమార్ హోస్ట్ గా ప్రసారమయ్యే `వాహ్..` షోలో పాల్గొన్నారు. ఆయనతోపాటు క్రీడాకారులు ద్రోణవల్లి హారిక, గుత్తా జ్వాల, నటి మధుశాలిని పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇది జనవరి ఐదున ప్రసారం కానుంది.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?