MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే.. కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ తో పాటు మరిన్ని

ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే.. కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ తో పాటు మరిన్ని

This Week OTT Releases: ప్రతివారం లాగే ఈ వారం కూడా పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. వాటిలో కిరణ్ అబ్బరం కె ర్యాంప్ మూవీ కూడా ఉంది. 

2 Min read
Tirumala Dornala
Published : Nov 10 2025, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్‌లు
Image Credit : Asianet News

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్‌లు

ఈ వారం ఓటీటీలో ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ రెడీగా ఉంది. కిరణ్ అబ్బవరం కె ర్యాంప్, ఢిల్లీ క్రైమ్ సీజన్ 3, జురాసిక్ వరల్డ్ రీ బర్త్ లాంటి సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఆ వివరాలు, రిలీజ్ డేట్ లు ఇప్పుడు తెలుసుకుందాం.

25
నెట్‌ఫ్లిక్స్
Image Credit : Asianet News

నెట్‌ఫ్లిక్స్

ఎ మేరీ లిటిల్ ఎక్స్ మాస్ (A Merry Little Ex-Mas) 

క్రిస్మస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ హాలిడే కామెడీ సినిమాలో అలీషియా సిల్వర్‌స్టోన్‌, ఒలివర్ హడ్సన్‌, జమీలా జమీల్ ప్రధాన పాత్రల్లో నటించారు. కథలో కేట్‌, ఎవెరెట్‌ అనే దంపతులు విడాకుల తర్వాత కూడా ఒక చివరి కుటుంబ సెలవును కలిసి గడపాలని నిర్ణయించుకుంటారు. కానీ విధి వారికి మరో సర్ప్రైజ్‌ను సిద్ధం చేస్తుంది.

విడుదల తేదీ: నవంబర్ 12

ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్‌

ఢిల్లీ క్రైమ్ సీజన్ 3(Delhi Crime Season 3)

ఢిల్లీ క్రైమ్ సిరీస్‌కి మూడో సీజన్‌ వస్తోంది. ఈ సీజన్‌లో హుమా ఖురేషీ కొత్త విలన్‌గా కనిపిస్తారు. షెఫాలీ షా మళ్లీ డీసీపీ వర్తికా చతుర్వేది పాత్రలో, జయ భట్టాచార్య విమ్లా భారద్వాజ్‌గా నటిస్తున్నారు.

విడుదల తేదీ: నవంబర్ 13

ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్‌

ది బీస్ట్ ఇన్ మీ (The Beast In Me)

క్లెయిర్ డేన్స్‌, మాథ్యూ రైస్‌, బ్రిట్టనీ స్నో ప్రధాన పాత్రల్లో నటించిన ఈ థ్రిల్లర్‌ ఒక రచయిత్రి జీవితంలోకి అడుగుపెట్టిన ప్రమాదకరమైన పొరుగు వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతను హత్యాకాండల వెనుక ఉన్నాడా అనే మిస్టరీ కథానాయికను ఒక మైండ్‌ గేమ్‌లోకి లాగుతుంది.

విడుదల తేదీ: నవంబర్ 13

ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్‌

లాస్ట్ సమురాయ్ స్టాండింగ్ (Last Samurai Standing)

జపాన్‌ మేజీ యుగం (19వ శతాబ్దం చివర) నేపథ్యంగా రూపొందిన ఈ సిరీస్‌ షోగో ఇమమురా నవల ఆధారంగా రూపొందింది. కియోటో నగరంలోని టెన్‌ర్యూజీ ఆలయంలో సాగే సమురాయి యోధుల కథ ఇది. జునీచి ఒకడా, యుమియా ఫుజిసాకి, కయా కియోహారా ప్రధాన పాత్రల్లో నటించారు.

విడుదల తేదీ: నవంబర్ 13

ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్‌ 

ఇన్ యువర్ డ్రీమ్స్ (In Your Dreams)

అలెక్స్ వూ దర్శకత్వంలో రూపొందిన అమెరికన్ యానిమేటెడ్ అడ్వెంచర్ కామెడీ చిత్రం. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్‌ కోరుకునే ప్రేక్షకులకు సరైన ఎంపికగా నిలుస్తుంది.

విడుదల తేదీ: నవంబర్ 14

ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్‌

Related Articles

Related image1
ఫైనల్ కి వెళ్లే ఆ ఇద్దరు ఎవరో తెలిసిపోయింది, హింట్ ఇచ్చేసిన నాగార్జున.. భరణికి తప్పిన గండం
Related image2
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిటికీలో నుంచి దూకి పారిపోయిన యాంకర్ సుమ.. చిరంజీవి, పవన్, ఎన్టీఆర్ ఎఫెక్ట్
35
జియోహాట్‌స్టార్‌
Image Credit : Asianet News

జియోహాట్‌స్టార్‌

జురాసిక్ వరల్డ్ రీబర్త్ (Jurassic World Rebirth)

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమా Jurassic World Dominion (2022)కి స్టాండలోన్ సీక్వెల్‌. Jurassic Park ఫ్రాంచైజ్‌లో ఏడవ చిత్రం ఇది. స్కార్లెట్ జోహాన్సన్‌, మహర్షల అలీ, జోనాథన్ బైలీ ప్రధాన పాత్రల్లో నటించారు. కథలో ఒక శాస్త్రవేత్తల బృందం మూడు డైనోసార్‌ జాతుల డీఎన్‌ఏ సేకరించడానికి ప్రమాదకర ద్వీపానికి ప్రయాణిస్తుంది.

విడుదల తేదీ: నవంబర్ 14

ఎక్కడ చూడాలి: జియోహాట్‌స్టార్

45
జీ5
Image Credit : Asianet News

జీ5

ఇన్స్పెక్షన్ బంగ్లా (Inspection Bungalow)

అరవాంగడ్‌ పోలీస్‌ స్టేషన్‌ కోసం స్థలం వెతికే వ్యక్తి ఒక అడవిలోని పాత ఇన్‌స్పెక్షన్‌ బంగ్లాను ఎంచుకుంటాడు. కానీ ఆ భవనం శపించబడిందనే పుకార్లు అతని జీవితం తారుమారు చేస్తాయి. హారర్‌, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన చిత్రం.

విడుదల తేదీ: నవంబర్ 14

ఎక్కడ చూడాలి: జీ5

దశావతార్ (Dashavatar)

సుబోధ్ ఖనోల్కర్ దర్శకత్వం వహించిన ఈ మరాఠీ థ్రిల్లర్‌లో దిలీప్ ప్రభావల్కర్‌, భరత్ జాధవ్‌, మహేశ్ మంజ్రేకర్‌, సిద్ధార్థ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. వృద్ధుడైన డశావతార్ నటుడు తన చివరి నాటకం ద్వారా ఆధ్యాత్మిక, సాంస్కృతిక యుద్ధంలో చిక్కుకుంటాడు.

విడుదల తేదీ: నవంబర్ 14

ఎక్కడ చూడాలి: జీ5

55
ఆహా
Image Credit : Asianet News

ఆహా

కె ర్యాంప్

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన కె ర్యాంప్ చిత్రం థియేటర్స్ లో పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు రెడీ అవుతోంది. 

విడుదల తేదీ : నవంబర్ 15

ఎక్కడ చూడాలి : ఆహా 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఓటీటీ
ఏషియానెట్ న్యూస్
వినోదం
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved