రవితేజ రామారావ్ ఆన్ డ్యూటీతో పాటు ఈవారం ఓటీటీ, థియేటర్ లో సందడిచేయబోయే సినిమాలివే
ఈ సమ్మర్ తరువాత వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కాని చాలా వరకూ సినిమాలు బాక్సాఫీస్ ను సంతృప్తి పరచగల సినిమాలు మాత్రం ఎక్కవగా రాలేదు. కొన్ని సినిమాలు తప్పించి.. మేజర్ సినిమాలు పెవీలియన్ చేరుతున్నాయి. ఇక ఈవారం కూడా అటు థియేటర్లలో ఇటు ఓటీటీలో వరస సినిమాలు సందడి చేయబోతున్నాయి.

ఈ వారం తెలుగు నుంచి ఇంట్రెస్టింగ్ సినిమాలున్నాయి కొన్ని.. రవితేజ, కన్నడ హీరో సుధీప్ తో పాటు బాలీవుడ్ నుంచి జాన్ అబ్రహం కూడా ఈ వారం పోటీ లిస్ట్ లో ఉన్నాడు. మరి ఎవరి సినిమాలు ఎప్పుడు..?
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా దివ్యాంశా కౌషిక్ హీరోయిన్ గా వేణు తొటెంటపూడి కీలక పాత్రల్లో నటించిన సినిమా రామారావ్ ఆన్ డ్యూటీ. శరత్ మండవ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ శుక్రవారం అనగా 29 జులైన రిలీజ్ కు రెడీగా ఉంది. వరుస ప్లాప్ లు ఫేస్ చేస్తోన్న రవితేజ ఈమూవీతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
టాలీవుడ్ లో వరుస సినిమాల చేస్తూ.. పాన్ ఇండియా స్టార్ గా మాడాడు కన్నడ హీరో కిచ్చా సుధీప్. తన సినిమాలకు కన్నడతో పాటు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో.. ఇక్కడ కూడా భారీ రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నాడు. ఇక తాజాగా సుధీప్ విక్రమ్ రాణా సినిమాతో రాబోతున్నాడు అనూప్ బండారీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈనెల 28న గురువారం థియేటర్లలో సందడిచేయబోతుంది.
ఇక బాలీవుడ్ నుంచి జాన్ అబ్రహం, అర్జున్ కపూర్, దిశా పటాని, తారా సుతారియా లాంటి స్టార్ కాస్ట్ నటించిన సినిమా ఏక్ విలన్ రిటర్న్స్. మోహిత్ సూరి డైరెక్ట్ చేసిన ఈసినిమాకు తనిష్ బగ్చి మ్యూజిక్ అందించారు. ఇక ఈమూవీని ఈనెల 29న శుక్రవారం ప్రపంచ వ్యప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.
ఇక ఓటీటీలో సందడి చేయడానికి చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. బాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరోయిన్, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ లీడ్ రోల్ లో నటించిన సినిమా గుడ్ లక్ జెర్రీ. సిద్థార్ధ్ సేన్ గుప్త డైరెక్ట్ చేసిన ఈ విమెన్ సెంట్రిక్ మూవీ ఈనెల 29 శుక్రవారం డిస్నీ ప్లాస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వబోతోంది.
కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి, బాబీ సింహా లీడ్ రోల్స్ చేసిన సినిమా 777 ఛార్లీ. ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ సాధించింది. కన్నడ ముఖ్యమంత్రి చేతే కన్నీళ్ళు పెట్టించిన ఈ సినిమా ఆనిమల్ లవర్స్ మనసును కలించి వేసింది. ఈ సినిమా ఈ శుక్రవారం ఊట్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక ఇవే కాదు. రకరకాల వెబ్ సిరీస్ లు డిస్నీ హాట్ స్టార్ తో పాటు జీ 5, ఆహా, అమెజాన్ లలో ఈవారం సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి.