MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కంగనా ఘాటు అందాలకు ఆస్కార్‌ నటుడు ఫిదా.. సినిమా చేయాలనే కోరికని బయటపెట్టిన `గ్లాడియేటర్‌`

కంగనా ఘాటు అందాలకు ఆస్కార్‌ నటుడు ఫిదా.. సినిమా చేయాలనే కోరికని బయటపెట్టిన `గ్లాడియేటర్‌`

ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఇటీవల పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు ఇంటర్నెట్‌లో దుమ్మురేపుతున్నాయి. ఆమె అందాలకు అనేక మంది నెటిజన్లు మాత్రమే కాదు సినీ తారలు కూడా ఫిదా అవుతున్నారు. తాజాగా హాలీవుడ్‌ ఆస్కార్‌ నటుడు కూడా ఫిదా అయ్యాడట‌. అంతేకాదు కంగనాతోనూ సినిమా ప్రపోజల్స్ వస్తున్నాయట. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 14 2021, 02:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Kangana Ranaut

Kangana Ranaut

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ శుక్రవారం సోషల్‌ మీడియాని షేక్‌ చేసింది. తాను నటిస్తున్న `ధాఖడ్‌` చిత్రంలోని ఓ సాంగ్‌ షూట్‌లో భాగంగా ట్రాన్ఫరెన్సీ డ్రెస్‌లో ఫోటోలకు పోజులిచ్చింది. వీటిని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. అంతే ఆయా ఫోటోలు అన్ని సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అయ్యాయి. దుమ్ముదుమారం క్రియేట్‌ చేశాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Kangana Ranaut

Kangana Ranaut

ఈ పిక్స్ హాలీవుడ్‌ స్టార్స్ ని సైతం ఎట్రాక్ట్ చేశాయట. తాజాగా వాటికి సంబంధించిన డిస్కషన్‌ సోషల్‌ మీడియాలో జరగడమే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. అంతేకాదు దీనిపై ఈ ఆస్కార్‌ నటుడు స్పందించడం విశేసం. 

38

హాలీవుడ్‌ సంచలన చిత్రం `గ్లాడియేటర్‌` నటుడు రస్సెల్‌ క్రోవ్‌తో పనిచేయాలని కోరుతూ ఆయన అభిమానులు కంగనా పిక్స్ ని పంచుకున్నారు. సోషల్‌ మీడియాలో ఆయన్ని ట్యాగ్ చేశారు. దీంతో రస్సెల్‌ స్పందించారు. ఆ అభిమానుల ట్వీట్‌ని రీట్వీట్‌ చేయడం విశేషం. అంటే అభిమానుల కోరికపై ఆయన ఆసక్తి చూపించారని చెప్పొచ్చు. 
 

48

ఓ హాలీవుడ్‌ స్టార్‌ ఇండియన్‌ హీరోయిన్‌ అందానికి ఫిదా అయ్యాడనే విషయాన్ని ఆయన ఈ రూపంలో వ్యక్తం చేశారు. ఇక అందులో అభిమానులు ` రెండు విభిన్న చిత్ర పరిశ్రమలకు చెందిన ఇద్దరు గొప్ప నటులు, అకాడమీ విజేత రస్సెస్‌ క్రోవ్‌, నాలుగు సార్లు జాతీయ అవార్డు విజేత కంగనా కలిసి ఓ సినిమా చేస్తే ఎంత బాగుంటుంది` అని ట్వీట్‌ చేశారు. దీన్ని రీట్వీట్‌ చేశారు.

58

మరికొందరు అభిమానులు దీనిపై స్పందిస్తూ, వారిద్దరు కలిస్తే అద్భుతమైన జోడీ అవుతుంది. అది అద్బుతంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సినిమా కోసం ఆతృతగా ఉన్నామని ఒకరు, `ఎస్‌ ఇది చాలా బాగుంటుంద`ని మరొకరు కామెంట్లు పెట్టారు. దీంతో ఇప్పుడు ఇంటర్నేషనల్‌ వైడ్‌గా చర్చనీయాంశంగా మారింది. మరి ఇది నిజంగానే జరుగుతుందా? అన్నది ఆసక్తికరంగా,సస్పెన్స్ గా మారింది. 

68

అదే సమయంలో ఇది జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు సినీ విశ్లేషకులు. ఎందుకంటే ఇప్పటికే ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె, ఐశ్వర్యా రాయ్‌ వంటి తారలు హాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. అక్కడి సూపర్‌ స్టార్లతో జోడీ కట్టారు. అందులో భాగంగా దర్శకనిర్మాతలు గట్టిగా ఫోకస్‌ పెడితే రస్సెల్‌, కంగనాని ఒకే తెరపై చూడటం కూడా సాధ్యమే అని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

78

ఇక హాలీవుడ్‌ నటుడు రస్సెల్‌ `గ్లాడియేటర్‌` చిత్రానికి ఆస్కార్‌ అవార్డు అందుకున్నారు. దీంతోపాటు `ది ఇన్‌సైడర్‌`, `ఏ బ్యూటీఫుల్‌ మైండ్‌`, `ఎల్‌ ఏ కాన్ఫిడెన్షియల్‌`, `మాస్టర్ అండ్ కామాండర్‌`, `అమెరికన్‌ గ్యాంగ్‌స్టర్‌`,`రాబిన్‌ హుడ్‌`, `సిండ్రెలెల్లా మ్యాన్‌` వంటి బ్లాక్‌ బస్టర్స్ లో నటించారు. ప్రస్తుతం ఆయన `ది జార్జ్‌ టౌన్‌ ప్రాజెక్ట్`, `థోర్‌ః లవ్‌ అండ్‌ థండర్‌` చిత్రాల్లో నటిస్తున్నారు.
 

88
Kangana Ranaut

Kangana Ranaut

కంగనా ప్రస్తుతం `ధాఖడ్‌` చిత్రంతోపాటు `తలైవి`, `తేజాస్‌`తోపాటు `మణికర్ణిక రిటర్న్స్ః ది లెజెండ్‌ ఆఫ్‌ దిద్దా` చిత్రాల్లో నటిస్తుంది. `మణికర్ణిక రిటర్న్స్`కి తనే దర్శకత్వం వహించాలనే ప్లాన్‌లో ఉంది కంగనా. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmi Gautam: యాంకర్‌ రష్మి ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే, వామ్మో పెద్దదే.. తాను మాత్రమే దారి తప్పిందట
Recommended image2
IRUMUDI KATTU: పూనకాలు తెప్పిస్తున్న రవితేజ పాట.. భక్తులకు ట్రీట్ ఇచ్చేలా 'ఇరుముడి' ఫస్ట్ సింగిల్
Recommended image3
Allu Arjun: అల్లు అర్జున్ సినిమా పాటని ఇంతలా ఎవరూ తిట్టి ఉండరు..సెటైర్లు వేస్తూ అందరి ముందూ పరువు తీశారుగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved