ఓపెన్ హైమర్ వర్సెస్ బార్బీ... క్రేజ్ లో బార్బీనే ముందు, ఇండియాలో మాత్రం! విన్నర్ ఎవరు?
జులై 21న రెండు హాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ఓపెన్ హైమర్, బార్బీ చిత్రాల్లో బాక్సాఫీస్ విన్నర్ ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది.
Oppenheimer vs Barbie
హాలీవుడ్ కి చెందిన రెండు మేజర్ ప్రొడక్షన్ హౌసెస్ బాక్సాఫీస్ యుద్దానికి సిద్ధమయ్యాయి. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోపిక్ ఓపెన్ హైమర్, గ్రేటా గెర్విగ్ రూపొందించిన బార్బీ ఒకే రోజు విడుదలవుతున్నాయి. ఈ రెండు చిత్రాల మీద వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్న నేపథ్యంలో పోటీ వాతావరణం నెలకొంది. ఎవరు పై చేయి సాధిస్తారనే చర్చ మొదలైంది. ఈ రెండు చిత్రాల మధ్య పోలికలు గమనిస్తే...
Oppenheimer vs Barbie
డిఫరెంట్ జానర్స్:
బార్బీ-ఓపెన్ హైమర్ భిన్నమైన చిత్రాలు. డిఫరెంట్ జానర్స్ లో తెరకెక్కాయి. ఓపెన్ హైమర్ ఫాదర్ ఆఫ్ ఆటంబాంబ్ జే. రాబర్ట్ ఓపెన్ హైమర్ బయోపిక్. విధ్వంసానికి కారకుడైన వ్యక్తి కథ. వరల్డ్ వార్ 2లో గెలుపు కోసం భౌతిక శాస్త్రవేత్త ఓపెన్ హైమర్ అణుబాంబు సృష్టిస్తాడు. అది మానవాళికి ఎంతటి నష్టం చేస్తుందో సృష్టించిన ఆయనకు కూడా తెలియదు. ఆ ప్రయోగంతో ప్రపంచం నాశనం కావచ్చు. ఇంతటి ప్రమాదకర అణుబాంబు తయారీ, ప్రయోగం... దాని వెనుక ఓపెన్ హైమర్ మానసిక సంఘర్షణ సమాహారంగా ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఓపెన్ హైమర్ పాత్రను సిల్లియన్ మర్ఫీ చేశారు.
బార్బీ ఫాంటసీ కామెడీ ఫిల్మ్. గ్లామర్ కి చిరునామాగా బార్బీ డాల్స్ ని చెబుతారు. నిజంగా బార్బీ డాల్స్ కోసం ఒక లోకం ఉంటే... తన లోకం వదిలి సదరు బార్బీ డాల్ భూలోకంలో అడుగు పెడితే ఎలా ఉంటుంది. బార్బీ డాల్ పట్ల మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది. అసలు బార్బీ తన ప్రపంచం వదిలి భూలోకంలోకి ఎందుకు వచ్చింది? వంటి విషయాల సమాహారం. అవుట్ అండ్ అవుట్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్. బార్బీ చిత్రంలో మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్ ప్రధాన పాత్రలు చేశారు.
Oppenheimer vs Barbie
బడ్జెట్:
దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హేమర్ చిత్ర బడ్జెట్ $100 మిలియన్స్. మన కరెన్సీలో రూ. 821 కోట్లు. అనూహ్యంగా ఈ చిత్ర నిడివి 180 నిమిషాలు. హాలీవుడ్ చిత్రాలు ఇంత సుదీర్ఘ నిడివి కలిగి ఉండవు. నోలన్ ఎందుకు ఇంత సుదీర్ఘంగా కథను చెప్పాడో సినిమా చూస్తే కానీ తెలియదు. నోలన్ గత చిత్రాల్లో ది డార్క్ నైట్ రైజెస్ అత్యధికంగా 164 నిమిషాల నిడివి కలిగి ఉంది.
ఓపెన్ హైమర్ కంటే అత్యధిక బడ్జెట్ తో బార్బీ తెరకెక్కింది. వార్నర్ బ్రదర్స్ $ 145 మిలియన్స్ బడ్జెట్ తో నిర్మించారు. అంటే రూ. 1190 కోట్లు ఖర్చయ్యాయి. బహుశా సీజీ వర్క్ కోసం అధికంగా ఖర్చు చేసి ఉండొచ్చు. లేడీ డైరెక్టర్ గ్రేటా గెర్విగ్ తెరకెక్కించిన ఈ చిత్ర నిడివి కేవలం 114 నిమిషాలు. అంటే రెండు గంటల కంటే తక్కువ.
Oppenheimer vs Barbie
బుకింగ్స్:
నార్త్ అమెరికాలో ఓపెన్ హైమర్ 3600 స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నారు. డొమెస్టిక్ గా వీకెండ్ ముగిసే నాటికి ఓపెన్ హైమర్ $50 మిలియన్స్ వసూళ్లు రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. ఓపెన్ హైమర్ చిత్రాన్ని యూనివర్సల్ పిక్చర్స్ నిర్మించింది.
ఓపెన్ హైమర్ తో పోల్చితే భారీగా బార్బీ విడుదల అవుతుంది. నార్త్ అమెరికాలో 4200 స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నారు. నార్త్ అమెరికా, కెనడా మార్కెట్స్ ద్వారా వీకెండ్ నాటికి $100 మిలియన్ టార్గెట్ వసూళ్లతో బరిలో దిగుతుంది. వార్నర్ బ్రదర్స్ నిర్మించారు.
Oppenheimer vs Barbie
ఇండియాలో:
ఇండియాలో బార్బీ చిత్రానికి అంత క్రేజ్ లేదు. ప్రముఖ థియేటర్ చైన్స్ ఐనాక్స్, పీవీఆర్, సినీ పోలీస్ సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఓపెన్ హైమర్ 90000 లకు పైగా బుకింగ్స్ అందుకుంది. బార్బీ కేవలం 16000 బుకింగ్స్ మాత్రమే సాధించింది.
Oppenheimer vs Barbie
డైరెక్టర్స్ క్రేజ్:
లేడీ డైరెక్టర్ గ్రేటా గెర్విగ్ రెండు ఆస్కార్స్ గెలుచుకున్నారు. 2017లో ఆమె తెరకెక్కించిన లేడీ బర్డ్ మూవీ బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగాల్లో ఆస్కార్స్ గెలుచుకుంది. లిటిల్ ఉమెన్ చిత్రానికి నామినేట్ అయ్యారు.
ఇక నోలన్ చిత్రాలు వరల్డ్ వైడ్ అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఐదు సార్లు అకాడమీ అవార్డుకు నామినేట్ అయ్యారు.