MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `ఆపరేషన్‌ వాలెంటైన్‌` కలెక్షన్లు.. రెండు రోజుల్లో ఎంతంటే?.. మరీ ఇంత దారుణమా?

`ఆపరేషన్‌ వాలెంటైన్‌` కలెక్షన్లు.. రెండు రోజుల్లో ఎంతంటే?.. మరీ ఇంత దారుణమా?

వరుణ్‌ తేజ్‌ నటించిన `ఆపరేషన్‌ వాలెంటైన్‌` మూవీ కలెక్షన్లు పెద్ద షాకిస్తున్నాయి. రెండు రోజుల్లో ఈ మూవీకి ఎంత వచ్చాయో తెలిస్తే మాత్రం మతిపోవాల్సిందే.  

3 Min read
Author : Aithagoni Raju
Published : Mar 03 2024, 12:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

వరుణ్‌ తేజ్‌.. ప్రస్తుతం `ఆపరేషన్‌ వాలెంటైన్‌` చిత్రంతో వచ్చాడు. పుల్వామా ఉగ్రదాడి ఘటన ఆధారంగా రూపొందిన చిత్రమిది. శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. ఇందులో మాజీ మిస్‌ ఇండియా మనుషి చిల్లర్‌ హీరోయిన్‌గా నటించడం విశేషం. ఉగ్రదాడి నేపథ్యంలో రియలిస్టిక్‌ అంశాలతో రూపొందిన ఈ మూవీలో వరుణ్‌ తేజ్‌ ఎయిర్‌ ఫోర్స్ వింగ్‌ కమాండర్‌ అర్జున్‌ పాత్రలో నటించాడు. సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డాడు. లుక్‌ వైజ్‌గా, మేకోవర్‌ వైజ్‌గా చాలానే కష్టపడినట్టు సినిమా చూస్తే అర్థమవుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సినిమా పరంగా తన బెస్ట్ ఎఫర్ట్స్‌ పెట్టాడు. కానీ ఫలితం మాత్రం తేడా కొట్టింది. సినిమాకి ఫస్ట్ డే నుంచి నెగటివ్‌ టాక్‌ ప్రారంభమైంది. ఆ మధ్య ఇలాంటి కంటెంట్‌తోనే `ఫైటర్‌` చిత్రం చేశాడు హృతిక్‌రోషన్‌. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. పైగా తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్ చిత్రం రాలేదు. ఇవి మన ఆడియెన్స్ కి ఎక్కడం కష్టం. సరిగ్గా `ఆపరేషన్‌ వాలెంటైన్‌` రిజల్ట్ విషయంలో అదే జరిగింది. ఈ మూవీని కనీసం చూసేందుకు ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపకపోవడం గమనార్హం. 
 

37

పుల్వామా ఉగ్రదాడి ఎంతో మందిని ప్రభావితం చేసింది. ఉగ్రవాదులపై ఊగిపోయేలా చేసింది. దీనికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. అది మరింత ఒళ్లుగగుర్పొడిచేలా చేసింది. దేశభక్తిని రగిల్చింది. అలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాని ఎవరూ పట్టించుకోకపోవడం ఆశ్చర్యపరుస్తుంది. దేశభక్తి, ఉగ్రదాడుల ను సినిమాగా చేసి కమర్షియలైజ్‌ చేసే ప్రయత్నం బెడిసికొట్టింది. జనం తిప్పికొట్టారనేదానికి ఈ మూవీ నిదర్శనంగా నిలుస్తుంది. దేశభక్తిని సరైన విధంగా వాడితే ఒకలా, లేదంటే ఫలితాలు మరోలా ఉంటాయని నిరూపించింది. 
 

47

ఇక శుక్రవారం విడుదలైన `ఆపరేషన్‌ వాలెంటైన్‌` మూవీ కలెక్షన్లు చూస్తే మతిపోవాల్సిందే. వరుణ్‌ తేజ్‌ టాలీవుడ్‌లో ఎస్టాబ్లిష్‌ అయిన హీరో. పైగా మెగా ఫ్యామిలీ హీరో. అలాంటిది ఆయన్నుంచి సినిమా అంటే మినిమమ్‌ ఓపెనింగ్స్ ఉండాలి. కానీ ఈ మూవీకి మాత్రం రివర్స్ అయ్యింది. కనీసం పట్టించుకునే వాళ్లు లేదు. ఏమాత్రం ప్రభావితం చూపించలేకపోయింది. కొత్త హీరోల సినిమాలకు కూడా దీనికంటే బెటర్‌ కలెక్షన్లు వస్తున్న ఈ రోజుల్లో, వరుణ్‌ తేజ్‌ లాంటి హీరోకి దారుణమైన కలెక్షన్లు నమోదవుతున్నాయి. 
 

57

మొదటి రోజు `ఆపరేషన్‌వాలెంటైన్‌` కేవలం రెండున్నరకోట్లు మాత్రమే గ్రాస్‌ చేసింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన గ్రాస్‌. కోటీ నాలభై లక్షల షేర్‌ రాగా, రెండు రోజు మరింత తగ్గింది. కేవలం రెండు కోట్ల గ్రాస్‌ వచ్చింది. ఇందులో తెలుగు రాష్ట్రాలో 1.5కోట్ల గ్రాస్‌, ఇండియా మొత్తం 15లక్షలు, ఓవర్సీస్‌లో 35లక్షలు వచ్చాయి. రెండు కోట్ల గ్రాస్‌, కోటీ షేర్‌ వచ్చింది. ఇలా రెండు రోజుల్లో రెండున్నర కోట్ల షేర్‌ వచ్చింది. ఈ మూవీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ 17కోట్లకుపైగానే అయ్యిందట. ఈ వీకెండ్‌లో ఇది మూడున్నర కోట్లు చేస్తే ఎక్కువ. ఈ మూడు రోజుల్లోనే ఈ మూవీ అంతో ఇంతో ఆడుతుంది. 
 

67

సోమవారం నుంచి పూర్తిగా వాష్‌ ఔట్‌ అవుతుందని క్రిటిక్స్ అభిప్రాయపడుతుంది. ఇది వరుణ్‌ తేజ్‌కి తీరని అవమానం అనే చెప్పాలి. ఆయన నటించిన గత చిత్రాలు `గని`, `గాంఢీవదారి అర్జున` చిత్రాలు దీనికంటే బెటర్‌గానే చేశాయి. కానీ వరుణ్‌ తేజ్‌ గ్రాఫ్‌ ఇలా పడిపోవడం ఆయన కెరీర్‌కే ప్రమాదకరంగా మారుతుంది. నిజానికి `ఆపరేషన్‌ వాలెంటైన్‌` మూవీలోనూ మ్యాటర్‌ లేదు. ఎమోషన్స్ పండలేదు, డ్రామా అసలే లేదు. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలకు స్కోపే లేదు. జస్ట్ వీడియో గేమ్‌ని తలపిస్తుందనే కామెంట్స్ వస్తున్నాయి. వరుణ్‌ తేజ్‌ పాత్రకి అసలు ప్రయారిటీనే లేదు. హీరోయిన్‌ ముందు తేలిపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన అసలు ఈ మూవీ ఎందుకు చేశాడో అనే సందేహం కలుగుతుంది. 
 

77

దీనికితోడు ప్రస్తుతం పరీక్షల సమయం. అది సినిమాపై చాలా ప్రభావం పడిందని అంటున్నారు. ఏదేమైనా బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు ఫ్లాప్‌లతో హ్యాట్రిక్‌ ఫ్లాప్స్ చవిచూశాడు వరుణ్‌. వరుణ్‌ తేజ్‌ ఇటీవల లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె సెంటిమెంట్‌ కూడా ఆయనకు కలిసి రాలేదు. మ్యారేజ్‌ అయ్యాక అదృష్టం కలిసి వస్తుందంటుంటారు. కానీ వరుణ్‌కి ఆ ఫ్యాక్టర్‌ కూడా పనిచేయలేదని స్పష్టమవుతుంది. ఇకపై అయినా ఆయన జాగ్రత్తగా స్క్రిప్ట్ లు ఎంపికచేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi 5 Days Collections: సోమవారం ఊహించని కలెక్షన్లు, ఐదో రోజు పెద్ది ఎంత వసూలు చేసిందంటే?
Recommended image2
Balakrishna Birthday Special: ఒకేరోజు మూడు సినిమాలు రిలీజ్‌, అభిమానులకు బాలయ్య ఇవ్వబోతున్న కొత్త ట్రీట్స్ ఇవే
Recommended image3
Soundarya: ఎంత స్టార్ అయినా సౌందర్య కాళ్ళు పట్టుకోవాల్సిందే, ఆ హీరో చేసిన పనిని పబ్లిక్ గా బయటపెట్టాం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved