MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • చిరంజీవికి దాసరి బంధువా? మరి ఇద్దరి మధ్య విబేధాలు ఎందుకు తలెత్తాయి? 

చిరంజీవికి దాసరి బంధువా? మరి ఇద్దరి మధ్య విబేధాలు ఎందుకు తలెత్తాయి? 

ఒకప్పుడు ఇండస్ట్రీ పెద్దగా అనేక సమస్యలను పరిష్కరించిన దాసరి నారాయణరావుతో చిరంజీవికి విబేధాలు ఉన్నాయనే వాదన ఉంది. దీనిపై ఓసారి దాసరి స్పష్టత ఇచ్చారు. చిరంజీవి తనకు బంధువన్న విషయం లీక్ చేశాడు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 03 2025, 06:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావు తెలుగు సినిమాకు దశాబ్దాల పాటు సేవలు చేశారు. ఆయన లెజెండరీ దర్శకుడు అనడంలో సందేహం లేదు. దాసరి గొప్ప నటుడు కూడాను. అనేక చిత్రాల్లో కీలక రోల్స్ చేశారు. దాసరి రాజకీయాల్లో కూడా రాణించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నెరవేర్చారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

నాలుగు తరాల హీరోలతో పని చేసిన దాసరి... ఇండస్ట్రీ పెద్దగా వెలుగొందారు. ముఖ్యంగా చిన్న సినిమాలకు, నిర్మాతలకు సమస్య ఎదురైతే ఆయన ముందుండేవారు. చిన్న సినిమాను బ్రతికించుకున్నప్పుడే ఇండస్ట్రీ మనుగడ సాధ్యం. మీడియం, లో బడ్జెట్ చిత్రాలను ప్రోత్సహించాలి. సదరు చిత్రాల విడుదలకు అడ్డంకులు లేకుండా వెసులుబాటు కల్పించాలి. థియేటర్స్ కేటాయించాలని దాసరి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కొన్ని ప్రతిపాదనలు తెరపైకి తేవడం జరిగింది. 

 

37
Chiranjeevi and Dasari

Chiranjeevi and Dasari

నాలుగు కుటుంబాల గుప్పెట్లో తెలుగు సినిమా నలిగిపోతుంది. వారి ఆధిపత్యం కారణంగా చిన్న సినిమాలు, నటులు నష్టపోతున్నారు. నలిగిపోతున్నారని పలు వేదికలపై దాసరి బహిరంగంగానే విమర్శలు చేశారు. దాసరి విమర్శలు గుప్పించిన ఆ నాలుగు కుటుంబాల్లో చిరంజీవి ఫ్యామిలీ కూడా ఒకటనే వాదన ఉంది.  నెపోటిజం కారణంగా అవుట్ సైడర్స్ కి అన్యాయం జరుగుతుందని కూడా దాసరి అభిప్రాయపడ్డారు. 

47
Chiranjeevi and Dasari

Chiranjeevi and Dasari

దాసరి కామెంట్స్ తో చిరంజీవి నొచ్చుకున్నారు. దాసరి-చిరంజీవి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దూరం పెరిగిందంటూ అప్పట్లో కథనాలు వెలువడ్డాయి ఈ పుకార్లపై ఓ సందర్భంలో దాసరి స్పందించారు. చిరంజీవితో తనకు విబేధాలు లేవంటూ ఖండించారు. చిరంజీవితో నాకు ఎందుకు గొడవలు ఉంటాయి. అసలు చిరంజీవి నాకు బంధువు అవుతాడు. మీకు ఆ విషయం తెలియదు. మా మేనల్లుడు చిరంజీవి బంధువును పెళ్లాడు... అని దాసరి అన్నారు. 

57
Chiranjeevi and Dasari

Chiranjeevi and Dasari

దాసరి సొంత మేనల్లుడు చిరంజీవికి పిన్నమ్మ అయ్యే అమ్మాయిని పెళ్లాడాడు అట. ఆ విధంగా చిరంజీవి కుటుంబంతో దాసరి కుటుంబానికి బంధుత్వం ఏర్పడిందట. ఇక పరోక్షంగా తనపై దాసరి చేసిన విమర్శలపై చిరంజీవి ఓ సందర్భంలో స్పందించారు. నేను రాజకీయాల్లోకి వస్తుస్తున్నానన్న విషయం దాసరితో చెప్పలేదు. ఆయన తనకు చెప్పి ఉండాల్సిందని భావించి ఉండొచ్చు. ఆయనంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంది. ఆయన్ని తరచుగా కలుస్తూనే ఉన్నాను. అయితే అందరినీ మనం సంతృప్తి పరచలేము, అన్నారు. 

 

67
Chiranjeevi and Dasari

Chiranjeevi and Dasari

దాసరి నారాయణరావు ప్రధాన పాత్రలో నటించిన మేస్త్రి మూవీ 2009లో విడుదలైంది. ఈ చిత్రంలో చిరంజీవి పొలిటికల్ కెరీర్ మీద దాసరి సెటైర్స్ వేశారనే వాదన ఉంది. ఇక చిరంజీవి, దాసరి కాంబోలో లంకేశ్వరుడు టైటిల్ తో ఒక మూవీ తెరకెక్కింది. ఇది డిజాస్టర్ కావడం విశేషం. 
 

77
Chiranjeevi and Dasari

Chiranjeevi and Dasari

కాగా దాసరి నారాయణరావు 2017లో కన్నుమూశారు. అనంతరం యన గౌరవార్థం 2018 లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎదుట విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలాగే దాసరి నారాయణరావు సొంతూరు పాలకొల్లులో కూడా విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రాజకీయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic 8 Days Collections: నెగటివ్‌ టాక్ తోనూ యష్‌ మూవీకి ఊహించని కలెక్షన్లు.. టాక్సిక్‌ కి ఇంకా ఎంత రావాలంటే?
Recommended image2
Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు
Recommended image3
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved