- Home
- Entertainment
- నా కాపురంలో ప్రీతి జింటా చిచ్చుపెట్టింది, ఆమెను ఎప్పటికీ క్షమించను... సింగర్ సుచిత్ర ఫైర్!
నా కాపురంలో ప్రీతి జింటా చిచ్చుపెట్టింది, ఆమెను ఎప్పటికీ క్షమించను... సింగర్ సుచిత్ర ఫైర్!
సింగర్ కమ్ యాక్ట్రెస్ సుచిత్ర కృష్ణమూర్తి మరోసారి హీరోయిన్ ప్రీతి జింటాపై మండిపడ్డారు. శేఖర్ కపూర్ తో విడాకులకు ఆమెనే కారణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Preity zinta
వయసులో తనకంటే ముప్పై ఏళ్ల పెద్దవాడైన శేఖర్ కపూర్ ని వివాహం చేసుకుని సుచిత్ర కృష్ణమూర్తి సంచలనం రేపారు. 1999లో వీరి వివాహం జరిగింది. భర్త కోరిక మేరకు ఆమె నటనకు దూరమయ్యారు. ఒక కూతురు పుట్టాక 2007లో వీరు విడిపోయారు. శేఖర్ కపూర్ తనతో నిజాయతీగా ఉండటం లేదు. అతని ప్రేమలో నిజం లేదని సుచిత్ర ఆరోపణలు చేశారు. అయితే తమ విడాకులకు హీరోయిన్ ప్రీతీ జింటా కారణమైంది. మా దంపతుల మధ్య దూరి చిచ్చుపెట్టిందని సుచిత్ర బహిరంగంగా ఆరోపించారు.
సుచిత్ర కామెంట్స్ కి ప్రీతి జింటా స్పందించారు. నేను చిత్ర పరిశ్రమలో నంబర్ వన్ హీరోయిన్ గా ఉన్నాను. సుచిత్ర కనీసం నటించడం లేదు. ఆమె గృహిణిగా ఇంటికి పరిమితమైంది. నా గురించి మాట్లాడే అర్హత ఆమెకు లేదు. చూస్తుంటే ఆమె మానసిక స్థితి సరిగా లేదనిపిస్తుంది. సుచిత్ర మంచి మానసిక వైద్యుడిని కలిస్తే మంచిది, అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
Image: Instagram
గతంలో ప్రీతి జింటాతో జరిగిన ఈ మాటల యుద్ధంపై సుచిత్ర తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. తన మాటలకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరి గురించైనా మాట్లాడొచ్చు. గృహిణిగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. 20 ఏళ్ళు తల్లిగా ఉన్నందుకు ఆనందపడుతున్నాను. ఎవరెన్ని మాట్లాడినా నిజానికే బలం ఉంటుంది. అదే చివరి వరకు నిలబడుతుంది. ఆమెను నేను ఎప్పటికీ క్షమించను. తను ఉందా లేదా అనే విషయాలు కూడా పట్టించుకోను, అన్నారు.
మలయాళ చిత్రం 'కిలుక్కింపెట్టి'తో జయరామ్ సరసన హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సుచిత్రా కృష్ణమూర్తి. తర్వాత తమిళ చిత్రం 'శివరంజని'లో టైటిల్ రోల్ పోషించి ఆకట్టుకుంది. తర్వాత షారుక్ ఖాన్ కభీ హా కభీ నా, జజ్‌బాత్ ఆగ్, రోమియో అక్బర్ వాల్టర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. సుచిత్రా కృష్ణమూర్తి నటిగానే కాకుండా గాయనీగా కూడా పేరు తెచ్చుకుంది. చాలా గ్యాప్ తర్వాత 'భూల్ భులయా 2', 'గిల్టీ మైండ్స్' వెబ్ సిరీస్‌లో నటించింది.
Suchitra Krishnamoorthi
గత ఏడాది సుచిత్రా కృష్ణమూర్తి కూతురి మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రెస్ ఇంటరాక్షన్‌లో తన కన్న కూతురే తనను డేటింగ్ చేయమని బలవంతపెట్టినట్లుగా చెప్పుకొచ్చింది. కూతురు కావేరి కపూర్ తెలియని వ్యక్తులతో డేటింగ్ చేయమని ప్రోత్సహించినట్లు సుచిత్ర చెప్పారు.
' విడాకుల తర్వాత నా కూతురు కావేరి నా పేరును డేటింగ్ సైట్‌లో నమోదు చేసింది. పురుషులతో డేటింగ్ చేయమని బలవంతం కూడా చేసింది. ఎవరికీ తెలియని ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, తర్వాత అతనితో కూడా విడిపోయానని, ఇప్పుడు నేను ఉన్నది డేటింగ్ చేసేందుకు కాదని నా కుమార్తెకు అర్థమయ్యేలా చెప్పాను. తర్వాత నాకు అసభ్యకరంగా మెస్సేజ్‌లు రావడంతో డేటింగ్ సైట్‌లో నా ప్రొఫైల్‌ను తొలగించింది.' అని సుచిత్రా కృష్ణమూర్తి పేర్కొంది. కాగా సుచిత్రా కుమార్తె కావేరి 'బాబీ ఔర్ రిషీ కి లవ్ స్టోరీ' మూవీతో నటిగా పరిచయం కానుంది.