- Home
- Entertainment
- ఫస్ట్ టైం కొడుకును ఫ్యాన్స్ కి పరిచయం చేసిన యాంకర్ లాస్య... నెటిజన్స్ ఫీలింగ్ ఏంటంటే?
ఫస్ట్ టైం కొడుకును ఫ్యాన్స్ కి పరిచయం చేసిన యాంకర్ లాస్య... నెటిజన్స్ ఫీలింగ్ ఏంటంటే?
మదర్స్ డే సందర్భంగా లాస్య ఓ ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో తన ఇద్దరు కుమారులను, అమ్మను, భర్తను పరిచయం చేశారు. వీరి గురించి మనసుకు హత్తుకునే కామెంట్స్ చేశారు.

Anchor Lasya
కొద్ది రోజుల క్రితం లాస్య రెండో బిడ్డకు జన్మనిచ్చారు. ఆ పిల్లాడిని ఇంత వరకు అభిమానులకు చూపించలేదు. మదర్స్ డే సందర్భంగా పోస్ట్ చేసిన వీడియోలో పెద్ద కొడుకు జున్నుతో పాటు చిన్న కుమారుడిని కూడా పరిచయం చేసింది. లాస్య పొత్తిళ్లలో ఉన్న చంటిగాడిని చూసి నెటిజెన్స్ ఆసక్తికర కామెంట్స్. అచ్చు జున్నులానే ఉన్నాడని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Anchor Lasya
లాస్య ఇంస్టాగ్రామ్ వీడియో వైరల్ అవుతుంది. లాస్య పెద్దబ్బాయికి ఆరేడేళ్లు ఉంటాయి. గతంలో సెకండ్ చైల్డ్ గురించి అడుగుతుంటే కోపం వస్తుందని లాస్య అన్నారు. దాంతో ఇకపై ఆమె పిల్లల్ని కనరని అభిమానులు భావించారు.
Anchor Lasya
లాస్య ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమించినవాడితో పెళ్ళికి లాస్య తండ్రి అంగీకరించలేదట. దీంతో ఆమె చాలా కాలం పేరెంట్స్ తిరస్కరణకు గురయ్యారట. తమకు ఓ బిడ్డ పుట్టాక పేరెంట్స్ దగ్గరయ్యారని లాస్య చెప్పుకొచ్చింది.
Anchor Lasya
ఇక యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన లాస్య బిగ్ బాస్ షోతో మరింత పాపులర్ అయ్యారు. మంచి ఫార్మ్ లో ఉన్న సమయంలో లాస్య వ్యక్తిగత కారణాలతో బుల్లితెరకు దూరం అయ్యారు. తర్వాత సడన్ గా బిగ్ బాస్ సీజన్ 4లో ప్రత్యక్షం అయ్యారు.
Lasya
హౌస్ లో లాస్య తన ప్రత్యేకత చాటుకున్నారు. ముఖ్యంగా ఆమె కంటెస్టెంట్స్ కి రుచికరమైన భోజనం వండి పెడుతూ ఉండేవారు. అందరితో ఆమె సన్నిహితంగా మెలిగేవారు. చాలా తక్కువ సందర్భాల్లో లాస్య సహనం కోల్పోయారు.
Anchor Lasya
అదే సమయంలో ఈమె కూడా ఓ గ్రూప్ మైంటైన్ చేశారు. అభిజిత్, హారిక, నోయల్, లాస్య ఓ జట్టుగా ఉండేవారు. వీరిలో ఒకరైన అభిజీత్ బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ అందుకున్నారు. అభిజీత్ టైటిల్ గెలవడంతో లాస్య ఆనందం వ్యక్తం చేశారు.
తాజాగా లాస్య ఇంస్టాగ్రామ్లో చిలిపి వీడియో పోస్ట్ చేసింది. భర్తతో కలసి బెడ్ రూమ్ లో ఉన్న వీడియో షేర్ చేస్తూ దానికి చిలిపి కామెంట్స్ జత చేసింది. పీరియడ్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని నా భర్తతో చెప్పాను. పీరియడ్స్ 9 నెలలు దూరం చేస్తా అంటూ నన్ను మళ్ళీ గర్భవతిని చేశాడు.. అంటూ లాస్య చిలిపిగా ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో నెటిజన్లని భలే ఆకట్టుకుంటోంది.
కానీ లాస్య ఫైనల్ కి వెళ్లలేకపోయారు. టైటిల్ రేసులో ఉంటుందనుకుంటే లాస్య అంచనాలు అందుకోలేదు. ఆమెది ఫేక్ స్మైల్ అనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. హోస్ట్ నాగార్జున కూడా లాస్యను ఫేక్ స్మైల్ అన్నారు. అది కూడా మైనస్ అయ్యింది. బుల్లితెర మీద లాస్య సందడి తగ్గింది. అప్పుడప్పుడు అడపాదడపా షోలలో ఆమె కనిపిస్తున్నారు. లాస్యకు ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో వీడియోలు చేస్తుంటారు. భర్త, పిలల్లతో లాస్య హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు.