- Home
- Entertainment
- OG Trailer Review: వచ్చేది చిరుత కాదు, బెంగాల్ టైగర్.. ఓజీ ఫైనల్ ట్రైలర్ ఎలా ఉందంటే?
OG Trailer Review: వచ్చేది చిరుత కాదు, బెంగాల్ టైగర్.. ఓజీ ఫైనల్ ట్రైలర్ ఎలా ఉందంటే?
OG Trailer Review: `ఓజీ` సినిమా ఫైనల్ ట్రైలర్ వచ్చింది. రెండు రోజులుగా ఊరిస్తోన్న ట్రైలర్‌ని పవన్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ మాదిరిగానే సినిమా ఉంటే బాక్సాఫీసు వద్ద పవన్‌ని ఆపడం ఎవరితరం కాదు. ఫ్యాన్స్ ఈ ట్రైలర్ చూసి ఊగిపోతున్నారు.

`ఓజీ` మూవీ ఫైనల్ ట్రైలర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `ఓజీ` ఫైనల్ ట్రైలర్ వచ్చేసింది. రెండు రోజులుగా ఊరిస్తోన్న ట్రైలర్‌ని ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ ట్రైలర్ ని ఆదివారం ఈవెంట్‌లో విడుదల చేశారు. ఫ్యాన్స్ కోసం చూపించారు. కానీ డిజిటల్‌లో రిలీజ్ చేయలేదు. అయితే ఫైనల్ వర్క్ కాకపోవడంతో డిలే అవుతూ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. నిరాశలో ఉన్న అభిమానులను సడెన్ సర్‌ప్పైజ్ చేశారు.
`ఓజీ` ట్రైలర్‌లో అదిరిపోయేలా ఇంట్రో
ఇక ట్రైలర్ ఎలా ఉందనేది చూస్తే, `బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్లీ మొదలయ్యాయి. అయితే ఈసారి గన్స్ అన్నీ సత్య దాదా వైపు తిరిగాయి` అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇందులో పవన్ కళ్లని చూపించారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ తప్పించుకుని పారిపోతుండగా కొందరు వెంబడిస్తున్నారు. చంపేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అనంతరం పలు యాక్షన్ సీన్లు వచ్చాయి. `దాదా వరకు వెళ్లారంటే పరిస్థితి చేజారిపోతున్నట్టుంది అని శుభలేఖ సుధాకర్ వాయిస్ వినిపిస్తుంది. ఇందులో అర్జున్ దాస్, శ్రియా రెడ్డిలను చూపించారు. అలాగే ముంబాయి పోలీసులు అలెర్ట్ అవుతున్నారు.
ఇమ్రాన్ హష్మీ ఎంట్రీ అదిరిపోయింది
అంతలోనే ఓమీ ఇమ్రాన్ హష్మీ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన చేసేవిధ్వంసాన్ని చూపించారు. పరిగెత్తు అంటూ అరవడం ఆకట్టుకుంది. అనంతరం వాళ్లని ఎదుర్కొని నిలబడాలంటే ఒక్కడే అని శ్రియా రెడ్డికి సుధాకర్ చెప్పగా, పవన్ కత్తితో ముందస్తు ఎంట్రీ ఎలివేషన్లు వచ్చారు. ఎవరు ఎవరు అని విలన్ అడగ్గా, శ్రియా రెడ్డి అరాచకంగా నవ్వడం, అతనేనా, వాడైతే కాదుగా అని ఆయన అడగడం పవన్ కళ్యాణ్ ఎంట్రీని చూపిస్తుంది. ఇంతలోనే పవన్ షాట్స్ ని పరిచయం చేశారు. వర్షంలో పవన్ లుక్‌ని చూపించారు. అనంతరం ఫ్యామిలీ ఎలిమెంట్లు చూపించారు. ప్రియాంక మోహన్ ఏదో సౌండ్ విని కిందకు వచ్చింది. కత్తి చూసి ఊపిరిపీల్చుకుంటుంది. ఆమెని చూసే పవన్ లుక్ అదిరిపోయింది.
బాంబే వస్తున్నా.. తలలు జాగ్రత్త
మరోవైపు పవన్ కళ్యాణ్ చేతిపై ఓ టాటూ ఉంటుంది. దాన్ని అర్థమేంటని ప్రశ్నించగా, పవన్ యాక్షన్ తో రెచ్చిపోయారు. ఇంకా చెప్పాలంటే ఊచకోత కోస్తాడు. ముంబయిలోనూ ఆయన షాట్స్ చూపించడంతో గూస్ బంమ్స్ తెప్పిస్తున్నాయి. ఈ సందర్భంగా అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌లో నిన్ను కలవాలని కొందరు, నిన్ను చూడాలని ఇంకొందరు, నిన్ను చంపాలని అందరు ఎదురుచూస్తున్నారని చెప్పగా, అంతలోనే ఓమీకి ఒక ఫోన్ వస్తుంది. అందులో `బాంబే వస్తున్నా.. తలలు జాగ్రత్త` అని పవన్ చెప్పడం అదిరిపోయింది. ముంబయి వస్తూనే బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆయన్ని చూసి అంతా పారిపోతున్నారు. పవన్ గ్యాంగ్ స్టర్ లుక్‌లో, తన మనుషులతో ఎంట్రీ సీన్లు వాహ్ అనేలా ఉన్నాయి.
వచ్చేది బెంగాల్ టైగర్
వరుస యాక్షన్ సీన్లు, ఎలివేషన్లు అదిరిపోయాయి. ఇంతలో `టైగర్ వస్తుంది, బెంగాల్ టైగర్` అని పవన్ వాయిస్ వినిపించడం పూనకాలు తెప్పిస్తుంది. మరోసారి పవన్ తుపాకులతో ప్రత్యర్థులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. అనంతరం నవ్వుతూ, అరుస్తూ `ఓజాస్ గాంభీర ఓజాస్ గాంభీర.. నా కొడక్కల్లారా` అని చెప్పే ఫైనల్ షాట్ అదిరిపోయింది. మొత్తంగా `ఓజీ` ట్రైలర్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ లాగా ఉంది. అభిమానులు కోరుకున్నట్టు ఉంది. సినిమా కూడా ఇదే రేంజ్‌లో ఉంటే మాత్రం థియేటర్లు తగలబడిపోవడమే, బాక్సాఫీసు దద్దరిల్లిపోవాల్సిందే. మరి సినిమా ఎలా ఉంటుందో మరో రెండు రోజుల్లో తేలనుంది. ఈ నెల 25న మూవీ గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు.