MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ లేడీ గెటప్ వేసిన ఏకైక సినిమా , చీరకట్టి, పూలు కూడా పెట్టిన పెద్దాయన.

ఎన్టీఆర్ లేడీ గెటప్ వేసిన ఏకైక సినిమా , చీరకట్టి, పూలు కూడా పెట్టిన పెద్దాయన.

దివంగత తార నటసార్వభౌముడు తారకరాముడిని  ఏ గెటప్ లో చూసి ఉంటాం రాముడిగా, కృష్ణుడిగా, రావణుడిగా, హీరోగా ఇలా అన్ని రకాల పాత్రలు చూశాం కాని. పెద్దాయన లేడీ గెటప్ కూడా వేశారని మీకు తెలుసా..? సీనియర్ ఎన్టీఆర్ చీరకట్టిన ఏకైక సినిమా ఏదో తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 15 2025, 07:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పెద్ద ఎన్టీఆర్ నటన, గాంభీర్యం అందరికి తెలిసిందే. ఆయన వేయని పాత్రలు లేవు. పెద్దాయన అంటే తెలుగు ప్రేక్షకులలో దైవ భావం  ఉంటుుంది. ఆయన్ను ఓ రేంజ్ లో చూస్తుంటారు జనాలు. మరి అలాంటి ఎన్టీఆర్ లేడీ గెటప్ వేశారని మీకు తెలుసా..? అవును  ఇప్పుడు అంటే హీరోలు లేడీ గెటప్ లు వేయడం పెద్ద విషయం కాదు. కాని అప్పట్లో ఆ హీరోలు ఆడవేశం వేయడం అంటే చాలా పెద్ద విషయమే అనాలి. కాని  సీనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆడవేశంతో పాటు బృహన్నల వేశం కూడా వేసి.. తన నటనకు సాటి ఏది రాదు అని నిరూపించారు. 

25

తెలుగు సినిమా పరిశ్రమకు రెండు కళ్లుగా నిలిచిన ఎన్టీఆర్ ఏఎన్నార్ లు కూడా లేడీ గెటప్ లో సందడి చేశారు. ఇక పెద్దాయన ఎన్టీఆర్ అయితే ఆడ వేషం వేయడంతో పాటు.. అప్పటి స్టార్ కమెడియన్ తో  ఓ డ్యూయెట్ కూడా పాడుకున్నారు. ఇంతకీ  ఎన్టీఆర్ లేడీ గెటప్ వేసిన ఆ సినిమా ఏదో తెలుసా.. అన్నా తమ్ముడు. ఈ సినిమాలో లేడీ గెటప్ లో కనిపించారు ఎన్టీఆర్. అచ్చు గుద్దినట్టుగా ఓ మహిళ, మధ్యతరగతి ఇల్లాలు ఎలా ఉంటుందో అలా కనిపించారు. నెత్తిన కొప్పు పెట్టుకుని.. చీర బిగదీసి కట్టుకుని, మల్లెపూలు, ముక్కు పుడకతో పెద్ద ఎన్టీఆర్ ను చూస్తే.. అంతా అలా చూస్తూ ఉండిపోవల్సిందే. 
 

35

ఈగెటప్ వేయడంతో పాటు  పెద్దాయన ఓ డ్యూయోట్ కూడా పాడుకున్నారు. డ్యూయోట్ అంటే ఇంకొకరు ఉండాలి కదా.. మరి అవతలి వ్యక్తి ఎవరో తెలుసా. ఓ స్టార్ కమెడియన్ అవును ఇలా అందంగా మేకప్ తీర్చి దిద్దుకునిఅలనాటి స్టార్ కమెడియన్ రేలంగితో కలిసి డ్యూయోట్ కూడా పాడుకున్నారు. ఈ పాట అప్పట్లో చాలా హైలెట్ అయ్యింది. 
 

45

రాముడిగా కృష్ణుడిగా, దుర్యోధనుడిగా , అర్జునుడిగా, కర్ణుడిగా, వీర బ్రహ్మేంద్రస్వామిగా, వేమనగా, ఆది శంకరుడిగా, రామానుజుడిగా.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే..సీనియర్ ఎన్టీఆర్ చేసినన్న పాత్రలు ఎవరు చేసి ఉండరేమో. అంతే కాదు.. ప్రతీ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశాం చేసేవారు. ఎవరికి సాధ్యం కాని నటన ఆయనలో కనిపించేది. అటు మైథలాజికల్ క్యారెక్టర్ లు మాత్రమే కాదు.. ఇటు సోషల్ మూవీస్ కూడా అంతే అద్భుతంగా చేసిన ఎన్టీఆర్ .. కమర్షియల్ సినిమాలతో నిర్మాతలకు కాసులు కురిపించారు.  
 

55

హీరోగా ప్రేక్షకులను అలరించిన ఎన్టీఆర్. ఆతరువాత రాజకీయాల్లోకి వచ్చి.. 9నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలకు ఎంతో సేవ చేశారు. రెండు రూపాయలు బియ్యం, మహిళకు ఆస్తి హక్కు, వృద్ధులకు పెన్షన్లు, ఇలా ఎన్టీఆర్ చేసిన సేవ అంతా ఇంతా కాదు. అందుకే ప్రజల మనసుల్లోపెద్దాయన చిరస్థాయిగా నలిచిపోయారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి తారక రామారావు
తెలుగు సినిమా
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Raashi Khanna: డాక్టర్‌ కాదు, యాక్టర్‌ కాదు, రాశీఖన్నా అసలు డ్రీమ్‌ ఇదే.. పవన్‌ కళ్యాణ్‌ ముందు నిజం చెప్పేసింది
Recommended image2
Oscar Tributes: కోట శ్రీనివాసరావుని ప్రత్యేకంగా గౌరవించిన ఆస్కార్‌.. ఈ ముగ్గురి దిగ్గజాలకు అకాడమీ నివాళ్లు
Recommended image3
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌ పెద్ద 420, నేను అస్సలు నమ్మను.. బండారం బయటపెట్టిన నటి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved