MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒకరితో ప్రకటన మరొకరితో సినిమా... తికమక పెడుతున్న టాలీవుడ్ స్టార్స్ క్రేజీ డైరెక్టర్స్!

ఒకరితో ప్రకటన మరొకరితో సినిమా... తికమక పెడుతున్న టాలీవుడ్ స్టార్స్ క్రేజీ డైరెక్టర్స్!

అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని... అని కవిగారు రాసినట్లు స్టార్ హీరోల కాంబోలు అనుకున్నవి కావడం లేదు. అనుకోకుండా కొన్ని తెరపైకి వస్తున్నాయి. ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ముందుగా ప్రకటించిన చిత్రాలు పక్కన పెట్టి కొత్త ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.

1 Min read
Author : Sambi Reddy
Published : Nov 29 2022, 08:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Tollywood Top Stars

Tollywood Top Stars

పుష్ప చిత్రానికి ముందు అల్లు అర్జున్ దర్శకుడు కొరటాల శివతో మూవీ ప్రకటించారు. అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా విడుదల చేశారు. కొరటాల శివ చిరంజీవి ఆచార్య పూర్తి చేయడంలో నిమగ్నమయ్యాడు. ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ సుకుమార్ తో మూవీ చేశాడు. వీరి కాంబోలో తెరకెక్కిన పుష్ప విడుదలై పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టింది.

25


పుష్ప విడుదలైన ఐదు నెలలకు కొరటాల శివ-చిరంజీవిల ఆచార్య రిలీజ్ అయింది. ఆచార్య డిలే కావడంతో ప్రణాళికలు మారిపోయాయి. పుష్ప కి సీక్వెల్ కూడా ఉన్న నేపథ్యంలో కొరటాల ఎన్టీఆర్ కి షిఫ్ట్ అయ్యాడు. సేమ్ స్టోరీతో ఎన్టీఆర్ తో మూవీ ప్రకటించాడు. 

35

మరోవైపు ఎన్టీఆర్ త్రివిక్రమ్ ని పక్కన పెట్టి కొరటాలకు ఓటేశాడు. ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీపై అధికారిక ప్రకటన జరిగింది. ఆర్ ఆర్ ఆర్, త్రివిక్రమ్ మూవీ ఎన్టీఆర్ ఏక కాలంలో పూర్తి చేస్తారన్న ప్రచారం జరిగింది. లాక్ డౌన్ తో పాటు త్రివిక్రమ్ భీమ్లా నాయక్ పనుల్లో బిజీ కావడంతో ఎన్టీఆర్ మనసు మారింది. ఏ ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లాల్సిన చిత్రం లేటు కావడంతో ఎన్టీఆర్ మనసు మారింది. త్రివిక్రమ్ ని పక్కన పెట్టి కొరటాలకు ఛాన్స్ ఇచ్చాడు. 

45


ఎన్టీఆర్ ప్రాజెక్ట్ అటకెక్కడంతో త్రివిక్రమ్ మహేష్ ని లైన్లో పెట్టాడు. తన స్క్రిప్ట్ తో మెప్పించి మూవీ లాక్ చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ సెట్స్ పై ఉంది. ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. 

55

మరొక కాంబినేషన్ చేంజ్ తాజాగా చోటు చేసుకుంది. ఉప్పెన డైరెక్టర్ ఎన్టీఆర్ కోసం ఒక విలేజ్ స్పోర్ట్స్ డ్రామా సిద్ధం చేశారు. దాదాపు ఈ ప్రాజెక్ట్ ఖాయమే అని వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ కి స్క్రిప్ట్ నచ్చింది. మూవీ చేద్దామని హామీ ఇచ్చాడు. ఐతే మరో రెండేళ్లు ఎన్టీఆర్ ఖాళీగా లేరు. దీంతో బుచ్చిబాబు మరో ఆరు నెలల్లో ఫ్రీ కానున్న రామ్ చరణ్ తో ముందుకు వెళుతున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
GV Prakash: విడిపోయాం కానీ .. సైంధవితో బంధంపై జీవీ ప్రకాశ్ ఎమోషనల్..
Recommended image2
పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్ సీక్రేట్ చెప్పిన చిరంజీవి, పవర్ స్టార్ ప్రాణంగా ప్రేమించింది ఎవరిని? మెగాస్టార్ ఎందుకు భయపడ్డాడు?
Recommended image3
Priyanka Chopra: స్వర్ణ దేవాలయంలో సేవ.. పాత్రలు కడిగిన గ్లోబల్ బ్యూటీ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved