- Home
- Entertainment
- `కాంతార` సిరీస్‌లో ఎన్టీఆర్.. బాక్సాఫీస్ షేక్ అయ్యే ప్లాన్ చేస్తోన్న రిషబ్ శెట్టి
`కాంతార` సిరీస్‌లో ఎన్టీఆర్.. బాక్సాఫీస్ షేక్ అయ్యే ప్లాన్ చేస్తోన్న రిషబ్ శెట్టి
`కాంతార` సిరీస్‌కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సిరీస్‌లోకి ఎన్టీఆర్ రాబోతున్నారట. ఇదే ఇప్పుడు ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.

`కాంతార` సిరీస్ లో ఎన్టీఆర్
ఎన్టీఆర్ ఇప్పుడు వరుసగా భారీ సినిమాల లైనప్‌తో బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దీనికి `డ్రాగన్` అనే పేరుని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఈ సినిమా ఉంది. ఇందులో భారీ కాస్టింగ్ ఉండబోతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కి సంబంధించిన మరో క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. `కాంతార`లో ఎన్టీఆర్ నటించబోతున్నట్టు తెలుస్తోంది.
KNOW
అక్టోబర్ 2న రాబోతున్న `కాంతార 2`
ప్రస్తుతం రిషబ్ శెట్టి `కాంతార 2` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. `కాంతారః ఛాప్టర్ 1` పేరుతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు రిషబ్ శెట్టి. `కాంతార` మూవీకిది ప్రీక్వెల్‌గా ఉండబోతుందట. లెజెండ్(కాంతార లోని పాత్ర) గతాన్ని, ఆ పాత్ర మూలాలకు సంబంధించిన కథని ప్రధానంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. మొదటి పార్ట్ కి రెండు రెట్లు హైలో ఈ చిత్రం ఉండబోతుందని తెలుస్తోంది. సినిమాని గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది టీమ్.
Where legends are born and the roar of the wild echoes… 🔥#Kantara – A prequel to the masterpiece that moved millions.
Wishing the trailblazing force behind the legend, @shetty_rishab a divine and glorious birthday.
The much-awaited prequel to the divine cinematic… pic.twitter.com/0dTSh2lZ4k— Hombale Films (@hombalefilms) July 7, 2025
`కాంతార 3`లో ఎన్టీఆర్
ఇప్పుడు ఈ సినిమా సిరీస్‌కి సంబంధించి ఒక బిగ్గెస్ట్ క్రేజీ అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. `కాంతార` సిరీస్‌లోకి ఎన్టీఆర్ రాబోతున్నారట. `కాంతార 3`లో తారక్ నటించే అవకాశం ఉందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూడో పార్ట్ లో ఒక బలమైన పాత్రలో ఎన్టీఆర్‌ని నటింప చేయాలని రిషబ్ శెట్టి ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ ఐడియా ప్రాథమిక దశలోనే ఉందని సమాచారం. అదే సమయంలో ఈవార్తకి సంబంధించిన మరింత సమాచారం రావాల్సి ఉంది. కానీ ఈ రూమర్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తారక్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది.
ఎన్టీఆర్, రిషబ్ శెట్టిల మధ్య స్నేహం
ఇదిలా ఉంటే ఎన్టీఆర్, రిషబ్ శెట్టి మంచి స్నేహితులు. చాలా కాలంగా వీరిమధ్య స్నేహం కొనసాగుతుంది. ఆ మధ్య ఎన్టీఆర్ కర్నాటక వెళ్లినప్పుడు అక్కడ ప్రసిద్ధ టెంపుల్స్ ని దగ్గరుండి చూపించారు రిషబ్ శెట్టి. ప్రత్యేకపూజలు చేయించారు. ఆ ట్రిప్ మొత్తంలో తారక్ వెంటనే ఉన్నారు రిషబ్ శెట్టి. వీరి మధ్య స్నేహం `కాంతార 3`లో తారక్ నటించేందుకు కారణమవుతుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇది తారక్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తుందని చెప్పొచ్చు.
బెంగాల్ బ్యాక్ డ్రాప్‌లో ప్రశాంత్ నీల్ మూవీ
ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తోన్న ప్రశాంత్ నీల్ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. 1970 నాటి బెంగాల్ బ్యాక్ డ్రాప్‌లో మాఫియా కథతో ఈ మూవీ సాగుతుందని, ఇందులో ఎన్టీఆర్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారని సమాచారం. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా, పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, బీజు మీనన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దీంతోపాటు తారక్ `దేవర 2`, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు.
`వార్ 2`తో రాబోతున్న ఎన్టీఆర్
ఇక ఇప్పుడు `వార్ 2`తో ఆయన ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. తారక్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ నటించిన చిత్రమిది. ఇందులో హృతిక్ రోషన్ మరో హీరోగా నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీని యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కాబోతుంది. ఇందులో తారక్ ది పాజిటివ్ రోల్ అని, హృతిక్ ది నెగటివ్ షేడ్ ఉన్న రోల్ అని, వీరిద్దరి మధ్య ఫైటే సినిమా అని టీజర్, ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.