కొరటాలకి ఎన్టీఆర్ చివరి వార్నింగ్.. మాట వినకపోతే ఇక తారక్ తీసుకునే నిర్ణయం అదే?
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తున్న చిత్రం `ఎన్టీఆర్ 30`. ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియడం లేదు. ఈ సినిమాకి సంబంధించిన ఎన్టీఆర్ తీసుకునే నిర్ణయం ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్ చేస్తుంది.

తన అభిమానులకే కాదు, ఇది ఎన్టీఆర్ సహనానికి పరీక్షా కాలం. హీరోలంతా బ్యాక్ టూ బ్యాక్ రెండు మూడు సినిమాలు సెట్స్ మీద ఉంచారు. చివరికి తన తోటి హీరో రామ్ చరణ్ సైతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నారు. కానీ తారక్ గత ఏడు నెలలుగా ఖాళీగానే ఉన్నారు. ఆయన కొత్త సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనేది పెద్ద సస్పెన్స్ మ్యాటర్‌గా నిలిచింది.
ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివతో సినిమా చేయాల్సి ఉంది. ఎన్టీఆర్ 30గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఓ బలమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అయితే కొరటాల చివరి చిత్రం `ఆచార్య` పరాజయంతో ఎన్టీఆర్‌తో చేయాల్సిన సినిమాపై ప్రభావం పడింది. ఏమాత్రం తేడా లేకుండా అన్ని రకాలుగా స్క్రిప్ట్ పరంగా మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు జరిగినట్టు సమాచారం. ఫైనల్ స్క్రిప్ట్ ఇంకా పూర్తవలేదట. దాదాపు ఆరు నెలలుగా కొరటాల ఈ స్క్రిప్ట్ పైనే కూర్చున్నారు. అయినా ఇంకా అనుకున్న విధంగా రాలేదని టాక్.
నిజానికి ఈ చిత్రాన్ని చాలా రోజుల క్రితమే ప్రారంభించాలని భావించారు. ఆగస్ట్ లోనే రెగ్యూలర్ షూటింగ్ చేయాలనుకున్నారు. కానీ అది కుదరలేదు. సెప్టెంబర్ అన్నారు. అది కూడా జరగలేదు. దసరాకి ముహుర్తం ఫిక్స్ అన్నారు. అది కూడా అయిపోయింది. ఇప్పుడు దీపావళి వస్తుంది. ఎలాంటి ఉలుకు పలుకు లేదు. దీంతో తారక్ అభిమానులు ఈ ప్రాజెక్ట్ పై తీవ్ర అసహనంతో ఉన్నారు. కొరటాలపై వారంతా గుర్రుగా ఉన్నారని టాక్.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఇక మౌనాన్ని వీడారని సమాచారం. ఆయన కొరటాలకు తేల్చి చెప్పారట. ఫైనల్ వార్నింగ్ ఇచ్చారని సమాచారం. అక్టోబర్ లోపు స్క్రిప్ట్ పూర్తి చేసి నవంబర్‌లో సెట్స్ పైకి సినిమాని తీసుకెళ్లాలని అల్టిమేటం పెట్టారట. ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమాని నవంబర్‌లో స్టార్ట్ చేయాలని చివరి వార్నింగ్‌గా చెప్పారని ఫిల్మ్ నగర్ టాక్.
అంతేకాదు నవంబర్‌లో కొరటాల సినిమా ప్రారంభం కాకపోతే మరో ఆల్టర్ నేట్ కి వెళ్లాలనుకుంటున్నారట తారక్. ఎన్టీఆర్ 30 ప్రారంభం కాకపోతే ఏం చేయాలనేదానిపై ఓ నిర్ణయానికి వచ్చారట. అదే జరిగితే కొరటాల సినిమాని పక్కన పెట్టి ఇక బుచ్చిబాబు సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. మొదట బుచ్చిబాబు సినిమానే పూర్తి చేయాలనే ప్లాన్ బీతో ముందుకు సాగుతున్నట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఆర్టిస్టులు, టెక్నిషియన్లని ఫైనల్ చేసే పనిలోనూ కొరటాల ఉన్నారట. హీరోయిన్ ఎవరనేది పెద్ద సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో రష్మిక మందన్నా పేరు బలంగా వినిపిస్తుంది. ఆమె కూడా ఇటీవల ఎగ్జైటింగ్‌గా ఉన్నానని తెలిపిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌తో రష్మిక రొమాన్స్ చేస్తే వెండితెరపై రచ్చ రంభోలే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.