- Home
- Entertainment
- చిరంజీవికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాకింగ్ కౌంటర్లు.. కొరటాలకి సపోర్ట్ చేస్తూ కామెంట్లు.. ఇండస్ట్రీలో కొత్త రచ్చ
చిరంజీవికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాకింగ్ కౌంటర్లు.. కొరటాలకి సపోర్ట్ చేస్తూ కామెంట్లు.. ఇండస్ట్రీలో కొత్త రచ్చ
దర్శకుడు కొరటాల శివకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండగా నిలుస్తున్నారు. ఆయనకు సపోర్ట్ చేస్తూనే చిరంజీవికి కౌంటర్లు విసురుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు కొత్త రచ్చ షురూ అయ్యింది.

చిరంజీవి హీరోగా `ఆచార్య`సినిమాని తెరకెక్కించారు దర్శకుడు కొరటాల శివ. సామాజిక స్పృహ కలిగిన దర్శకుడాయన. కంటెంట్ ఉన్న దర్శకుడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్. చిరుతో సినిమా చేయాలనేది ఆయన డ్రీమ్. అది `ఆచార్య`తో నెరవేరింది. కానీ రిజల్ట్ గట్టి దెబ్బకొట్టింది. అది ఏం రేంజ్‌లో అంటే సంపాదించుకున్న ఆస్తులు అమ్ముకునేంతగా. `ఆచార్య` ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. దీంతో షాక్‌లోకి వెళ్లిపోయారు కొరటాల. చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిందీ సినిమా.
అటు చిరంజీవి, కీలక పాత్రలో నటించిన రామ్‌చరణ్ సైతం ఎంతో నిరాశ చెందారు. ఇందులో హీరోయిన్‌గా నటించిన కాజల్ పాత్రని కూడా తీసేశారు. మొత్తంగా ఇది భారీ స్థాయిలో మిస్ ఫైర్ అయ్యింది. అయితే ఈ సినిమా విషయంలో జరిగిన పొరపాట్లపై చిరంజీవి సందర్భం వచ్చిన ప్రతి సారి స్పందిస్తూనే ఉన్నారు. కొరటాలకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానే సెటైర్లు వేస్తూనే ఉన్నారు. దెప్పిపొడుస్తూనే ఉన్నారు. ఆ సినిమా తర్వాత మూడునాలుగు సార్లు ఆయన సినిమాల ఈవెంట్లలో పాల్గొన్నారు. ఆయా సందర్భాల్లోనూ దర్శకుడనేవాళ్లు ఎలా ఉండాలనే చెబుతూనే ఉన్నారు.
ప్రతిసారి కొరటాలని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. కథ విషయంలో ఎంతగా రాజీపడకుండా ఉండాలనే, ఎంతగా శ్రమించాలనే, స్క్రిప్ట్ ని తుది వరకు మెరుగులు దిద్దాలనేది, సినిమా విషయంలో దర్శకుడు సాటిస్పై కాకూడదని, అప్పుడే బెస్ట్ ఔట్‌పుట్ వస్తుందన్నారు. అదే సమయంలో నిర్మాత సేఫ్ కూడా ముఖ్యమని, ఇష్టం వచ్చినట్టుగా ఎక్కువగా సినిమా తీసేసి అంతా వేస్ట్ చేయడం కాకుండా, ఎంత అవసరమో అంతే తీయాలని, టైమ్ కి పూర్తి చేయాలనేది చిరంజీవి చెప్పారు. నిన్న `వాల్తేర్ వీరయ్య` థ్యాంక్స్ మీట్‌లోనూ అదే చెప్పారు.
ఇప్పటికే చాలా సార్లు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు చిరు. ఏ ఒక్కరినో ఇద్దరినో ఉద్దేశించి కాదు అని, అందరికి ఇది వర్తిస్తుందన్నారు. ఇన్ని సార్లు కొరటాలని టార్గెట్ చేయడంపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొరటాలకి అండగా నిలుస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి పంపేదాక వదిలేలా లేరుగా. ఒక్క ఏడాది ఆగండి ఆయనేంటో చూపిస్తారు. ఆయన కొట్టే దెబ్బకి దిమ్మ తిరిగిపోవాల్సి ఉంటే మీమ్స్ తో రచ్చ చేస్తున్నారు. దెబ్బ తిన్న పులి బలాన్ని పెంచుకుని బౌన్స్ బ్యాక్ అవుతుందని ఇప్పుడు కొరటాల అదే చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు.
కొరటాల శివ ఇప్పుడు ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నారు. ఇది వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. భారీ పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. `ఆచార్య` విషయంలో జరిగిన తప్పు నుంచి నేర్చుకుని ఆ కసితో ఎన్టీఆర్ 30ని రూపొందించేందుకు సన్నద్దమవుతున్నారు కొరటాల. ఈ సినిమాతో కొరటాల తన సత్తా ఏంటో చూపిస్తాడని చెబుతున్నారు తారక్ ఫ్యాన్స్. చిరంజీవి ఇలా ప్రతి సారి ఆయన్ని బ్లేమ్ చేయడం సరికాదంటున్నారు. కొరటాలపై ఈ రేంజ్‌లో పగ సాధిస్తున్నాడేంటి? అంటున్నారు.
ఈ మాటలతో కొరటాలలో కసి మరింత పెరుగుతుందని ఎన్టీఆర్ సినిమాతో అందరికి సమాధానం చెబుతాడని అంటున్నారు. ఆయనకు అండగా నిలుస్తున్నారు. అయితే చిరంజీవి ఈ స్థాయిలో కామెంట్లు చేయడం సరికాదనేది కామన్‌గా వినిపించే మాట. ఆయన్ని అంతా పెద్ద దిక్కులా భావిస్తుంటారు. అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడటమేంటనే ప్రశ్న వినిపిస్తుంది. ఏదేమైనా చిరు కామెంట్లు ఇప్పుడు కొత్త రచ్చ లేపుతున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు, ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్ కూడా ఆయనకు సపోర్ట్ గా నిలుస్తుండటం విశేషం.