- Home
- Entertainment
- ఒకే ఫ్రేములో రెండు తరాలు.. అప్పుడు ఎన్టీఆర్,ఏఎన్నార్, కృష్ణ.. నేడు మహేష్, తారక్, చైతూ.. అరుదైన దృశ్యం..
ఒకే ఫ్రేములో రెండు తరాలు.. అప్పుడు ఎన్టీఆర్,ఏఎన్నార్, కృష్ణ.. నేడు మహేష్, తారక్, చైతూ.. అరుదైన దృశ్యం..
టాలీవుడ్‌లో ఓ అద్భుతం చోటు చేసుకుంది. ఒకే ఫ్రేమ్‌లోకి రెండు తరాలు వచ్చాయి. అరుదైన ఫోటో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. రెండు తరాల అభిమానుల తారలను చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ అరుదైన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తొలితరం హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, నేటితరం హీరోలు మహేష్‌బాబు, జూ ఎన్టీఆర్, నాగచైతన్య ఒకే ఫ్రేములోకి వచ్చారు. సేమ్ అప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు అలాంటి దృశ్యమే చోటు చేసుకుంది. అందుకు సూపర్ స్టార్ కృష్ణ మరణం సందర్భం గా చోటు చేసుకోవడం గమనార్హం.
తెలుగు చిత్ర పరిశ్రమకి రెండు కళ్లు అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ అంటుంటారు. కృష్ణని మూడో కన్నుగా వర్ణిస్తుంటారు. కృష్ణంరాజు, శోభన్‌బాబు వంటి దిగ్గజ నటులున్నప్పటికీ వీరి తర్వాతనే వారిని కొనియాడుతుంటారు. ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్నార్ కలిసి దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు కృష్ణ మరణం సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అరుదైన ఫోటోల కేటగిరిలో ఇది చక్కర్లు కొడుతుంది. ఈ సందర్భంలోనే నేటి తరం హీరోలు ఒకే ఫ్రేమ్‌లోకి రావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
Krishna
కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. నానక్ రామా గూడలోని తన నివాసంలో కృష్ణ భౌతికకాయాన్ని సెలబ్రిటీలు సందర్భనార్థం ఉంచారు. సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా విచ్చేసి కృష్ణ భౌతికకాయాన్ని సందర్శించి ఆయనకు నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు నేటి సూపర్ స్టార్ మహేష్‌ని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆయనలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో ఎన్టీఆర్, నాగచైతన్య అటు ఇటుగా ఒకేసారి రావడం విశేషం. దీంతో మహేష్ పక్కనే నాగచైతన్య, ఎన్టీఆర్ కూర్చొని ఆయనతో కాసేపు టైమ్ స్పెండ్ చేశారు. ఆయనకు భరోసాగా ఉంటూ ఓదార్పుని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురు కూర్చొన్న సందర్భాన్ని కెమెరాల్లో బంధించారు ఫోటోగ్రాఫర్లు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగానే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ కలిసి దిగిన ఫోటోకి ఇప్పుడు మహేష్, చైతూ, తారక్ కలిసి దిగిన ఫోటోని జోడిస్తూ ఓ అరుదైన దృశ్యాన్ని ఆవిష్కరించింది. రెండు తరాలను ఒకే ఫ్రేములోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఈ మూడు కుటుంబాల అభిమానులను ఆద్యంతం అలరిస్తుంది. ఇది చూసి వాళ్లంతా కళ్ల సంబురంగా ఫీలవుతున్నారు. పండగ చేసుకున్నారు. కృష్ణ మరణం దీనికి వేదిక అయినందుకు బాధ పడుతూ, ఇలాంటి ఒక అరుదైన ఫ్రేమ్ క్రియేట్ అయినందుకు ఆనందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.