- Home
- Entertainment
- జూ ఎన్టీఆర్‌ని హీరోగా నిలబెట్టాలనేది ఎన్టీ రామారావు కోరికా?.. రాజమౌళికి కాదు, రాఘవేంద్రరావుకి ఆ బాధ్యతలు..
జూ ఎన్టీఆర్‌ని హీరోగా నిలబెట్టాలనేది ఎన్టీ రామారావు కోరికా?.. రాజమౌళికి కాదు, రాఘవేంద్రరావుకి ఆ బాధ్యతలు..
జూ ఎన్టీఆర్ అంటే సీనియర్ ఎన్టీఆర్‌కి అంత ప్రేమనా. తారక్‌ని హీరోగా నిలబెట్టాలనేది తన కోరికేనా, ఆ బాధ్యతలు రాఘవేంద్రరావుకి అప్పగించాడా? ఆసక్తికర విషయాలు వెల్లడి.

యంగ్ టైగర్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయ్యాడు. నందమూరి ఫ్యామిలీలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ ఇమేజ్‌ని బ్యాలెన్స్ చేసే హీరోగా నిలుస్తున్నారు. బాలయ్య హీరోగా తిరుగులేని ఇమేజ్‌ని, సక్సెస్‌ని అందుకున్నా, ఆయన పరిధి తెలుగు రాష్ట్రాలకే పరిమితమయ్యింది. కానీ నందమూరి ఫ్యామిలీ నుంచి పాన్ ఇండియా వైపు వెళ్తున్నది ఎన్టీఆర్ మాత్రమే.
హరికృష్ణ తనయుడిగా, ఎన్టీరామారావుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు జూ ఎన్టీఆర్. బాలనటుడిగా కెరీర్‌ని ప్రారంభించాడు. తాత సీనియర్ ఎన్టీఆర్ నటించిన `బ్రహ్మార్షి విశ్వామిత్ర` చిత్రంలో భరత పాత్రలో బాలనటుడిగా మెప్పించారు. తాతతో కలిసి నటించి అదరగొట్టాడు. అప్పుడే ఎన్టీఆర్ ని ఆకర్షించాడు. ఆ తర్వాత బాలరామాయణంలో రాముడి పాత్రలో అదరగొట్టాడు ఎన్టీఆర్.
ఇక 1997లో `స్టూడెంట్ నెం 1` చిత్రంతో హీరోగా మారాడు ఎన్టీఆర్. ఆ తర్వాత ప్రారంభమైన `నిన్ను చూడాలని` అనే మూవీ మొదట రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో `స్టూడెంట్ నెం 1` స్టార్ట్ అయ్యింది. పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా సమయంలో జరిగిన విషయం అందరికి తెలిసిందే.
వేరే హీరోతో రాజమౌళి అనుకున్నారు, కానీ సడెన్‌గా హీరో మారారు. ట్రాక్‌లోకి ఎన్టీఆర్ వచ్చారు. తారక్‌ని అప్పుడు చూసిన రాజమౌళి.. వీడెవడండీ బాబు.. తాను ఏదో దర్శకుడిగా చేయాలని ఏవో కలలు కంటే ఇలాంటి వాడు వచ్చాడేంటి అని మనసులో అనుకున్నాడట రాజమౌళి. కానీ ఆయనతోనే సినిమా చేశాడు, తారక్ నటన చూసి ఫిదా అయిన రాజమౌళి ఇప్పటికీ ఎన్టీఆర్‌ని వదల్లేదు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లా రాణిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ని హీరోగా పరిచయం చేయాల్సింది రాజమౌళి కాదట. మొదట అనుకున్నది రాఘవేంద్రరావు అట. ఎన్టీరామారావుతో అనేక సినిమాలు చేశాడు రాఘవేంద్రరావు. ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చాడు. ఓ సందర్భంలో తన మనవడు తారక్‌ని హీరోగా నిలబెట్టాలని రాఘవేంద్రరావుకి చెప్పారట. ఆయన వద్ద మాట తీసుకున్నాడట రామారావు. అదే ప్లాన్ రాఘవేంద్రరావు ఉన్నారు.
అయితే దర్శకేంద్రుడి వద్ద రాజమౌళి ప్రారంభంలో అసిస్టెంట్‌గా చేశాడు. సీరియల్స్ సైతం ఆయన పర్యవేక్షణలోనే జక్కన్న డైరెక్ట్ చేశాడు. దీంతో రాజమౌళి పనితనం తెలిసిన రాఘవేంద్రరావు.. ఎన్టీఆర్ ని హీరోగా పరిచయం చేసే బాధ్యత రాజమౌళికి అప్పగించారట. అలా తాను ఎన్టీఆర్‌తో మొదటి మూవీ చేయాల్సి వచ్చిందని చెప్పాడు రాజమౌళి. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియోక్లిప్ ఇప్పుడు వైరల్‌గా మారడం విశేషం.
అలా జూ ఎన్టీఆర్ ని హీరోగా నిలబెట్టడం, నటుడిగా గొప్ప స్థాయికి తీసుకెళ్లాలనేది సీనియర్ ఎన్టీఆర్ కోరిక అని తేలిపోయింది. మనవడు తారక్ అంటే సీనియర్ ఎన్టీఆర్‌కి అంతటి ప్రేమ, అభిమానం ఉందట. అందుకే ప్రారంభంలో ఎన్టీఆర్ సినిమాలను రాఘవేంద్రరావు పర్యవేక్షించే వారని, ఎన్టీఆర్‌తో రాజమౌళి ఎక్కువ సినిమాలు చేయడం వెనుక రాఘవేంద్రరావు ఉన్నారని తెలుస్తుంది.
`స్టూడెంట్ నెం 1` చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాజమౌళి దేశం గర్వించే దర్శకుడిగా ఎదిగారు. తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసి, ఇండియన్ మూవీకి ప్రతిబింబంగా మార్చేశారు. ఇప్పుడు మహేష్‌బాబుతో సినిమా చేయబోతు్నారు. ఇక ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. తను కూడా గ్లోబల్ స్టార్ ప్రయత్నాల్లో ఉన్నారు.