మహేష్ తో మూవీ... నాకు ఖాళీ లేదన్న స్టార్ డైరెక్టర్! ప్రాజెక్ట్ లేనట్లేనా?
మహేష్ బాబుతో మూవీ ఎప్పుడంటే సదరు స్టార్ హీరో ప్రస్తుతం ఖాళీ లేదు అన్నాడు. ఈ మేరకు ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు?
Actor Chinna
టాలీవుడ్ టాప్ స్టార్స్ తో మహేష్ బాబు ఒకరు. ఆయనకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. టాక్ తో సంబంధం లేకుండా మహేష్ బాబు చిత్రాలు వందల కోట్ల వసూళ్లు రాబడతాయి. మహేష్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. మహేష్ బాబు గత చిత్రాలు సర్కారు వారి పాట, గుంటూరు కారం మిక్స్డ్ టాక్ తో కూడా రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి.
మహేష్ బాబు దర్శకుల ఫస్ట్ ఛాయిస్. ఆయన డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూలో నిలబడతారు. ఇక మహేష్ ఆచితూచి చిత్రాలు చేస్తాడు. హీరోగా 25 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న మహేష్ బాబు చేసింది 28 చిత్రాలు మాత్రమే. మహేష్ బాబు తన 29వ చిత్రం దర్శకుడు రాజమౌళితో చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై దర్శకుడు రాజమౌళి అధికారిక ప్రకటన చేశారు. ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
కాగా ఓ స్టార్ డైరెక్టర్ మహేష్ తో మూవీ ఎప్పుడంటే నాకు ఖాళీ లేదు అన్నాడు. ఆయన ఎవరో కాదు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి మూవీతో దర్శక నిర్మాతగా పరిశ్రమలో అడుగుపెట్టిన సందీప్ రెడ్డి వంగ... ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు. అర్జున్ రెడ్డి భారీ లాభాలు పంచింది. ఇదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ టైటిల్ తో రీమేక్ చేసి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
అర్జున్ రెడ్డి మూడో చిత్రం యానిమల్ ఇండస్ట్రీ హిట్. రన్బీర్ కపూర్ హీరోగా గత ఏడాది విడుదలైన యానిమల్ రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో సందీప్ రెడ్డి వంగకు అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ లో డిమాండ్ ఏర్పడింది. సందీప్ రెడ్డి వంగను మహేష్ బాబుతో మూవీ ఎప్పుడని ప్రశ్నించగా ఆసక్తికరంగా స్పందించాడు.
మహేష్ తో మూవీకి నాకు ప్రస్తుతం సమయం లేదు. రానున్న నాలుగేళ్ళ వరకు నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి, అని సందీప్ రెడ్డి అన్నారు. సందీప్ రెడ్డి చేతిలో యానిమల్ 2, స్పిరిట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటితో పాటు అల్లు అర్జున్ తో ఓ మూవీ ఉందని సమాచారం. ఈ ప్రాజెక్ట్స్ దృష్టిలో పెట్టుకుని సందీప్ రెడ్డి ఇప్పట్లో మహేష్ తో మూవీ చేసే అవకాశం లేదని అన్నారు.
Rajamouli and Mahesh Babu
మరోవైపు మహేష్ బాబు సైతం రాజమౌళి ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చేందుకు మూడేళ్లకు పైగా సమయం పడుతుంది. మహేష్-సందీప్ రెడ్డి వంగ కాంబోలో మూవీ సెట్ అయితే నాలుగేళ్ళ తర్వాత పట్టాలెక్కే సూచనలు కలవు. అయితే అప్పటికి సమీకరణాలు ఎలా ఉంటాయో చూడాలి..