`టైగర్ నాగేశ్వరరావు`కి ఎంత చేసినా బజ్ రావడం లేదే?.. రవితేజని అలా చూడలేకపోవడం వల్లేనా?
`టైగర్ నాగేశ్వరావు`లో ఎంటర్‌టైన్‌మెంట్ పాళ్లు కనిపించడం లేదు. టీజర్, ట్రైలర్‌లో సీరియస్ కంటెంటే కనిపించింది. అదే ఇప్పుడు కలవరానికి గురి చేస్తుంది.
మాస్ మహారాజా రవితేజ(Raviteja).. వర్సెటైల్ యాక్టర్. ఆయన కామెడీ, యాక్షన్ చేస్తాడు. లవ్ స్టోరీస్, ఫ్యామిలీ చిత్రాలు చేశారు. కొన్ని ప్రయోగాలు చేశారు. అయితే ప్రధానంగా ఆయన చిత్రాల్లో మాత్రం కామెడీతోపాటు మాస్, యాక్షన్ ఎలిమెంట్లు కంపల్సరీ. ప్రేమలో బోల్డ్ నెస్ ఉంటుంది. అవి ఉంటేనే రవితేజ ఫిల్మ్ అవుతుంది. అలా ఆయన తన అభిమానులకు ఫుల్ మీల్స్ పెడుతుంటారు. రవితేజ నటించిన చిత్రాల్లో హిట్ అయిన మూవీస్ అన్నీ ఇలాంటివే.
అయితే రవితేజ కొన్ని ప్రయోగాలు చేశారు. `షాక్`, `వీడే`, `భగీరథ` వంటి సీరియస్ ఫిల్మ్స్ చేశారు. ఇటీవల వచ్చిన `ఖిలాడీ`, `రామారావు`, `రావణాసుర` చిత్రాలు కూడా అంతో ఇంతో ఈ కోవకు చెందినవే. వీటిలో వినోదం తగ్గి సీరియస్, యాక్షన్ పాళ్లు ఎక్కువయ్యాయి. దీంతో ఆడియెన్స్ ఆదరించలేదు. ఆయా సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. ఇదే ఇప్పుడు `టైగర్ నాగేశ్వరరావు`(Tiger Nageswara Rao)ని బయటపెడుతుంది. రవితేజ ఫ్యాన్స్ ని ఆందోళనకి గురి చేస్తుంది. ఈ సినిమా పూర్తిగా సీరియస్‌గా సాగుతుంది, యాక్షన్ ప్రధానంగా సాగబోతుంది.
`టైగర్ నాగేశ్వరరావు` .. సూవర్ట్ పురం గజదొంగ కథ. ఓ రకంగా ఇదొక పీరియడ్ బయోపిక్. మొదట గజ దొంగ అయిన టైగర్ నాగేశ్వరరావు.. కొన్ని సంఘటనల తర్వాత ఆయన రాబిన్ వుడ్ తరహా దొంగగా మారిపోతాడు. పెద్దలను కొట్టి పేదలకు పంచుతాడనేది చరిత్ర. అంతేకాదు ఏకంగా ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీని ఎదురించి, చివరికి ఆమె చేతిలో బలవుతాడు. సాడ్ ఎండింగ్. అయితే దొంగల కథలను ఆడియెన్స్ చూస్తారా? అనేది పెద్ద ప్రశ్న. చిరంజీవి చేసిన `సైరా` నరసింహారెడ్డి కథ కూడా అదే. కానీ పూర్తిగా హీరోయిజం చూపించారు. ఆడియెన్స్ చూడలేకపోయారు. ఇప్పుడు `టైగర్ నాగేశ్వరరావు`ని భయపెడుతున్న అంశం కూడా అదే అని ట్రేడ్ వర్గాల టాక్.
దీనికితోడు `టైగర్ నాగేశ్వరావు`లో ఎంటర్‌టైన్‌మెంట్ పాళ్లు కనిపించడం లేదు. టీజర్, ట్రైలర్‌లో సీరియస్ కంటెంటే కనిపించింది. అదే ఇప్పుడు కలవరానికి గురి చేస్తుంది. సినిమాని ఎంత ప్రమోట్ చేసినా బజ్ రావడం లేదనే టాక్ వినిపిస్తుంది. రవితేజ అంత సీరియస్‌గా చూడలేకపోవడం వల్లేనేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు క్రిటిక్స్. ఇది కూడా సినిమాపై బజ్ రాకపోవడానికి ఓ కారణంగా చెబుతున్నారు. అయితే రవితేజ ఎప్పుడూ లేని విధంగా ఈ చిత్ర ప్రమోషన్స్ ని తన భుజాలపై వేసుకున్నారు. బాలీవుడ్‌లో బాగా ప్రమోట్ చేసుకున్నారు. టీవీ షోస్‌లో పాల్గొని ఏకంగా సీసాలు పలగొట్టుకున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో ప్రమోషన్ కోసం బాగా కష్టపడ్డారు. కానీ కేవలం నార్త్ సైడే ఆయన ఫోకస్ చేయడం ఆశ్చర్యపరిచింది. సౌత్‌ని పట్టించుకోలేదు. ఇది కూడా సౌత్ నుంచి ఎఫెక్ట్ గా మారే అవకాశం ఉంది.
మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల సందడి ప్రారంభమైంది. అంతా ప్రచారంలో బిజీ అయ్యారు. సినిమాని చూసే ఆసక్తి జనాల్లో కనిపించడం లేదు. ఫ్యాన్స్, సినీ ప్రియులు చాలా మంది ఏదో పార్టీలో బిజీగా ఉన్నారు. ప్రచార కార్యక్రమాలకు సన్నద్దమవుతున్నారు. అందుకే సినిమాలపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదని సమాచారం. ఎన్నికల్ ఎఫెక్ట్ కూడా `టైగర్ నాగేశ్వరరావు` చిత్రంపై ఉందని తెలుస్తుంది.
విచిత్రం ఏంటంటే ఈ దసరా సందర్భాన్ని పురస్కరించుకుని `టైగర్ నాగేశ్వరావు`(అక్టోబర్ 20) తోపాటు బాలయ్య `భగవంత్ కేసరి`(Bhagavanth Kesari), విజయ్ `లియో`(అక్టోబర్ 19) చిత్రాలు విడుదలవుతున్నాయి. ఇందులో ఏ సినిమాకి బజ్ కనిపించడం లేదు. అంతా స్థబ్దుగా ఉంది. టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసి 24 గంటలు దాటినా అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం నీరసంగా ఉన్నాయి. చాలా థియేటర్లో ఒక్క షో కూడా పూర్తిగా ఫిల్ కాలేదు. ఓవర్సీస్‌లోనూ `టైగర్ నాగేశ్వరరావు`కి అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా లేదు. అక్కడ సోమవారం నాటికి కనీసం వెయ్యి టికెట్లు కూడా బుక్ కాకపోవడం గమనార్హం. అయితే అంతో ఇంతో `లియో`(Leo)కి హైప్ కనిపిస్తుంది. బాలయ్య, రవితేజ లాంటి పెద్ద హీరోల చిత్రాలకు కాకుండా పొరుగు హీరో విజయ్ చిత్రానికి బజ్ ఏర్పడటం ఆశ్చర్య పరుస్తుంది. మరి ఈ చిత్రాల రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆద్యంతం హాట్ టాపిక్‌గా మారింది. ఆసక్తికరంగా మారింది.