- Home
- Entertainment
- జీవితానికి అడ్డుపడితే లేనిపోని సమస్యలు.. మెగా డాటర్ నిహారిక పోస్ట్ వైరల్.. దాని గురించేనా?
జీవితానికి అడ్డుపడితే లేనిపోని సమస్యలు.. మెగా డాటర్ నిహారిక పోస్ట్ వైరల్.. దాని గురించేనా?
మెగా డాటర్.. ఇటీవల తన భర్త చైతన్య జొన్నలగడ్డకి డైవర్స్ ఇచ్చింది. ఇప్పుడు లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది. తనకు నచ్చినట్టుగా జీవిస్తుంది. తన అనుభవంలోనుంచి జీవిత పాఠాలు చెబుతుంది.

నిహారిక(Niharika) వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తుంది. చాలా రోజులుగా ఆమె విహార యాత్రలోనే కనిపిస్తుంది. ఎప్పుడూ చూసిన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. విడాకులు తీసుకున్న నేపథ్యంలో స్వేచ్ఛగా ఫీలవుతున్నట్టుంది. అందుకే ఇప్పుడు స్వేచ్ఛా గాలులు పీల్చుతుంది మెగా డాటర్.
ప్రస్తుతం నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెకేషన్ ఫోటోలు పంచుకుంది. అందులో కొన్ని ఫన్నీ వీడియో క్లిప్స్ లను షేర్ చేసింది. చిలిపి పోజులు, కొంటెపనులు చేస్తూ దిగిన పిక్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. అవి వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఆకట్టకుంటున్నాయి.
చివరల్లో ఓ పోస్ట్ పెట్టింది Niharika. జీవితానికి సంబంధించిన పోస్ట్ అది. తన అనుభవాలనుంచి రాసినట్టుగా ఉంది. ఇదిప్పుడు ఆలోచింప చేయడంతోపాటు వైరల్ అవుతుంది. ఆమె మనసులో మాటని ఇలా చెప్పిందనిపించేలా ఈ పోస్ట్ ఉండటం విశేషం. జీవితానికి సంబంధించిన ప్రవాహాన్ని ఫాలో అవ్వాలని, దాన్ని ఆపితే అది మనకు అవసరమైన సమస్యలు తీసుకొస్తుందని చెబుతుంది నిహారికా.
మెగా డాటర్ పోస్ట్ చూస్తే, జీవితం అనేది నిరంతరం మారుతున్న చక్రాల శ్రేణి. మేమ్ మార్పుని ప్రతిఘటించినప్పుడు, సహజంగా సాగే జీవన ప్రవాహాన్ని అడ్డుకుంటే అది అవసరమైన ఒత్తిడిని సృష్టిస్తుంది. ఆ జీవిత ప్రవాహంతో మనం వెళ్తుండాలి. అది వెళ్లే దారి మీకు సర్‌ప్రైజ్ చేస్తుంది` అని పేర్కొంది నిహారిక. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. హాట్ టాపిక్ అవుతుంది.
అయితే ఇది తన లైఫ్‌కి సంబంధించిన పోస్టే అని అర్థమవుతుంది. నెటిజన్లు అదే భావిస్తున్నారు. ఇటీవల చైతన్య జొన్నలగడ్డతో నిహారిక విడాకులు తీసుకుంది. దీంతో దానికి యాప్ట్ అయ్యేలా ఈ పోస్ట్ ఉండటం విశేషం. మూడేళ్ల క్రితం నిహారిక- చైతన్యజొన్నలగడ్డ పెళ్లి చేసుకున్నారు. జైపూర్‌లో చాలా గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది. రెండేళ్ల గ్యాప్‌లోనే ఈ ఇద్దరు విడిపోయారు. విడిపోవడానికి కారణాలపై మాత్రం వాళ్లు స్పందించలేదు.
ఇక డైవర్స్ తర్వాత తనకు నచ్చినట్టుగా ఉంటుంది నిహారిక. అసలు జీవితాన్ని అనుభవిస్తున్నట్టుగా ఆమె పోస్ట్ లుంటున్నాయి. వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్న తీరు కూడా అలానే ఉంది. మరోవైపు ఇప్పుడు ఆమె యాక్టింగ్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అలాగే ప్రొడక్షన్ కూడా పెంచాలని భావిస్తుందట.
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక. 2015లో యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. `ఢీ జూనియర్` షోకి ఆమె హోస్ట్ గా చేసింది. ఇందులో నాగబాబు జడ్జ్ గా ఉన్నారు. అలా ఆయన సమక్షంలో యాంకర్‌గా పేరుతెచ్చుకుంది. ఆ తర్వాత నటిగా టర్న్ తీసుకుంది.
2016లో `ఒక మనసు` చిత్రంలో హీరోయిన్గా నటించింది. నాగశౌర్యకి జోడీగా ఆమె నటించడం విశేషం. ఈ సినిమా బోల్తా కొట్టింది. కానీ వీరిద్దరి మధ్య ఏవో రూమర్స్ వచ్చాయి. కానీ రూమర్లుగానే మిగిలాయి. తర్వాత తమిళంలో ఓ సినిమాలో మెరిసింది.
మరోవూపు తెలుగులో `హ్యాపీ వెడ్డింగ్` అనే మరో సినిమా చేసింది. ఇది మెప్పించలేదు. అలాగే `సూర్యకాంతం` అంటూ వచ్చింది. ఈ సినిమా కూడా బోల్తా కొట్టింది. ఇక పెదనాన్న చిరంజీవితో `సైరా నరసింహారెడ్డి`లో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పొంది. ప్రొడక్షన్ పై ఫోకస్ పెట్టింది.
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై వెబ్ సిరీస్‌లు `ముద్దపప్పు ఆవకాయ్`, `నాన్న కూచి`, `మ్యాడ్ హౌజ్`, `ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ`, `హెలో వరల్డ్`, `డెడ్ పిక్సెల్` సిరీస్‌లను నిర్మించింది నిహారిక.ఇప్పుడు మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టబోతుంది.