- Home
- Entertainment
- `మెగా ఫ్యామిలీ రోడ్డెక్కింది`.. నిహారిక లిప్‌లాక్ ఫోటోపై రెచ్చిపోయిన ట్రోలర్స్.. అడ్డంగా బుక్కైన మెగా డాటర్
`మెగా ఫ్యామిలీ రోడ్డెక్కింది`.. నిహారిక లిప్‌లాక్ ఫోటోపై రెచ్చిపోయిన ట్రోలర్స్.. అడ్డంగా బుక్కైన మెగా డాటర్
మెగా డాటర్ నిహారిక మరోసారి ట్రోలర్స్ కి దొరికిపోయింది. ఇప్పటికే రెండు మూడు సార్లు ఆమె వివాదాల్లో ఇరుక్కుంది. ఇప్పుడు మరోసారి ఆమె హాట్ టాపిక్ అవుతుంది. ఆమె తన భర్తకిచ్చిన లిప్‌లాక్ ఫోటో వైరల్ అవుతుంది.

నిహారిక(NIharika) ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి జోర్దాన్‌కి వెకేషన్ ట్రిప్‌కి వెళ్లింది. అక్కడ తన భర్త చైతన్య జొన్నలగడ్డ (Chaitanya Jonnalagadda)తో కలిసి బాగా ఎంజాయ్ చేసింది. వాటి తాలుకూ ఫోటోలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇవే ఇప్పుడు నిహారికకి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈ ఫోటోలను షేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.
ట్రోలర్స్ రెచ్చిపోవడానికి కారణం ఆమె పంచుకున్న ఫోటోలో నిహారిక తన భర్త చైతన్యకి లిప్‌లాక్ (Niharika Liplock)ఇవ్వడం. కాస్త బ్లర్ చేసి దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. మరోకటి చాలా క్లోజ్డ్ గా ఉన్న ఫోటోని షేర్ చేసింది. `ఎప్పటికీ విడిపోని బంధం` అంటూ క్యాప్షన్ పెట్టింది నిహారిక. అయితే భర్తకి లిప్‌కిస్ ఇస్తున్న ఫోటోని పంచుకోవాల్సిన అవసరం ఏంటనేది ట్రోలర్స్ ప్రశ్న.
దీని బేస్ చేసుకుని నిహారికని ఆడుకుంటున్నారు నెటిజన్లు. ఒక రేంజ్‌లో ప్రశ్నిస్తూ ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. `మెగాస్టార్ పరువు తీయడానికి కాకపోతే ఇలాంటి ఫోటోలు ఎందుకు పంచుకోవడం`, `మెగా ఫ్యామిలీ రోడ్డెక్కింది`, `ఇప్పుడిది అవసరమా సిస్టర్` అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. `మెగా డాటర్ రెచ్చిపోయిన వేళ`, `నిహారికలోని బోల్డ్ యాంగిల్` అంటూ తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు. ఈ లిప్ లాక్ కిస్ ఫోటోలకు మీమ్స్ జోడించి వైరల్ చేస్తున్నారు.
దీంతో ప్రస్తుతం ఈ నిహారిక ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ దుమారం రేపుతున్నాయి. ఇదిలా ఉంటే నిహారికని సపోర్ట్ చేసేవాళ్లూ లేకపోలేదు. అన్ని ప్రశ్నలకు ఒక్కటే సమాధానం అని, తమ భార్య భర్తల బంధం ఎంత బలంగా ఉందో చెప్పేందుకు నిహారిక ఇలా చేసిందని, భార్యభర్తలు ఫోటోలను తప్పు పట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. మొత్తం ఓ వైపు పాజిటివ్‌గా, మరోవైపు నెగటివ్‌గా మరోసారి వార్తల్లో నిలుస్తుంది నిహారిక.
మెగా డాటర్ నిహారిక ఇప్పటికే పలు వివాదాల్లో ఇరుక్కుంది. ఆమె ఆ మధ్య హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో కనిపించి వార్తల్లో నిలిచింది. ఆ పబ్‌లో కొందరు డ్రగ్స్ వాడుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో నిహారిక, రాహుల్ సిప్లిగంజ్ వంటి సినీ ప్రముఖులను అరెస్ట్ చేసి, ఆ తర్వాత వదిలేశారు. అయితే ఆ పబ్‌లో డ్రగ్స్ వాడకం జరుగుతున్ననేపథ్యంలో నిహారికపై కూడా ఆరోపణలు వచ్చాయి. దీన్ని నాగబాబు ఖండించారు. నిహారిక క్లీయర్‌గా ఉందన్నారు. మరోవైపు ఆమెకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు కూడా వదిలేశారు.
అయితే ఈ విషయంలో మెగా ఫ్యామిలీ ఇమేజ్ బాగానే డ్యామేజ్ అయ్యింది. చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి వాటిలో ఇన్‌వాల్వ్ కావడమేంటనే విమర్శలు వచ్చాయి. దీంతోపాటు అంతకు ముందు నిహారిక జిమ్ వీడియోని షేర్ చేయగా, అది ట్రోల్స్ కి గురయ్యింది. నిహారికపై విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్ నుంచి వెళ్లిపోయారు. కొంత గ్యాప్‌తో మళ్లీ తాను పాఠాలు నేర్చుకున్నానంటూ తిరిగి ఇన్‌స్టాగ్రామ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇక పద్ధతిగా ఉంటుందని భావించారు. కానీ ఇప్పుడు మరోసారి ఆమె పంచుకున్న ఫోటోలు దుమారం రేపుతుండటం గమనార్హం. దీనిపై నిహారిక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
నిహారిక, చైతన్య జొన్నలగడ్డ వివాహం 2020 డిసెంబర్‌లో జరిగింది. చైతన్య టెక్ మహేంద్ర కంపెనీలో జాబ్ చేస్తున్నారు. మరోవైపు హీరోయిన్‌గా సక్సెస్ కాలేని నిహారిక, ప్రొడక్షన్ స్టార్ట్ చేసి, వెబ్ సిరీస్‌లు, ఓటీటీ మూవీస్‌ని నిర్మిస్తుంది.