చీర కొంగు మెలితిప్పి నడుముకి చుట్టుకున్న నిహారిక.. స్లీవ్ లెస్ బౌజ్, విరబోసిన కురులతో క్రేజీగా ఫోజులు
నిహారిక ప్రస్తుతం సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంది. వరుసగా తన గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ నెటిజన్లని అలరిస్తోంది.
మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక నటిగా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. పెళ్ళికి ముందు కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. అయితే ఆ చిత్రాలు వర్కౌట్ కాలేదు. దీనితో నిహారిక ప్రస్తుతం వెబ్ సిరీస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అలాగే సినిమా ఆఫర్స్ కోసం కూడా ట్రై చేస్తోంది.
ఇదిలా ఉండగా నిహారిక తన పర్సనల్ లైఫ్ తో ఇటీవల వార్తల్లో నిలిచింది. ఆమె వివాహ బంధంలో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. చైతన్య జొన్నలగడ్డ , నిహారిక ఇటీవల విడాకులు తీసుకుని విడిపోయారు.
అంతకు ముందు వీరిద్దరి పర్సనల్ లైఫ్ లో విభేదాలు మొదలైనట్లు రూమర్స్ వచ్చాయి ఇప్పుడు ఆ రూమర్స్ నిజమయ్యాయి. నిహారిక విడాకుల గురించి మెగా ఫ్యామిలీ ఎవరూ బయట స్పందించలేదు. తనకి ప్రైవసీ కావాలని నిహారిక విడాకులు ప్రకటిస్తూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే నిహారిక ప్రస్తుతం సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంది. వరుసగా తన గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ నెటిజన్లని అలరిస్తోంది. వరుసగా నిహారిక చీరకట్టులో తన సొగసు చూపిస్తూ మురిపిస్తోంది.
విరబోసిన కురులతో నిహారిక చీరకట్టులో ఫోజులు ఇచ్చింది. మట్టి గాజులు వేసుకుని మురిసిపోతోంది. నడుముకి చీర కొంగు చుట్టుకుని గ్లామర్ లో కూడా వెరైటీ ప్రదర్శిస్తోంది మెగా డాటర్.
నిహారిక అవకాశం దొరికితే సినిమాల్లో సైతం రాణించాలని చూస్తోంది. అయితే క్రేజీ ఆఫర్స్ మాత్రం ఈ మెగా డాటర్ కి దక్కడం లేదు. నిహారిక ప్రస్తుతం డిజిటల్ కంటెంట్ పైనే ఫోకస్ పెట్టింది.
నిహారిక తరచుగా తన ఫ్రెండ్స్ తో కలసి వెకేషన్స్ లో ఎంజాయ్ చేయడం చూస్తూనే ఉన్నాము. మొన్నటి వరకు వరుణ్ సందేశ్ సతీమణి వితిక షేరుతో వెకేషన్స్ లో కనిపించింది.
నిహారిక లేటెస్ట్ ఫొటోస్ కి నెటిజన్లు లవ్ ఎమోజీ లతో తమ స్పందన తెలియజేస్తున్నారు. నిహారికకి చీరకట్టు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అంటున్నారు.