Niharika: మనసుకు తగిలిన గాయాలకు కాలమే మందు... ఫైనల్లీ ఓపెన్ అయిన నిహారిక!
నిహారిక కొణిదెల విడాకుల వార్తలపై మౌనం వహించారు. అదే సమయంలో ఆమె కెరీర్ అండ్ ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టారు.

Niharika Konidela
నిహారిక సోషల్ మీడియా పోస్ట్స్ నిగూఢంగా ఉంటున్నాయి. పరోక్షంగా ఆమె ఏదో చెప్పాలనుకుంటున్నారు. అదే సమయంలో తన పాస్ట్ నుండి బయటపడాలని కోరుకుంటున్నారనిపిస్తుంది.
Niharika Konidela
కొన్నాళ్లుగా నిహారిక కొణిదెల విడాకుల వార్తలు దుమారం రేపుతున్నాయి. నిహారిక భర్త వెంకట చైతన్య పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన నేపథ్యంలో ఈ పుకార్లు తెరపైకి వచ్చాయి. ఈ వాదనలకు బలం చేకూర్చుతూ నిహారిక సైతం పెళ్లి ఫోటోలు ఇంస్టాగ్రామ్ నుండి తొలగించారు. నిహారిక-వెంకట చైతన్య విడాకులు ఖాయమేనని చిత్ర వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.
Niharika Konidela
నిహారిక విడాకుల పుకార్లపై నాగబాబు సైతం మాట్లాడలేదు. ఆయన మౌనం వహించారు. సాధారణంగా తన కుటుంబ సభ్యుల మీద వచ్చే ఆరోపణలను నాగబాబు సహించరు. వెంటనే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కూతురు లైఫ్ మేటర్ లో మాత్రం నాగబాబు సైలెంట్ గా ఉండిపోయారు.
Niharika Konidela
అలాగే నిహారిక ఈ మధ్య కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేశారు. నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా ఆమె పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ బ్యానర్ లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ మూవీస్ నిర్మిస్తున్నారు. తన నిర్మాణ సంస్థను ఆమె మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు. ఇందు కోసం ఓ ఆఫీస్ ఓపెన్ చేశారు.
Niharika Konidela
తన ప్రొడక్షన్ కంపెనీ కొత్త ఆఫీస్ కి సంబంధించిన ఫోటోలు నిహారిక ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేశారు. ఇక నిహారిక ప్రయత్నం సక్సెస్ కావాలని. తన బ్యానర్లో హిట్ చిత్రాలు తెరకెక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నిహారిక కొత్త ఆఫీస్ ఓపెనింగ్ కి కూడా వెంకట చైతన్య హాజరు కాలేదు. ఈ క్రమంలో కొన్ని అనుమానాలు తెరపైకి వచ్చాయి. భర్తతో విడిపోయిన నిహారిక కెరీర్ మీద ఫోకస్ పెట్టారని, నిర్మాతగా రాణించాలని నిర్ణయించుకున్నారుని అంటున్నారు.
Niharika Konidela
నిహారిక లేటెస్ట్ వీడియో వైరల్ అవుతుంది. ఆమె వ్యాయామం చేస్తున్న వీడియో పంచుకున్నారు. ఆ వీడియోకి ఆమె కొన్ని కామెంట్స్ జోడించారు. హెల్త్ టిప్స్ తో పాటు మోటివేషనల్ కోట్స్ యాడ్ చేశారు. అలాగే అన్ని గాయాలకు కాలమే సమాధానం చెబుతుందని ఆమె ఓ పాయింట్ ఆ వీడియోలో జోడించారు. ఇవన్నీ చూస్తుంటే విడాకుల బాధ నుండి బయటపడేందుకు నిహారిక ప్రయత్నం చేస్తున్నారనిపిస్తుంది.
Niharika Konidela
చిరంజీవి పెద్దమ్మాయి సుస్మిత కూడా నిర్మాతగా మారారు. మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ అయిన వన్ అండ్ ఓన్లీ అమ్మాయి నిహారిక. ఈమె నిర్ణయాన్ని మెగా ఫ్యాన్స్ హర్షించలేదు. చెప్పాలంటే ఫ్యామిలీ నుండి కూడా పెద్దగా ప్రోత్సాహం లభించలేదు. 2020 డిసెంబర్ 9న జొన్నలగడ్డ వెంకట చైతన్యను ఆమె వివాహం చేసుకున్నారు.