- Home
- Entertainment
- మెగా డాటర్ జోరు, గ్రాండ్ గా నిహారిక కొత్త చిత్రం ప్రారంభం.. డైరెక్టర్ ఎవరో తెలుసా..
మెగా డాటర్ జోరు, గ్రాండ్ గా నిహారిక కొత్త చిత్రం ప్రారంభం.. డైరెక్టర్ ఎవరో తెలుసా..
మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక నటిగా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. పెళ్ళికి ముందు కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. అయితే ఆ చిత్రాలు వర్కౌట్ కాలేదు.

మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక నటిగా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. పెళ్ళికి ముందు కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. అయితే ఆ చిత్రాలు వర్కౌట్ కాలేదు. దీనితో నిహారిక ప్రస్తుతం వెబ్ సిరీస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అలాగే సినిమా ఆఫర్స్ కోసం కూడా ట్రై చేస్తోంది.
ఇదిలా ఉండగా కొన్ని రోజులగా నిహారిక పర్సనల్ లైఫ్ గురించి అనేక రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నిహారిక తన భర్త చైతన్యతో విడిపోతోంది అనే కామెంట్స్ ఎక్కువవుతున్నాయి.ఈ రూమర్స్ కి బలం చేకూర్చుతూ నిహారిక, చైతన్య ఇద్దరూ సోషల్ మీడియాలో కలసి పిక్స్ డిలీట్ చేశారు.
అయితే ఈ రూమర్స్ గురించి నిహారిక కానీ, మెగా ఫ్యామిలీ కానీ ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉండగా నిహారిక మాత్రం నటిగా దూసుకుపోతోంది. ఆమె నటించిన డెడ్ పిక్సల్స్ అనే మూవీ త్వరలో హాట్ స్టార్ లో రిలీజ్ అవుతోంది.
ఇంతలోనే నిహారిక మరో చిత్రాన్ని ప్రారంభించింది. నేడు గ్రాండ్ గా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం ఐంది. నిహారిక పూజా కార్యక్రమంలో అందమైన చీరకట్టులో మెరిసింది. నేడు మదర్స్ డే కాబట్టి నిహారిక తల్లి ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు.
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. యువ మహిళా దర్శకురాలు మనసా శర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఈ పూజా కార్యక్రమంలో నిహారిక తన అందంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఉన్న శారీలో అందాల మెరుపులు మెరిపించింది. పూజా కార్యక్రమానికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.