నిహారిక గర్భవతా ?.. ఆ పోస్ట్ కి అర్థం ఏంటి అంటూ నెటిజన్ల కామెంట్స్
మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక నటిగా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. పెళ్ళికి ముందు కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. అయితే ఆ చిత్రాలు వర్కౌట్ కాలేదు.

మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక నటిగా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. పెళ్ళికి ముందు కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. అయితే ఆ చిత్రాలు వర్కౌట్ కాలేదు. దీనితో నిహారిక ప్రస్తుతం వెబ్ సిరీస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అలాగే సినిమా ఆఫర్స్ కోసం కూడా ట్రై చేస్తోంది.
నిహారిక వ్యక్తిగత వివాదాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య పబ్ వివాదంలో చిక్కుకోవడం.. ఆ తర్వాత పోలీసులు నిహారికకు క్లీన్ చిట్ ఇవ్వడం లాంటి న్యూస్ ఎలా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదిలా ఉండగా నిహారిక 2020లో చైతన్యని వివాహం చేసుకుంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం.
అయితే కొన్ని రోజులుగా నిహారిక, చైతన్య మధ్య రిలేషన్ బాగా లేదనే రూమర్స్ వినిపిస్తున్నాయి. నిహారిక సోషల్ మీడియాలో చాలా కాలంగా చైతన్య గురించి ప్రస్తావన లేదు. అలాగే చైతన్య కూడా తన సోషల్ మీడియా నుంచి నిహారిక ఫొటోస్ డిలీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో వీరిద్దరూ సంచలన నిర్ణయం ఏమైనా తీసుకోబోతున్నారా అనే టెన్షన్ మెగా అభిమానుల్లో ఉంది.
అయితే ఇటీవల నిహారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా నిహారిక సమ్మర్ స్పెషల్ గా వీడియో రూపంలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఈ ఫొటోస్ లో నిహారిక మామిడి కాయ తింటూ కనిపిస్తోంది. పింక్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో నిహారిక చిలిపిగా, క్యూట్ గా భలే లుక్ తో ఆకట్టుకుంటోంది.
ఈ ఫోటోలకు నిహారిక 'సమ్మర్ లో మామిడి కాయలు లేకుంటే పరిస్థితి ఏంటి' అంటూ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చింది. దీనితో నెటిజన్లు కూడా అంతే ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నెటిజన్లు నిహారికని అక్కా బావెక్కడ అని ప్రశ్నిస్తున్నారు.
మరికొందరు నిహారిక మామిడి కాయ తింటుంటే.. అక్కా ఏమైనా విశేషమా ? గర్భవతి అయ్యావా ? అని అడిగేస్తున్నారు. మరికొందరు అయితే నిహారిక, చైతన్య గురించి వస్తున్న వార్తలపై కామెంట్స్ చేస్తున్నారు. మీరిద్దరూ విడిపోవద్దు అని రిక్వస్ట్ చేస్తున్నారు.
సమ్మర్ సీజన్ కాబట్టి నిహారిక మామిడి కాయ తింటూ క్యాజువల్ గా ఈ పోస్ట్ పెట్టి ఉండొచ్చు అనేది కొందరి అభిమానుల అభిప్రాయం. దీనికే గర్భవతా అనే అనుమానం వద్దు అంటున్నారు. ఏది ఏమైనా నిహారిక క్యూట్ పిక్స్ మాత్రం చూడ ముచ్చటగా ఉన్నాయి.