- Home
- Entertainment
- Suma Kanakala: సలార్ సెగకి సుమ పడ్డ కష్టమంతా వృధానేనా, రోషన్ కనకాల ఇరుక్కుపోయాడుగా..
Suma Kanakala: సలార్ సెగకి సుమ పడ్డ కష్టమంతా వృధానేనా, రోషన్ కనకాల ఇరుక్కుపోయాడుగా..
బబుల్ గమ్ చిత్రానికి కాస్తో కూస్తో హైప్ వచ్చిందంటే అందులో సుమ కష్టం ఎంతైనా ఉంది. ట్రైలర్ లో చూపించిన బోల్డ్ కంటెంట్ కాస్త యువతని అట్రాక్ట్ చేస్తున్నప్పటికీ బబుల్ గమ్ చిత్రానికి బజ్ వచ్చేలా చేసింది మాత్రం సుమ అనే చెప్పాలి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
సుమ, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం బబుల్ గమ్. డిసెంబర్ 29న ఈ త్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. తన కొడుకు తొలి చిత్రం కోసం సుమ కూడా వరుసగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది.
బబుల్ గమ్ చిత్రానికి కాస్తో కూస్తో హైప్ వచ్చిందంటే అందులో సుమ కష్టం ఎంతైనా ఉంది. ట్రైలర్ లో చూపించిన బోల్డ్ కంటెంట్ కాస్త యువతని అట్రాక్ట్ చేస్తున్నప్పటికీ బబుల్ గమ్ చిత్రానికి బజ్ వచ్చేలా చేసింది మాత్రం సుమ అనే చెప్పాలి. తనకున్న పరిచయాలతో రాఘవేంద్ర రావు, రానా దగ్గుబాటి, అనిల్ రావిపూడి లాంటి అతిథుల సమక్షంలో ట్రైలర్ రిలీజ్ చేయించింది.
Suma Kanakala
స్వయంగా తానే కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొంది. కొడుకు కోసం బిగ్ బాస్ వరకు వెళ్లి ప్రమోషన్స్ చేసింది. అంత చేస్తేనే సుమ కొడుకు బబుల్ గమ్ అనే చిత్రంతో ఎంట్రీ ఇస్తున్నాడు అనే అంశం జనాల్లోకి వెళ్ళింది. మొత్తంగా ట్రైలర్ చూస్తే రోషన్ కూడా బాగా కష్టపడ్డాడు అనిపించింది.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కి తగ్గట్లుగా తెలంగాణ యాసలో డైలాగులు చెబుతున్నాడు. హీరోయిన్ తో రొమాన్స్ లో రెచ్చిపోయాడు. కానీ ఇప్పుడే బబుల్ గమ్ చిత్ర యూనిట్ కి అసలైన గుబులు మొదలైంది. శుక్రవారం రోజు విడుదలైన ప్రభాస్ సలార్ చిత్రానికి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం 1000 కోట్లు సాధించే మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు. చూస్తుంటే సలార్ సెగ మరో రెండు వారాల వరకు బాక్సాఫీస్ వద్ద తగ్గేలా లేదు.
డిసెంబర్ 29న బబుల్ గమ్ చిత్ర రిలీజ్ కి ప్లాన్ చేసుకున్నారు. అదే రోజున కళ్యాణ్ రామ్ డెవిల్ కూడా రిలీజ్ అవుతోంది. సలార్ హవా తగ్గిన థియేటర్స్ ని డెవిల్ ఆక్రమించేస్తాడు. దీనితో సలార్, డెవిల్ మధ్యలో బబుల్ గమ్ ఇరుక్కుపోయింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక వేళ కొన్ని థియేటర్స్ లభించినప్పటికీ బబుల్ గమ్ కి ప్రమాదం పొంచి ఉంది.
Devil
ఫస్ట్ వీక్ లో హైదరాబాద్ లాంటి చోట్ల మల్టీప్లెక్స్ లలో సలార్ టికెట్ ధర రూ 400 వరకు ఉంది. దీనితో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా సెకండ్ వీక్ కోసం ఎదురుచూస్తారు. ఇంకొంతమంది డెవిల్ ని ఎంచుకుంటారు. డెవిల్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తే సుమ కొడుకు తొలి చిత్రం బాగా ఇరుకున పడిపోయినట్లే. అదే జరిగితే కొడుకు టాలీవుడ్ ఎంట్రీ కోసం సుమ పడ్డ కష్టం మొత్తం వృధా అవుతుందని అంటున్నారు. ఇంకేదైనా మంచి టైం చూసుకుని బబుల్ గమ్ రిలీజ్ కి ప్లాన్ చేసి ఉంటే బావుండేదని అంటున్నారు.