MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Samantha: సమంత ఫ్యామిలీలోకి కొత్త మెంబర్... తనంటే సమంతకు ఎంత ప్రేమో!

Samantha: సమంత ఫ్యామిలీలోకి కొత్త మెంబర్... తనంటే సమంతకు ఎంత ప్రేమో!


సమంత ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ వచ్చాడు. తనని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసింది. సమంత పోస్ట్ వైరల్ అవుతుంది. 
 

Sambi Reddy | Updated : Jul 20 2023, 11:17 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image


సమంత ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. ఇటీవల ఆమె ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్స్ షూటింగ్స్ పూర్తి చేశారు. గత ఏడాది సమంత ఈ రెండు ప్రాజెక్ట్స్ ప్రకటించారు. ఖుషి షూటింగ్ సమంత అనార్యోగం బారిన పడటంతో ఆగిపోయింది. మయోసైటిస్ సోకినట్లు ప్రకటించిన సమంత నెలల పాటు ఇంటికి పరిమితమయ్యారు. కొంతమేర కోలుకున్న సమంత తిరిగి నటించడం స్టార్ట్ చేశారు. మిగిలి ఉన్న ఖుషి చిత్రీకరణ పూర్తి చేశారు. ద్రాక్షారామంలో విజయ్ దేవరకొండ-సమంత మీద పతాక సన్నివేశాలు చిత్రీకరించారు. 

27
Asianet Image

ఇక జులై 13న సిటాడెల్ షూట్ కూడా కంప్లీట్ చేసింది. ఆరు నెలలు కష్టంగా గడిచాయని సమంత తెలియజేశారు. ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్స్ లో నిరవధికంగా పాల్గొన్న సమంత కష్టం మీద ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసినట్లు పరోక్షంగా వెల్లడించారు. కాగా ఏడాది పాటు సమంత విరామం తీసుకోనున్నారట. సమంత ఎలాంటి ప్రాజెక్ట్స్ కి సైన్ చేయకూడదని నిర్ణయించుకున్నారట. 

37
samantha

samantha


ఏడాది కాలాన్ని ఆమె చికిత్స కోసం కేటాయించనున్నారని సమాచారం. అందుకు సమంత అమెరికా వెళుతున్నారట. అక్కడే కొన్ని నెలల పాటు ఉంటారట. సమంత వైద్యానికి కోటి రూపాయలకు పైగా ఖర్చు అవుతుందట. సమంత చికిత్స కోసం అమెరికా వెళుతున్న మాట నిజమేనా అనే సందేహాలు ఉన్నాయి. ఆమె మిత్రుడు హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ బత్కర్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. పరోక్షంగా నిజమే అని తెలియజేశాడు . 
 

47
Asianet Image


కొద్దిరోజుల్లో అమెరికా ప్రయాణం ఉండగా సమంత పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు.  తమిళనాడు రాష్ట్రంలో గల వెల్లూర్ గోల్డెన్ టెంపుల్ కి వెళ్లారు. అలాగే సద్గురు ఈషా ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ ధ్యానం చేశారు. మానసిక ప్రశాంత కోసం సమంత ఇలా చేస్తున్నారు. 

 

57
Asianet Image

క్రిస్టియన్ అయిన సమంత హిందూమతాన్ని కూడా ఆచరిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. సమంత జగద్గురు జగ్గీ వాసుదేవ్ శిష్యురాలు. ఆయన ఉపదేశాలను పాటిస్తారు. ఆ మధ్య జగ్గీ వాసుదేవ్ చూపించిన అబ్బాయిని సమంత రెండో వివాహం చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది2021 అక్టోబర్ లో సమంత భర్త నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. సమంత ప్రస్తుతం సింగిల్. ఇంట్లో తనకు తోడు కేవలం పెట్ డాగ్స్ మాత్రమే. 
 

67
Samantha

Samantha

సమంత వద్ద రెండు పెట్ డాగ్స్ ఉన్నాయి. చాలా కాలంగా హ్యాష్ అనే డాంగ్ ఉంది. నాగ చైతన్యతో ఉన్నప్పటి నుండి హ్యాష్ సమంతతో ఉంది. హ్యాష్ కి తోడుగా సాషా పేరుతో మరో డాగ్ ని తీసుకొచ్చింది. ఈ రెండింటితో గడపడం సమంతకు చాలా ఇష్టం. 

 

77
Samantha

Samantha

తాజాగా ఈ లిస్ట్ లో గలాటో చేరింది. గలాటో పిల్లి పిల్ల. రెండు పెట్ డాగ్స్ ఉన్నప్పటికీ సమంత మరో క్యాట్ ని తెచ్చుకుంది. కాబట్టి సమంత ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ వచ్చి చేరింది. సమంత గలాటోతో ఉన్న ఫోటో షేర్ చేసింది. దానికి గుడ్ మార్నింగ్ చెప్పింది. సమంత పోస్ట్ వైరల్ అవుతుంది. 
 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
నాగ చైతన్య
 
Recommended Stories
Top Stories