- Home
- Entertainment
- Anasuya Controversy Tweet : అనసూయ కాంట్రవర్సీ ట్వీట్.. నెటిజన్ల ఆగ్రహం.. నీపైనే ట్రోల్స్ ఎందుకో తెలుసా? అంటూ..
Anasuya Controversy Tweet : అనసూయ కాంట్రవర్సీ ట్వీట్.. నెటిజన్ల ఆగ్రహం.. నీపైనే ట్రోల్స్ ఎందుకో తెలుసా? అంటూ..
బుల్లితెర బ్యూటీ యాంకర్ అనసూయ (Anasuya) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. మహిళా దినోత్సవం సందర్భంగా అనసూయ చేసిన ట్వీట్ కాంట్రవర్సీగా మారింది. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు.

స్మాల్ స్క్రీన్ పై సందండి చేసే యాంకర్లలో అనసూయ భరద్వాజ్ పేరు తప్పకుండా వినిపిస్తుంది. టీవీ ఆడియెన్స్ ను తన యాంకరింగ్ స్కిల్స్, గ్లామర్ తో కట్టిపడేయడంలో మేటీ. అటు టెలివిజన్ ప్రజెంటర్ గానే కాకుండా ఇటు సినిమాల్లోనూ అనసూయ పలు పాత్రల్లో నటిస్తూ వస్తోంది.
బుల్లితెర హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ అనసూయ.. ప్రస్తుతం సినిమాల్లో బిజీ అవుతోంది. జబర్దస్త్ (Jabardast) కామెడీ పో యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ.. సినిమాలే కాకుండా సోషల్ మీడియాలోనూ తన గ్లామర్ షోతో నెటిజన్లకు ఊపిరాడకుండా చేస్తుంటుంది.
అప్పుడప్పుడు తన ఫ్యాన్స్ తో లైవ్ చాట్, వీడియో చాట్ సెషన్స్ కూడా నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలో నెటిజన్ల నుంచి బోల్డ్ కామెంట్లను ఎదుర్కొన్న ఘటనలూ అనసూయకు కొత్తేమి కాదు. తన గ్లామర్, డ్రెసింగ్ పై కామెంట్లు చేసిన నెటిజన్స్, ట్రోలర్స్ పై అనసూయ తనదైశిలో కౌంటర్ ఇచ్చింది. అయితే ఈసారి మాత్రం అనసూయే ముందుగా ట్రోలర్స్ పై విరుచుకుపడ్డారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘ట్రోలర్, మీమర్స్ మహిళ దినోత్సవం సందర్భంగా ఈ రోజు హఠాత్తుగా మహిళలను గౌరవించడం ప్రారంభించారు. అయినా ఇది 24 గంటల్లో ముగుస్తుందనుకోండి. కాబట్టి మహిళలందరికీ హ్యాపీ ఫూల్స్ డే' అంటూ ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్ పట్ల అనసూయపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా దినోత్సవం రోజునా కూడా ఇలాంటి ట్వీట్ ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరూ ‘ఏదో రంగస్థలం, పుష్ప’లో కనిపించే సరికి హీరోయిన్ అనుకుంటోంది... అందరికీ మహిళా దినోత్సవం, ఒక్క అనసూయకు తప్ప’ అంటూ రిప్లై ఇస్తున్నారు.
అలాగే యాంకర్ సుమ, ఉదయ బాణు, శ్యామలపై రాని ట్రోల్స్ ఒక్క మీపైనే ఎందుకు వస్తున్నాయో ఆలోచించండి అంటూ హితవు పలికారు. ఇందుకు అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలని పలువు నెటిజన్లు అంటున్నారు. అనసూయ ప్రస్తుతం ‘దర్జా’ మూవీలో సునిల్ తో కలిసి నటిస్తోంది.