- Home
- Entertainment
- ఒక రోజుకి నీ రేటు ఎంత ? అసభ్యంగా ప్రశ్నించిన నెటిజన్.. ఎమోషనల్ గా దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన అనసూయ
ఒక రోజుకి నీ రేటు ఎంత ? అసభ్యంగా ప్రశ్నించిన నెటిజన్.. ఎమోషనల్ గా దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన అనసూయ
స్టార్ యాంకర్, నటి అనసూయ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. లైగర్ మూవీ రిజల్ట్ ని ఉద్దేశిస్తూ పరోక్షంగా అనసూయ చేసిన ట్వీట్ తో ఈ రచ్చ మొత్తం మొదలైంది.

స్టార్ యాంకర్, నటి అనసూయ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. లైగర్ మూవీ రిజల్ట్ ని ఉద్దేశిస్తూ పరోక్షంగా అనసూయ చేసిన ట్వీట్ తో ఈ రచ్చ మొత్తం మొదలైంది. అర్జున్ రెడ్డి చిత్రంలో ఓ అసభ్యకరమైన డైలాగ్ ని ఎత్తిపొడుస్తూ.. అమ్మని తిట్టిన ఉసురు ఊరికే పోదు అంటూ ట్వీట్ చేసింది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. అనసూయని ట్రోల్ చేస్తూ విరుచుకుపడ్డారు.
కొంతమంది నెటిజన్లు అనసూయని ఆంటీ అని సంబోధిస్తూ కామెంట్స్ చేశారు. నన్ను ఆంటీ అంటారా.. ఏజ్ షేమింగ్ చేస్తారా.. కేసు పెడతా అంటూ అనసూయ కూడా విరుచుకుపడింది. దీనితో ఒక్కసారిగా ట్రోలర్స్ 'ఆంటీ' అంటూ అనసూయపై పెద్దఎత్తున ట్రెండింగ్ మొదలు పెట్టింది. దీనితో అనసూయ ఒంటరి పోరాటం షురూ చేసింది. తనని అసభ్యంగా తిడుతున్న వారందరికీ బదులిస్తూ ట్వీట్స్ వర్షం కురిపించింది.
జబర్దస్త్ షోలో డబుల్ మీనింగ్ డైలాగులకు వెకిలి నవ్వులు నవ్వేటప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా అంటూ నెటిజన్లు అనసూయని ప్రశ్నించారు. సినిమాలు, షోలు.. జీవితానికి తేడా తెలుసుకోలేని మూర్ఖులు అంటూ అనసూయ తన వర్షన్ వినిపించింది. అనసూయ, నెటిజన్ల మధ్య ఈ ఫైట్ ఆగడం లేదు.
ఓ నెటిజన్ అనసూయని అసభ్యంగా ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు. ఒక రోజుకి నీ రేటు ఎంత... అదే ఒక షోకి ఎంత తీసుకుంటావు అంటూ వెటకారంగా ప్రశ్నించాడు. అతడికి అనసూయ ఎమోషనల్ గా దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. 'చాలా లోకువ కందండి మీకు నేనంటే.. అదే మీ చెల్లినో, భార్యనో ఇలా అడుగుతారా.. మీ రేటు ఎంత.. అదే ఆఫీస్ లో అని వాళ్ళని అడిగితే ఏం చెబుతారు అని ఫైర్ అయింది.
దీనితో సదరు నెటిజన్ ఆ ట్వీట్ ని డిలీట్ చేశాడు. కొందరు నెటిజన్లు అసభ్యంగా అనసూయని ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం అనసూయని విమర్శిస్తూ ప్రశ్నిస్తున్నారు. ఒక సినిమా ఫ్లాప్ అయితే ఎంజాయ్ చేయడం ఏంటి అని అడుగుతున్నారు. తనని ఆంటీ అంటూ తిట్టడం ఏంటి.. నేను నా బంధువుల పిల్లలకి ఆంటీ అవుతాను. మీకు నేను అనసూయ భరద్వాజ్ ని. మీరు నన్ను అలాగే పిలవాలి అని అనసూయ బదులిచ్చింది.
అర్జున్ రెడ్డి మూవీ సమయంలో విజయ్ దేవరకొండ డైలాగ్ పై అనసూయ పెద్ద రభసే చేసింది. అలాంటి అసభ్యకరమైన డైలాగ్ ఎలా వాడతారు అంటూ ప్రశ్నించింది. లైగర్ మూవీ విడుదలై డిజాస్టర్ కావడంతో కర్మ ఈ రూపంలో తిరిగి వచ్చింది అంటూ అనసూయ ఎద్దేవా చేసింది.