- Home
- Entertainment
- 30 ఏళ్లు రాకముందే కోట్ల ఆస్తులు, 8 మంది కొత్త తారలలో ఎక్కువ సంపాదిస్తున్నది ఎవరంటే?
30 ఏళ్లు రాకముందే కోట్ల ఆస్తులు, 8 మంది కొత్త తారలలో ఎక్కువ సంపాదిస్తున్నది ఎవరంటే?
గత 10 ఏళ్లలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలకి ఎంతో మంది కొత్త తారలు అడుగుపెట్టారు. వాళ్లలో రష్మిక మందన్న, జాన్వీ కపూర్ , అనన్య పాండే, అహాన్ పాండే లాంటి యంగ్ స్టార్స్ ఉన్నారు. వీరిలో ఎక్కువగా సంపాదిస్తున్నది ఎవరు? ఎవరి ఆస్తి ఎంత?

జాన్వీ కపూర్
- నికర విలువ : 82 కోట్ల రూపాయలు
- రెమ్యునరేషన్ : 5-10 కోట్ల రూపాయలు
- బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజు : 70-80 లక్షల రూపాయలు
2018లో 'ధడక్' సినిమాతో అరంగేట్రం చేసిన జాన్వీ కపూర్,'రూహీ', 'పరం సుందరి' లాంటి సినిమాల్లో కనిపించింది. ఆమె కొత్త సినిమా 'సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి' బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. సౌత్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ, ఎన్టీఆర్ తో దేవర సినిమాలో నటించి మెప్పించి హిట్లు కొట్టింది. ఇక ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జోడీగా పెద్ది సినిమాలో నటిస్తోంది.
రష్మిక మందన్న
- నికర విలువ : 66 కోట్ల రూపాయలు
- రెమ్యునరేషన్ : 4-10 కోట్ల రూపాయలు
- బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజు : 2-4 కోట్ల రూపాయలు
2016లో రష్మిక కన్నడ చిత్రం 'కిరిక్ పార్టీ'తో అరంగేట్రం చేసింది. ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చన రష్మికకు తెలుగు ఇండస్ట్రీ బాగా కలిసి వచ్చింది. ఇక్కడే స్టార్ గా మారింది. పూష్పతో పాన్ ఇండియా హీరోయన్ గా ఎదిగింది రష్మిక. పుష్పతో పాటు 'యానిమల్', 'ఛావా' లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో కనిపించింది. ఆమె తాజా చిత్రం 'థామా' ఈ నెల 21న విడుదల కానుంది.
అనన్య పాండే
- నికర విలువ : 70-75 కోట్ల రూపాయలు
- రెమ్యునరేషన్ : 3-5 కోట్ల రూపాయలు
- బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజు : 50-60 లక్షల రూపాయలు
అనన్య పాండే 2019లో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె 'పతి పత్నీ ఔర్ వో', 'డ్రీమ్ గర్ల్ 2' లాంటి సూపర్‌హిట్ సినిమాల్లో కనిపించింది. చివరిసారిగా 'కేసరి చాప్టర్ 2'లో కనిపించింది.
సారా అలీ ఖాన్
- నికర విలువ : 50-55 కోట్ల రూపాయలు
- రెమ్యునరేషన్ : 3 కోట్ల రూపాయలు
- బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజు : 1.5- 3 కోట్ల రూపాయలు
సైఫ్ అలీ ఖాన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2018లో సారా అలీ ఖాన్ 'కేదార్‌నాథ్'తో అరంగేట్రం చేసి, ఆ తర్వాత 'సింబా', 'అత్రంగి రే', 'మర్డర్ ముబారక్' లాంటి చిత్రాల్లో కనిపించింది. చివరిసారిగా ఆమె సూపర్‌హిట్ 'మెట్రో ఇన్ దినో'లో కనిపించింది.
ఇబ్రహీం అలీ ఖాన్
- నికర విలువ : 50-60 కోట్ల రూపాయలు
- రెమ్యునరేషన్ : NA
- బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజు : NA
సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం ఈ ఏడాదే 'నాదానియా'తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 'సర్జమీన్'లో కూడా కనిపించాడు. ప్రస్తుతం 'దిలేర్' సినిమాలో నటిస్తున్నాడు ఇబ్రహీం.
సుహానా ఖాన్
- నికర విలువ : 13-14 కోట్ల రూపాయలు
- రెమ్యునరేషన్ : NA
- బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజు : NA
షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ 2023లో 'ది ఆర్చీస్'తో అరంగేట్రం చేసింది. ఆమె త్వరలో తన తండ్రితో కలిసి 'కింగ్'లో స్క్రీన్ షేర్ చేసుకోనుంది.
అహాన్ పాండే
- నికర విలువ : 41 కోట్ల రూపాయలు
- రెమ్యునరేషన్ : 3-5 కోట్ల రూపాయలు
- బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజు : NA
చంకీ పాండే మేనల్లుడు అహాన్ పాండే ఈ ఏడాదే బ్లాక్‌బస్టర్ 'సైయారా'లో నటించాడు. అతని తదుపరి చిత్రం దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్‌తో చేయబోతున్నాడు. టైటిల్ ఇంకా ప్రకటించిన ఈసినిమాపై సైయారా ఎఫెక్ట్ వల్ల అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి.
అనీత్ పడ్డా
- నికర విలువ : 50 లక్షలు-4 కోట్ల రూపాయలు
- రెమ్యునరేషన్ : 15-20 లక్షల రూపాయలు
- బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజు : NA
అనీత్ పడ్డా ఈ ఏడాదే బ్లాక్‌బస్టర్ 'సైయారా'తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె నెక్ట్స్ సినిమా 'న్యాయ్', షూటింగ్ కూడా పూర్తయింది. సైయారా హిట్ తో ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి.