MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • NBK108 : బాలకృష్ణ - అనిల్ రావిపూడి సినిమా షురూ.. ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్ షెడ్యూల్ డిటేయిల్స్!

NBK108 : బాలకృష్ణ - అనిల్ రావిపూడి సినిమా షురూ.. ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్ షెడ్యూల్ డిటేయిల్స్!

నందమూరి నటసింహం, సీనియర్ నటుడు బాలకృష్ణ - అనిల్ రావిపూడి సినిమాను ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. గ్రాండ్ గా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అతిథుల మధ్య రెగ్యూలర్ షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో సినిమాపై ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ అందాయి.   

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 08 2022, 01:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నందమూరి బాలకృష్ణ (Balakrishna) - సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ లో సినిమాను వస్తున్న విషయం తెలిసిందే. గతంలోనే అనౌన్స్ చేసిన ఈ మూవీని ఈరోజు అధికారికంగా లాంఛ్ చేశారు. గ్రాండ్ గా నిర్వహించిన సినిమా ముహూర్తపు షాట్ కు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గాడ్ ఆఫ్ మాస్ నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ NBK108  వర్క్ టైటిల్ తో గ్రాండ్ గా ప్రారంభించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది.
 

36

ముహూర్తం షాట్‌కు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్‌బోర్డ్‌ను కొట్టారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తం షాట్‌కి లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, కిలారు సతీష్, నిర్మాత శిరీష్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు.

46

‘ఎన్బీకే 108’ రెగ్యూలర్ షూటింగ్ కూడా ఈరోజు నుంచే ప్రారంభం అవుతుంది. వి వెంకట్ మాస్టర్ చేసిన యాక్షన్ బ్లాక్ కొరియోగ్రఫీతో షూటింగ్ ప్రారంభమవుతుంది. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ ఆధ్వర్యంలో ఫైట్ సీక్వెన్స్ కోసం భారీ సెట్ నిర్మించారు.

56

ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కోసం ఇప్పటికే హైదరాబాద్‌లో జైలు సెట్‌ను నిర్మించారు. ఈ సెట్‌లోనే మొదటి షెడ్యూల్‌ లో భాగంగా 12 రోజుల పాటు షూటింగ్ కొనసాగుతుంది. అనిల్ రావిపూడి బాలకృష్ణ కోసం ఓ కొత్త లుక్‌ని డిజైన్ చేశారంట. ఆయన స్టార్ డమ్ కు తగ్గట్టుగా యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ తో కూడిన పవర్ ఫుల్ స్టోరీని సిద్ధం చేశారంట.  గతంలో ఎప్పుడూ చూడని విధంగా తెరపై బాలయ్యను చూపించబోతున్నట్టు హామీనిచ్చారు. 
 

66

ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ కుమార్తెగా శ్రీలీల అలరించనుందంట. హీరోయిన్ల విషయంలో ప్రియమణి, తదితర సినీయర్ హీరోయిన్ల పేరు కూడా వినిపిస్తోంది. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది జనవరి 12న బాలయ్య ‘వీరసింహారెడ్డి’తో అలరించనున్నారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shooting Deaths: షూటింగ్ స్పాట్‌లోనే ప్రాణాలు వదిలారు! కెమెరా ముందు జరిగిన 8 విషాదాలు
Recommended image2
Ajay Ghosh: సుకుమార్ పుణ్యమా అని అజయ్ ఘోష్ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా? ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారంటే?
Recommended image3
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved