- Home
- Entertainment
- Nayanthara wedding: మా పెళ్లికి రండి... సోషల్ మీడియాలో నయనతార - విఘ్నేష్ శివన్ వివాహ ఆహ్వానం
Nayanthara wedding: మా పెళ్లికి రండి... సోషల్ మీడియాలో నయనతార - విఘ్నేష్ శివన్ వివాహ ఆహ్వానం
మరికొద్ది గంటల్లో నయన తార విఘ్నేష్ శివన్ పెళ్లి ఘనంగా జరగబోతోంది. చకచకా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 7 ఏళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈజంట వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. వీరిపెళ్లి ఆహ్వానం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ల పెళ్లి వేడుకుకు కొద్ది గంటలే ఉంది .జూన్ 9 న మహాబలిపురంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో ఒకరితో ఒకరు వివాహం చేసుకోబోతున్నారు. గత ఏడేళ్లుగా డేటింగ్‌లో ఉన్నా ఈ జంట2021లో ఒకరికొకరు నిశ్చితార్థం చేసుకున్నారు.
ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు నయన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వీరి వివాహ ఆహ్వాన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధనుష్ నిర్మించిన నానుం రౌడీ దాన్ మూవీతో వీరిద్దరి బంధం కలిసింది. ఈ మూవీలో నయనతార సరసన విజయ్ సేతుపతి నటించగా.. ఈమూవీకి రచన,దర్శకత్వం విఘ్నేష్ శివన్ చేశారు. అప్పటి నుంచి వీరి మధ్య బంధం బలపడింది.
ఇక పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్న ఈజంట పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. సర్వశక్తిమంతుడైన దేవుడు, మా పెద్దలు మరియు అభిమానుల ఆశీర్వాదంతో, కురియన్ కొడియట్టు మరియు శ్రీమతి ఓమన కురియన్ కుమార్తె నయనతార మరియు శ్రీ శివకొలుందు కుమారుడు విఘ్నేష్ శివన్ వివాహ వేడుకకు మేము మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అంటూ ఆ పత్రికలో ఉంది.
9 జూన్ 2022 గురువారం, షెరటన్ గ్రాండ్ మహాబలిపురం లో సాంప్రదాయ పద్దతుల్లో వీరి పెళ్లి జరగబోతోంది. అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగే అవకాశం ఉంది. అయితే ఈ వేడుకు కోసం డ్రెస్ కోడ్ కూడా పాటిస్తున్నట్టు సమాచారం. అంతే కాదు ఈ పెళ్ళికి భారీ బందోబస్త్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
మంగళవారం విఘ్నేష్ శివన్ తమ పెళ్లి కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. మొదట పెళ్లిని తిరుపతిలో ప్లాన్ చేశామని. కాని బంధుమిత్రులు, ట్రాన్స్ పోర్ట్ తో పాటు, సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకుని మహాబలిపురానికి మార్చామన్నారు విఘ్నేష్.
ఇక వీరిద్దరి పెళ్ళిని డాక్యూమెంటరీగా చిత్రించే ప్లానింగ్ చేశారు. స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఆ పనిచేయబోతున్నట్టు తెలుస్తోంది. ఓటటీలో వీరి పెళ్ళి లైవ్ కూడా రాబోతున్నట్టు సమాచారం. చివరిగా వీరిద్దరు కలిసి పనిచేసిన సినిమా కాతువాకుల రెండు కాదల్. ఈమూవీ ఏప్రిల్ లో రిలీజ్ అయ్యిసూపర్ హిట్ సాధించింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సందడి చేస్తోంది.