- Home
- Entertainment
- భర్తని అన్ ఫాలో చేసిన నయనతార.. కన్నీళ్లు వస్తున్నప్పుడు కూడా అంటూ పోస్ట్, సోషల్ మీడియా అల్లకల్లోలం
భర్తని అన్ ఫాలో చేసిన నయనతార.. కన్నీళ్లు వస్తున్నప్పుడు కూడా అంటూ పోస్ట్, సోషల్ మీడియా అల్లకల్లోలం
నయనతార ఇంస్టాగ్రామ్ లో తన భర్త విగ్నేష్ శివన్ ని ఒక్కసారిగా అన్ ఫాలో చేసింది. దీనితో సోషల్ మీడియాలో చిన్న తుఫానే చెలరేగింది.

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 2022లో తన ప్రియుడు విగ్నేష్ తో నయనతార వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయింది.

నయనతార ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. గత ఏడాది బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటించగా ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. చాలా కాలం పాటు సహజీవనం చేసిన నయన్, విగ్నేష్ ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. నయనతార, విగ్నేష్ శివన్ జోడి ఎక్కడ కనిపించినా అక్కడ అభిమానులు పెద్ద ఎత్తున జనసంద్రంలా మారడం చూస్తూనే ఉన్నాం.
నయన్, విగ్నేష్ పెళ్లి చేసుకోవడం.. సరోగసి ద్వారా పిల్లలని పొందడం చకచకా జరిగిపోయాయి. తరచుగా సెలెబ్రిటీలు విడిపోవడం చూస్తూనే ఉన్నాం. కొన్నేళ్ల పాటు సహజీవనం చేసిన తర్వాత కొందరు విడిపోతుంటే.. మరికొందరు వివాహ బంధంలోకి అడుగు పెట్టాక విడిపోతున్నారు.
నయనతార, విగ్నేష్ శివన్ కూడా విడిపోతారని వేణు స్వామి లాంటి జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడూ నయనతార, విగ్నేష్ అడుగులని గమనిస్తూనే ఉంటారు. వీళ్లిద్దరికీ అంత క్రేజ్ ఉంది. అయితే తాజాగా నయనతార ఇంస్టాగ్రామ్ లో తన భర్త విగ్నేష్ శివన్ ని ఒక్కసారిగా అన్ ఫాలో చేసింది. దీనితో సోషల్ మీడియాలో చిన్న తుఫానే చెలరేగింది.
Nayanthara
ఫ్యాన్స్ కి నయనతార ఏంచేస్తోందో.. అసలేం జరుగుతోందో అర్థం కాలేదు. నయన్ విగ్నేష్ ని అన్ ఫాలో చేయగానే ఇద్దరూ విడిపోతున్నారా, విడాకులు తీసుకుంటున్నారా ఇలా ఏవేవో పుకార్లు మొదలయ్యాయి. దీనికి తోడు నయనతార ఎమోషనల్ పోస్ట్ ఒకటి పెట్టింది. కన్నీళ్లు వస్తున్నప్పుడు కూడా తనకి మిగిలింది ఏంటో ఆమె చెబుతుంది అని నయన్ ఇన్స్టా స్టోరీలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇది కాస్త అనుమానాల్ని మరింత పెంచేసింది.
Nayanthara
అయితే నయనతార విగ్నేష్ శివన్ ఫోటోలని డిలీట్ చేయలేదు. కొంత సమయానికి తిరిగి విగ్నేష్ ని ఫాలో అయింది. దీనితో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అదేదో పొరపాటున జరిగి ఉంటుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నయనతార అడ్మిన్ టీమ్ ఎవరైనా పొరపాటున అలా చేశారేమో తెలియాల్సి ఉంది.