- Home
- Entertainment
- నయనతార సంచలన వ్యాఖ్యలు, అంతలా వేధించారా.. లేడీ సూపర్ స్టార్ కి కూడా తప్పని కాస్టింగ్ కౌచ్
నయనతార సంచలన వ్యాఖ్యలు, అంతలా వేధించారా.. లేడీ సూపర్ స్టార్ కి కూడా తప్పని కాస్టింగ్ కౌచ్
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గత ఏడాది తన ప్రియుడు విగ్నేష్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నయనతార.. సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయింది.

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గత ఏడాది తన ప్రియుడు విగ్నేష్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నయనతార.. సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయింది. నయనతార సరోగసి ఎంచుకోవడం పై పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే ఆ కాంట్రవర్సీని నయన్ దంపతులు ఎలాగోలా మ్యానేజ్ చేసుకుని బయట పడ్డారు.
ఇక నయనతార చివరగా చిరంజీవి గాడ్ ఫాదర్, కనెక్ట్ చిత్రాల్లో నటించింది. గాడ్ ఫాదర్ లో చిరంజీవి చెల్లిగా నటించి మెప్పించింది. ఆయా తర్వాత వచ్చిన కనెక్ట్ చిత్రం మెప్పించలేకపోయింది. నయనతార ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం కానీ చేయదు.
కానీ కనెక్ట్ చిత్రం కోసం నయన్ తొలిసారి ఇంటర్వ్యూలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తన పర్సనల్ మ్యాటర్స్ గురించి నయన్ క్రమంగా ఓపెన్ అవుతోంది కూడా. తాజాగా నయనతార ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇప్పటికే చాలా మంది నటీమణులు కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అవుతూ తమ చేదు అనుభవాలను పంచుకున్నారు. మీటూ ఉద్యమం సమయంలో చాలా మంది నటీమణులు తమకు ఇండస్ట్రీలో ఎదురైన అవమానాలు లైంగిక వేధింపుల గురించి బయట పట్టిన సంగతి తెలిసిందే. తాజాగా నయనతార కూడా హాట్ కామెంట్స్ చేసింది.
ఈ లేడీ సూపర్ స్టార్ కి కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవం తప్పలేదట. కెరీర్ ఆరంభంలో నాకు కూడా కాస్టింగ్ కౌచ్ చేదు అనుభవం ఎదురైంది. కమిట్మెంట్ ఇవ్వాలని కొందరు వేధించారు. అయితే నేను వాళ్ళకి లొంగలేదు. నిర్మొహమాటంగా వాళ్ళని నిలదీశాను. ఆ తర్వాత ఎవ్వరూ నాతో పిచ్చిగా ప్రవర్తించలేదు.
nayanthara
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది. అయితే అది మన ప్రవర్తన మీద కూడా ఆధారపడి ఉంటుంది. మన ప్రవర్తన సరిగా లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. తాను మాత్రం ఎవ్వరికి దాసోహం అనకుండా ప్రతిభని మాత్రమే నమ్ముకున్నట్లు పేర్కొంది. నయన్ కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మీటూ ఉద్యమ సమయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నట్లు అని ప్రశ్నిస్తున్నారు.