నయనతారా, హన్సిక, అలియా భట్, మౌనీరాయ్.. కొందరికి సింగిల్, మరికొందరికి డబుల్ సర్‌ప్రైజ్.. ఆ కథేంటంటే?
సౌత్, నార్త్ లో స్టార్ హీరోయిన్స్ గా దూసుకెళ్తున్న ముద్దుగుమ్మలు ఈ ఏడాదితో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. 2022లో పెళ్లి పీటలు ఎక్కిన ముద్దుగుమ్మల్లో నయనతారా, హన్సిక, అలియా భట్, మౌనీరాయ తదితరులు ఉన్నారు. వారితో పాటు పలువురు సెలబ్రెటీల వివాహాలు గ్రాండ్ గా జరిగాయి.
2022లో పెళ్లిపీటలు ఎక్కిన స్టార్ హీరోయిన్లలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఒకరు. ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తుండగా తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)ను పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది జూన్ 9న చెన్నైలోని మహాబలిపురంలో గ్రాండ్ గా వివాహా వేడుకలు జరిగాయి. వీరి పెళ్లికి సినీ తారలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరవడం విశేషం. ఇక రీసెంట్ గా సరోగసీ ద్వారా కవలలకు కూడా జన్మనిచ్చారు.
యాపిల్ బ్యూటీ హన్సికా మోత్వానీ (Hansika Motwani) తన స్నేహితుడు, వ్యాపారవేత్త సోహెల్ కతూరియాను పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది చివరిగా జరిగి పెళ్లి వేడుకు హన్సికదే. ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ సాక్షిగా ఈ జంట ఒక్కటికాబోతున్నట్టు అనౌన్స్ చేశారు. అనంతరం ముంబైలో గ్రాండ్ గా పెళ్లి వేడుకలు జరిగాయి. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. భర్తతో కలిసి టూర్లు, వేకేషన్స్ కు వెళ్తూ సందడి చేస్తోంది.
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆదిపిని శెట్టి (Adhi Pinishetty)తో తమిళ హీరోయిన్ నిక్కీ గల్రానీ (Nikki GalranI) వివాహం కూడా ఈ ఏడాదే జరిగింది. చెన్సైలోని ఓ కన్వెషన్ హాల్ లో మే 18న గ్రాండ్ గా నిర్వహించారు. వీరి పెళ్లికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం వీరద్దరూ దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) కూడా ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ (Ranbir Kapoor)తో ఏప్రిల్ 14న ముంబైలోని ఓ స్టూడియోలో గ్రాండ్ ఏర్పాట్ల మధ్య అలియా పెళ్లి అత్యంత వైభంగా జరిగింది. ఇక రీసెంట్ గా అలియా పండంటి ఆడబిడ్డకు కూడా జన్మనిచ్చింది.
‘నాగిని’ సీరియల్ హీరోయిన్, బాలీవుడ్ గ్లామర్ బ్యటూ మౌనీ రాయ్ (Mouni Roy) దుబాయ్ కి చెంది వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ ను పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది జనవరిలో మౌనీరాయ్ వివాహా వేడుకలు ముంబైలో గ్రాండ్ గా జరిగాయి. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ను లీడ్ చేస్తున్న ఈ బ్యూటీ అటు సినీ కేరీర్ ను కొనసాగిస్తోంది. రీసెంట్ గా ‘బ్రహ్మాస్త్రం’తో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం భర్తతో కలిసి విదేశాలకు వెళ్లింది.
సీనియర్ హీరోయిన్ పూర్ణ (Poorna) దుబాయ్ కి చెందిన వ్యాపార వేత్త షానిద్ అసిఫ్ అలీ (Shanid Asif Ali)ని ఈ ఏడాది జూన్ 1న వివాహాం చేసుకుంది. హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్న పూర్ణ ఈరోజే గుడ్ చెప్పింది. త్వరలో తాను తల్లికాబోతున్నట్టు తాజాగా అనౌన్స్ చేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) కూడా ఈ ఏడాదితో ఓ ఇంటివాడయ్యాడు. ఇంటిరీయర్ డిజైనర్ అనుష శెట్టిని ప్రేమ వివాహాం చేసుకున్నాడు. నవంబర్ 21న బెంగళూరులో వీరిద్దరి వివాహాం గ్రాండ్ గా జరిగింది. వీరి వివాహ విందు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచిని విషయం తెలిసిందే. ఇలా స్టార్ హీరోయిన్స్, సెలబ్రెటీలు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.