- Home
- Entertainment
- Nayanthara: నయనతారకి సపోర్ట్ గా కొందరు ఫ్యాన్స్.. తిరుమలలో జరిగిన పొరపాటుపై వాళ్ళ వాదన ఇదే
Nayanthara: నయనతారకి సపోర్ట్ గా కొందరు ఫ్యాన్స్.. తిరుమలలో జరిగిన పొరపాటుపై వాళ్ళ వాదన ఇదే
వివాహం జరిగిన తర్వాత నయన్, విగ్నేష్ శివన్ ఇటీవల తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. విఐపి బ్రేక్ దర్శనంలో ఏ కొత్త జంట స్వామివారిని దర్శించుకున్నారు.

నయనతార, విగ్నేష్ శివన్ జంట ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. మహాబలిపురంలో విగ్నేష్, నయనతార వివాహం వైభవంగా జరిగింది. మహాబలిపురం చారిత్రాత్మక ప్రాంతం మాత్రమే కాదు.. అందమైన ప్రకృతి దృశ్యాలు ఉన్న ప్రదేశం కూడా. కాబట్టి నయనతార విగ్నేష్ శివన్ లు తమ వివాహానికి వేదికగా మహాబలిపురంని ఎంచుకున్నారు.
ఏడేళ్లపాటు సహజీవనం చేసిన ఈ జంట వైభవంగా పెళ్లి చేసుకుని తమ కొత్త జీవితాన్ని ప్రారంభించారు.వివాహం జరిగిన తర్వాత నయన్, విగ్నేష్ శివన్ ఇటీవల తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. విఐపి బ్రేక్ దర్శనంలో ఏ కొత్త జంట స్వామివారిని దర్శించుకున్నారు.
అయితే నయనతార ఆలయ ప్రాంగణంలోని తిరు మాఢవీధుల్లో పాదరక్షలు ధరించి నడవడం తీవ్ర వివాదంగా మారింది. దీనిపై టిటిడి అధికారులు నయనతారకి నోటీసులు కూడా పంపారు. తిరు మాఢవీధుల్లో చెప్పులు ధరించడం నిషేధం. ఆ సంగతి మరచిపోయిందో ఏమో కానీ నయన్ పొరపాటు చేసింది.
nayanthara bridal look
అయితే దీనిపై నయన్, విగ్నేష్ జంట వెంటనే స్పందించి క్షమాపణలు కోరారు. అయితే నయనతారపై మాత్రం ట్రోలింగ్ కొనసాగుతోంది. నయన్ హిందువుల మనోభావాల్ని కించపరిచింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై నయనతారని సపోర్ట్ చేస్తున్న వారు కూడా ఉన్నారు.
తిరుమలలో ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఆలయ ప్రాంగణంలోని మాఢవీధులు వేడెక్కి ఉంటాయి. అలాంటి సమయంలో పాదరక్షలు ధరించకుండా నడవడం చాలా కష్టం. కానీ నయనతార పొరపాటు చేసింది. అంత మాత్రాన హిందూ సంఘాలు నయన్ ని వేధించేలా కామెంట్స్ చేయడం సబబు కాదు.
నయనతార క్రిస్టియన్ నుంచి హిందువుగా కన్వర్ట్ అయిందనే విషయం గుర్తుంచుకోవాలి. ఆమెని వేధిస్తున్న హిందువులెవరూ చేయనంతగా నయన్ గత కొన్నేళ్లలో అనేక దేవాలయాలు సందర్శించింది అని పూజలు చేసింది అని అంటున్నారు. ఇలా చిన్న పొరపాటు జరిగినప్పుడు ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.