అల్లు అర్జున్ టాటూను గమనించారా..? వైరల్ అవుతున్న టాటూ సీక్రేట్ ఏంటంటే..?
జాతీయ అవార్డ్ సాధించిన సంతోషంలో ఉన్నాడు అల్లు అర్జున్.. వరుసగా సినీ రాజకీయ వర్గాల నుంచి అభినందనలు అందుతుండటంతో.. బిజీ బిజీ అయిపోయాడు. ఇక సరిగ్గా ఇదే టైమ్ లో ఆయనకు సబంధించిన కొన్న విషయాలు వైరల్ అవుతున్నాయి.

పుష్ప సినిమాతో జాతీయ అవార్డ్ ను సాధించాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఈసినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ కు ఇంత వరకూ ఉత్తమ నటుడి విభాగంలో.. జాతీయ అవార్డ్ రాలేదు. కాని ఈసారి ఆ అవార్డ్ సాధించడంతో పాటు.. రికార్డ్ ను కూడా జేబులో వేసుకున్నాడు అల్లు అర్జున్.
టాలీవుడ్ అంతా ఇప్పుడు ఒక్కటే మోత. 10జాతీయ అవార్డులు తెలుగు సినిమాలకు రావడంతో పాటు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చింది. 69 వ జాతీయ అవార్డుల జాబితాలో ఉత్తమ నటుడు కేటగిరిలో అల్లు అర్జున్ పేరు ఉండటంతో.. అప్పటి నుండి అల్లు అర్జున్ అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకాయి అని చెప్పాలి. ఈక్రమంలో అల్లు అర్జున్ కు సబంధించిన కొన్న విషయాలు వైరల్ అవుతున్నాయి.
తగ్గేదే లే అంటూ.. బన్నీ నేషనల్ అవార్డు కొట్టినప్పటి నుండి ఆయన పేరు మన దేశంలోనే కాకుండా.. విదేశాల్లో కూడా మార్మోగుతుంది. గూగుల్ లో కూడా విదేశీయులు పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ అన్ సీన్ పిక్స్ కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేతి పై ఓ టాటూ ఉన్న సంగతి మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.
ఆ టాటూ మీనింగ్ ఏంటి అని కొందరు చర్చించుకుంటున్నారు. దీనికి అల్లు అర్జున్ ఎప్పుడో సమాధానం ఇచ్చాడు. తన చేతిపై ఉన్న టాటూ తన భార్యాదని అల్లు అర్జున్ చెప్పాడు. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి పేరునే చేతిపై టాటూగా వేయించుకున్నాడు బన్నీ. అంతే కాదు ఇలానే అల్లు స్నేహా రెడ్డి చేతి మీద కూడా బన్నీ పేరుతో టాటూ ఉందంటున్నారు.
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ తీసుకురాగా.. ఈసినిమాకుగా దేవిశ్రీ ప్రసాద్ కూడా బెస్ట్ మ్యూజిక్ కు జాతీయ అవార్డ్ సాధించారు. ప్రస్తుతం పుష్ప2 హడావడిలో ఉన్నాడు అల్లు అర్జున్. ఈసినిమాను అంతకు మించి తెరకెక్కించాలని సవాల్ గా తీసుకుని చేస్తున్నారు. ఈమూవీ మేజర్ షూటింగ్ అయిపోయినట్టు తెలుస్తోంది.