- Home
- Entertainment
- పవిత్ర లోకేష్ ముద్దు పేరు చెప్పిన నరేష్.. ఓంకార్ ముందే ముద్దుల వర్షం.. రిలేషన్‌షిప్‌పై ఎట్టకేలకు క్లారిటీ..
పవిత్ర లోకేష్ ముద్దు పేరు చెప్పిన నరేష్.. ఓంకార్ ముందే ముద్దుల వర్షం.. రిలేషన్‌షిప్‌పై ఎట్టకేలకు క్లారిటీ..
పవిత్రలోకేష్, నరేష్ ఘాటు ప్రేమలో ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. ఏకంగా తమ రిలేషన్‌పై సినిమాని కూడా చేస్తున్నారు. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న ఈ ఇద్దరు రచ్చ రచ్చ చేశారు.

నటి పవిత్ర లోకేష్, సీనియర్ నటుడు వీకే నరేష్ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారు. తమ ముందుపెళ్లిళ్లకి సంబంధించిన విడాకుల పత్రాలు వస్తే పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం కలిసి `మళ్లీ పెళ్లి` సినిమా కూడా చేస్తున్నారు. ఇది నరేష్ లైఫ్ కోణంలో తెరకెక్కుతుంది. ఇది ఈ నెలలోనే విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటూ, అటు తమ రిలేషన్‌షిప్‌ని బలంగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు, అదే సమయంలో సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నారు.
తాజాగా ఈ జంట ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న `సిక్త్స్ సెన్స్` షోకి వచ్చారు. ఇందులో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పవిత్రని ముద్దుగా ఏమని పిలుచుకుంటారో చెప్పారు నరేష్. ముద్దుగా తనని `అమ్ములు` అని పిలుచుకుంటారట. ఇంకా ప్రేమ ఎక్కువైతే `అమ్ము` అని, ఇంకా ప్రేమ ఎక్కువైతే ఏమని పిలుస్తానో తెలుసా.. అని సస్పెన్స్ పెట్టి `వద్దులే` అని వదిలేశాడు నరేష్.
అంతేకాదు.. ఈ సందర్భంగా ప్రస్తుతం మీ రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటని ఓంకార్ ప్రశ్నించగా, ఆకాశం మీద పడినా, భూమి బద్దలైనా, మేం కలిసి ఉంటామని స్పష్టం చేశాడు నరేష్. ఈ సందర్భంగా నరేష్ ఉబ్బితబ్బిబ్బయ్యింది. అనంతరం ఇద్దరు కలసి డాన్సులు చేశారు. స్టేజ్‌పైనే రచ్చ రచ్చ చేశారు. అంతేకాదు ఒకరికి ఒకరు ముద్దులు పెట్టుకున్నారు. ఓ రకంగా ముద్దుల వర్షం కురిపించుకున్నారు. ఇది హాట్ టాపిక్‌గా మారింది.
మరో సందర్భంగా తుపాకి ఎక్కుపెట్టి కాల్చే సన్నివేశంలో ఓంకార్ మాట నమ్ముతావా? నా మాట నమ్ముతావా? అని నరేష్ ప్రశ్నించగా, మిమ్మల్నే నమ్ముతా అని చెబుతుంది పవిత్ర. దానికి నరేష్ రియాక్ట్ అవుతూ నమ్మాల్సిందే, మరో ఆప్షన్ లేదు. జీవితం నమ్ముతూనే ఉండాలి అని చెప్పడంలో మరో కోణం కనిపించింది. కానీ దాన్ని లెక్క చేయక పవిత్ర నరేష్‌తో సరదాగా గేమ్ ఆడుతూ అలరించింది. ఆకట్టుకుంది. సిక్త్స్ సెన్స్ నెక్ట్స్ ఎపిసోడ్‌కి సంబంధించిన ఈ ప్రోమో వైలర్ అవుతుంది. శని, ఆదివారంలో ప్రసారం కానుంది.
ఇదిలా ఉంటే ఈ జంటపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ముదురు ప్రేమ, ఇంత ఘాటుగా ఉందని, ఈ ఏజ్‌లో ప్రేమేంటని? లేటు వయసులో ఘాటు ప్రేమ అని, ఆపండ్రా బాబు మాకు సిగ్గేస్తోందని, ఎంతగా తెగించారని, మీరెక్కడ తగిలార్రా బాబూ అంటూ కామెంట్ చేస్తున్నారు. నరేష్ అదృష్టవంతుడని, మూడు పెళ్లిళ్ల వరకు వెళ్లిన నరేష్ అక్కడితో ఆగుతాడా? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు వాళ్లునిజాయితీగా ప్రేమించుకుంటున్నారు. ఓపెన్‌గా చెబుతున్నారని, సీక్రెట్‌గా తప్పులు చేయడం లేదని, ప్రేమ జీవితం వారి ఇష్టం, మధ్యలో మనకేంటి? అంటూ వారికి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.