- Home
- Entertainment
- కృష్ణ గారికి 'మళ్ళీ పెళ్లి' అంకితం.. 81వ జయంతి రోజున, నరేష్ కామెంట్స్ పై దుమ్మెత్తి పోస్తున్న మహేష్ ఫ్యాన్స్
కృష్ణ గారికి 'మళ్ళీ పెళ్లి' అంకితం.. 81వ జయంతి రోజున, నరేష్ కామెంట్స్ పై దుమ్మెత్తి పోస్తున్న మహేష్ ఫ్యాన్స్
విభేదాల కారణంగా తన మూడవ భార్య రమ్య రఘుపతికి నరేష్ దూరం అయ్యారు. అయితే చాలా కాలంగా నరేష్ పవిత్ర లోకేష్ తో రిలేషన్ షిప్ లో కొనసాగుతున్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు రోజూ వినిపిస్తూనే ఉన్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
విభేదాల కారణంగా తన మూడవ భార్య రమ్య రఘుపతికి నరేష్ దూరం అయ్యారు. అయితే చాలా కాలంగా నరేష్ పవిత్ర లోకేష్ తో రిలేషన్ షిప్ లో కొనసాగుతున్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు రోజూ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే వీరిద్దరి నెగిటివ్ క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు దర్శక నిర్మాత ఎమ్మెస్ రాజు.. నరేష్ పవిత్ర లతో మళ్ళీ పెళ్లి అనే చిత్రాన్ని కూడా తెరకెక్కించారు.
Naresh
నరేష్ ఇంటిగుట్టు మీడియాకి ఎక్కడంతో మహేష్ అభిమానులకి కాస్త ఎబ్బెట్టుగా మారింది. నరేష్, పవిత్ర హోటల్ రూమ్ లో ఉండడం.. అక్కడకి వెళ్లి రమ్య రఘుపతి రచ్చ చేయడం వీరి మధ్య జరుగుతున్న వ్యవహారంతో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. కానీ అవేమి పట్టవు అన్నట్లుగా నరేష్, పవిత్ర పబ్లిక్ గా తమ రిలేషన్ ని కొనసాగిస్తున్నారు.
మ్యారేజ్ వ్యవస్థ దిగజారిపోతోంది అని చెప్పిన నరేష్ తాము ఆల్రెడీ పెళ్లి చేసుకున్నట్లే అని ప్రకటించారు. ఈ వ్యవహారంలో నరేష్, పవిత్ర పదే పదే కృష్ణగారి ఫ్యామిలీ ప్రస్తావన తీసుకువస్తుండడంతో మహేష్ అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. ఆ మధ్యన నరేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవిత్రతో తన బంధాన్ని మహేష్ బాబు యాక్సెప్ట్ చేసారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఇటీవల విడుదలైన మళ్ళీ పెళ్లి చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే నరేష్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా నరేష్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు మరోసారి మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం అయ్యాయి. మళ్ళి పెళ్లి చిత్రాన్ని తాను సూపర్ స్టార్ కృష్ణ గారికి అంకితం చేయబోతున్నాను అని అన్నారు.
మే 31న సూపర్ స్టార్ కృష్ణ గారి 81వ జయంతి జరగనుంది. ఈ సందర్భంగా మళ్ళీ పెళ్లి చిత్రాన్ని కృష్ణగారికి అంకితం ఇస్తానని నరేష్ అన్నారు. అంతే కాదు రియల్ లైఫ్ లో బోల్డ్ కపుల్ అంటే కృష్ణ, విజయనిర్మల గారే అని కూడా నరేష్ పేర్కొన్నారు. వాళ్ళ బాటలో ముందుకు వెళ్లాలని విజయ్ కృష్ణ బ్యానర్ ని మళ్ళీ ప్రారంభించినట్లు నరేష్ తెలిపారు. తాను బతికున్నంత కాలం సినిమాలు, సమాజ సేవ చేస్తానని నరేష్ తెలిపారు.
తన వ్యక్తిగత విషయాలతో నరేష్, పవిత్ర ట్రోల్ కి గురవుతున్నారు. కృష్ణ గారి పేరు వాడుకుంటూ వివాదాస్పద అంశాలతో తెరకెక్కించిన మళ్ళి పెళ్లి చిత్రాన్ని ఆయనకి అంకితం ఇవ్వడం ఏంటి ? అసలు కృష్ణ గారి పేరు ఎందుకు వాడుకుంటున్నావు , మహేష్ ఫ్యామిలీతో నీకు ఏంటి సంబంధం అంటూ ఫ్యాన్స్ నరేష్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇటీవల కృష్ణ గారి తమ్ముడు ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ తమ ఫ్యామిలీతో నరేష్ కి ఎలాంటి సంబంధం లేదు అంటూ కుండబద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. అతని ఫ్యామిలీ వ్యవహారాల్ని కూడా తాము పట్టించుకోము అని ఆది శేషగిరి రావు అన్నారు.