MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ పేరు వచ్చేలా గీతా మాధురి కొడుక్కి నామకరణం.. నందు ఇంట సంబరాలు చూశారా..

ఎన్టీఆర్ పేరు వచ్చేలా గీతా మాధురి కొడుక్కి నామకరణం.. నందు ఇంట సంబరాలు చూశారా..

తాజాగా నందు, గీతా మాధురి కొడుక్కి బారసాల కార్యక్రమం ఘనంగా జరిగింది. పలువురు సెలెబ్రిటీలు అతిథులుగా హాజరయ్యారు. బుల్లితెర నటీనటులు, వెండితెర సెలెబ్రిటీలు, బంధువులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 04 2024, 11:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ ఫేమస్ సెలబ్రిటీ కపుల్ సింగర్ గీతా మాధురి, నటుడు నందు జంట ఇటీవల మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. ఆల్రెడీ ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. కుమార్తె పేరు ప్రకృతి. టాలీవుడ్ లో గీతా మాధురి సింగర్ గా రాణిస్తోంది. ఇక నందు యాంకర్ గా, నటుడిగా రాణిస్తున్నారు. 

 

26

గీతా మాధురి గర్భవతి అయినప్పటి నుంచి బేబీ బంప్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఇటీవల గీతా మాధురి సీమంతం వేడుక వైభవంగా జరిగింది. నందు అయితే స్వయంగా వంటకాలు వండి 800 మందికి అన్నదానం చేశారు. ఫిబ్రవరి 10న గీతా మాధురి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీనితో నందు కుటుంబం సంతోషంలో మునిగిపోయారు. 

 

36

తాజాగా నందు, గీతా మాధురి కొడుక్కి బారసాల కార్యక్రమం ఘనంగా జరిగింది. పలువురు సెలెబ్రిటీలు అతిథులుగా హాజరయ్యారు. బుల్లితెర నటీనటులు, వెండితెర సెలెబ్రిటీలు, బంధువులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు. ఆ దృశ్యాలని నందు, గీతా మాధురి ఇద్దరూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. 

 

46

గీతా మాధురి, నందు తమ కొడుక్కి పేరు కూడా చాలా క్రేజీగా పెట్టారు. ఎన్టీఆర్ పేరు వచ్చేలా నామకరణం చేయడం విశేషం. నందు, గీతా మాధురి కొడుకు పేరు 'ధృవధీర్ తారక్'. పేరులో తారక్ అని రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. పేరు చాలా బావుంది అని కామెంట్స్ పెడుతున్నారు. 

 

56

గీతా మాధురి, నందు కొడుకు బారసాల సందర్భంగా బిగ్ బాస్ యూనిట్, నటి హరితేజ, యాంకర్ రష్మీ సింగర్ కౌశల్య లాంటి వారంతా శుభాకాంక్షలు తెలిపారు. గీతా మాధురి బిగ్ బాస్ సీజన్ 2లో రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 

 

66

తనయుడు బారసాల కార్యక్రమం కావడంతో నందు, గీతా మాధురి ఇద్దరూ సాంప్రదాయ వస్త్ర ధారణలో మెరిసిపోతున్నారు. తమ కొడుకుని ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుని మురిసిపోతున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
రాఘవేంద్ర రావు నుంచి కోదండరామిరెడ్డి వరకు.. మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ట్విస్ట్
Recommended image2
Food from Prabhas: ఆ కొత్త హీరోయిన్‌కి ప్రభాస్ ఇంటి నుంచి స్పెషల్ ఫుడ్, చూస్తేనే నోరూరిపోతుంది
Recommended image3
Niharika : అవార్డు వచ్చిన సంతోషమే లేదు.. బాగా హర్ట్ అయిన మెగా డాటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved