- Home
- Entertainment
- Nandamuri Mokshagna:నందమూరి మోక్షజ్ఞ షాకింగ్ ట్రాన్స్ ఫర్మేషన్.. లేటెస్ట్ లుక్ వైరల్, యంగ్ లయన్ ఇక రెడీ
Nandamuri Mokshagna:నందమూరి మోక్షజ్ఞ షాకింగ్ ట్రాన్స్ ఫర్మేషన్.. లేటెస్ట్ లుక్ వైరల్, యంగ్ లయన్ ఇక రెడీ
మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నందమూరి ఫ్యాన్స్ అంతా యంగ్ లయన్ సిద్ధం అవుతోంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ గురించి తరచూ ఫ్యాన్స్ లో చర్చ జరుగుతూనే ఉంది. కానీ ఎంట్రీ మాత్రం వాయిదా పడుతూనే ఉంది. ఈ ఏడాది అయినా మోక్షజ్ఞ తొలి చిత్రం ఉంటుందేమోనని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. గత నాలుగేళ్లుగా మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఇదిగో అదిగో అంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
ఆ మధ్యన అయితే మోక్షజ్ఞ బాగా బొద్దుగా కనిపించడంతో నందమూరి ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. అసలు మోక్షజ్ఞ నటుడిగా మారేందుకు ఎలాంటి ప్రిపరేషన్స్ చేయడం లేదా అంటూ చర్చ జరిగింది. ఈ బాడీతో సినిమాల్లో నటించడం సాధ్యమేనా అని కూడా మాట్లాడుకున్నారు. మోక్షజ్ఞని హీరోగా మార్చేందుకు బాలయ్య ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదా అని కూడా ఫ్యాన్స్ లో చర్చ జరుగుతోంది.
కానీ అప్పుడప్పుడూ బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి లాంటి హీరోల పేర్లు తెరపైకి వస్తూనే ఉన్నాయి. అయితే మోక్షజ్ఞ గతంలో కాకుండా ఇటీవల ఎక్కవుగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కనిపిస్తున్నారు. ఆ మధ్యన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోదరి కొడుకు పెళ్ళిలో మోక్షజ్ఞ సందడి చేశాడు. కానీ అప్పుడు మోక్షజ్ఞ కాస్త బొద్దుగా ఉన్నాడు.
మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ లుక్ లో మోక్షజ్ఞని నందమూరి ఫ్యాన్స్ చూస్తే కేక పెట్టడం ఖాయం. మోక్షజ్ఞ బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ షాకింగ్ గా ఉంది. బాగా సన్నగా మారిపోయాడు. ఫేస్ లుక్ కూడా స్టైలిష్ గా మారింది. కాస్త గడ్డం పెంచిన మోక్షజ్ఞ సూపర్ స్టైలిష్ గా ఉన్నాడు.
దీనితో నందమూరి ఫ్యాన్స్ అంతా యంగ్ లయన్ సిద్ధం అవుతోంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు తన బ్రదర్స్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లాగా మోక్షజ్ఞ కూడా స్టైలిష్ గా మారాడు అని అంటున్నారు.
ఆ మూవీ అనౌన్స్ మెంట్ ఏదో త్వరగా వచ్చేస్తే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి కావడం ఖాయం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్ ఏంటంటే.. మోక్షజ్ఞ అఖండ 2 చిత్రంతో ఎంట్రీ ఇస్తాడని వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.