MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘బింబిసార 2’లోనే అసలు కథ.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ చెప్పిన కళ్యాణ్ రామ్.. ఎలా చూపించబోతున్నారంటే?

‘బింబిసార 2’లోనే అసలు కథ.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ చెప్పిన కళ్యాణ్ రామ్.. ఎలా చూపించబోతున్నారంటే?

ఫాంటసీ ఫిల్మ్ ‘బింబిసార’తో ఇండస్ట్రీని తనవైపు చూసేలా చేశాడు నందమూరి కళ్యాణ్ రామ్. మొదటి భాగం  ప్రేక్షకులకు తెగ నచ్చడంతో  రెండో భాగాన్ని మరింత గ్రాండ్ గా చిత్రీకరించనున్నారు. తాజాగా పార్ట్ 2 కథపై ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ ను రివీల్ చేశారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 09 2022, 06:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఫాంటసీ అండ్ టైమ్‌ ట్రావెల్‌ ఫిల్మ్ ‘బింబిసార’ (Bimbisara)తో నందమూరి కళ్యాణ్ రామ్ భారీ సక్సెస్ ను అందుకున్నారు. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రేక్షకులకు క్లాసిక్ ఫిల్మ్ రుచిని చూపించారు. ప్రస్తుతం ‘బింబిసార’ థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అయితే, చిత్రం రిలీజ్ కు ముందు సినిమాను నాలుగు పార్టులుగా తీయనున్నట్టు నందమూరి కళ్యాణ్ రామ్ మీడియా సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే.  అయితే పార్ట్ వన్ కు ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణ  దక్కడంతో ప్రస్తుతం ‘బింబిసార పార్ట్ 2’ (Bimbisara 2) పై ఆసక్తి నెలకొంది.  రెండో భాగంలో కథ ఎలా ఉండబోతోంది. ఎలా చూపించనున్నారో అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.
 

37

‘బింబిసార’లో డెబ్యూ దర్శకుడు వశిష్ఠ కథ పరంగా చాలా జాగ్రత్త పడ్డాడు. సస్పెన్స్ చూపించడంలో సక్సెస్ అయ్యాడు. మొదటి భాగంలో బింబిసారుడు తమ్ముడు దేవదత్తను చంపించే సీన్ నుంచి.. చివరికి బింబిసారుడు ప్రాణాపాయ స్థితికి చేరుకునే సమయం వరకు ఆసక్తికరంగా తెరకెక్కించారు. కథ పరంగా కేవలం బింబిసారుడు మనిషిగా మారే దశను మాత్రమే చూపించారు. మిగిలిన పాత్రలనూ బింబిసారుడు వెర్షన్ లోనే నడిపించారు. చివరికి  కథ కొనసాగింపుగా సంజీవని పుష్ఫం చూపిస్తూ పార్ట్ 2పై హింట్ ఇచ్చారు. 

47

‘బింబిసారుడు 2’లోనే సంజీవని ద్వారా బింబిసారుడు ప్రాణం పోసుకొని,ఆ తర్వాత తమ్ముడు దేవదత్తతో కలిసి తన రాజ్య పాలనను సరిదిద్దే ప్రయత్నం చేస్తాడని ఆడియెన్స్ ఊహిస్తున్నారు. కానీ అందుకు భిన్నంగా రెండో భాగాన్ని ప్లాన్ చేశారంట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సెకండ్ పార్ట్ పై కళ్యాణ్ రామ్, దర్శకుడు వశిష్ఠ ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ ను రివీల్ చేశారు. 
 

57

పార్ట్ 2లోనే అసలు కథ ప్రారంభం అవుతుందన్నారు. పార్ట్ 1లో కేవలం బింబిసారుడు, దేవదత్త, ఐరా పాత్రలతో పాటు త్రిగర్తల సామ్రాజ్యం, అస్మక రాజ్యాలను పరిచయం చేశాడని తెలిపారు. పార్ట్ 2లోనే అసలు కథ ప్రారంభం కానుందన్నారు. ఇంతకీ ఆ కథ ఎలా ఉండబోతుందని అడిగి ప్రశ్నకు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
 

67

బింబిసారుడు ఎంతటి రాక్షస గుణం కలిసిన వాడో, ఎంత బలశాలినో, ఏఏ రాజ్యాలను ఎలా స్వాధీనం చేసుకున్నాడో చూపించబోతున్నారంట. అలాగే అన్నాదమ్ములైనా బింబిసారుడు, దేవదత్తకు అసలు సమస్య ఎలా మొదలైంది. వీరి తండ్రి పాత్ర ఎంతటి కీలకమైనదో రెండో భాగంలో చెప్పనున్నారు. అంటే బింబిసారుడి అసలు విశ్వరూపం పార్ట్ లోనే అని అర్థమవుతోంది. దీంతో బింబిసార 2పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.  
 

77

కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేయగా.. హీరోయిన్లుగా గ్లామర్ బ్యూటీలు కేథరిన్ ట్రెసా (Catherine Tresa), సంయుక్త  మీనన్ నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై చిత్రాన్ని నిర్మించారు. నటుడు ప్రకాష్ రాజ్,  శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి కీలక పాత్రలో నటించారు. ఎంఎం కీరవాణీ సంగీతం అందించారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
YouTuber Madhumita: కిలాడీ యూట్యూబర్ మధుమితపై దొంగతనం కేసు.. తెలివిగా మెడలో గొలుసు కొట్టేసింది
Recommended image2
Nana Patekar Net Worth: రూ. 35 నుంచి కోట్ల ఆస్తుల వరకు.. నానా పటేకర్ రియల్ లైఫ్ అండ్ నెట్ వర్త్ డిటైల్స్
Recommended image3
Mahesh Babu: మనమంతా ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ .. మహేష్ బాబు మాత్రం జీవితంలో అస్సలు ముట్టుకోరు. సూపర్ స్టార్ ఫిట్‌నెస్ సీక్రెట్ అదేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved